ఉజ్వ‌ల భార‌త భ‌విత‌కు .. భార‌త్‌మాల ... రూ.7ల‌క్ష‌ల కోట్లు

మౌలిక రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున 7 లక్ష‌ల కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుకు సంబంధించి ప‌లు ముఖ్య విష‌యాల‌ను తెలుసుకుందాం.

దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయటం ద్వారా జిడిపి (స్థూల జాతీయ ఉత్పత్తి)ని పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. వివిధ రంగాల్లో మౌలిక వసతుల పెంపునకు 14 లక్షల కోట్ల రూపాయల పథకాలను ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ అమలు తరువాత దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని, నిరుద్యోగం పెరుగుతోందంటూ బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం పెద్దఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయాలు ప్రకటించటం గమనార్హం. మౌలిక రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున 7 లక్ష‌ల కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుకు సంబంధించి ప‌లు ముఖ్య విష‌యాల‌ను తెలుసుకుందాం.

 ర‌హ‌దారుల నిర్మాణానికి ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌

ర‌హ‌దారుల నిర్మాణానికి ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌

మంగళవారం ప్రకటించిన 14 లక్షల కోట్ల పెట్టుబడుల పథకాలతోపాటు ఇతర పలు పథకాలూ అమలు జరుగుతున్నాయి. వీటి పెట్టుబడులను లెక్కలోకి తీసుకుంటే మొత్తం పెట్టుబడి ఎంతో పెరుగుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఒక్క భారత్ నెట్ కార్యక్రమానికే 43 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు జైట్లీ ప్రకటించారు. భారత్ మాల పథకం కింద చేపడుతున్న రహదారుల నిర్మాణంతో 14వేల కోట్ల పనిదినాల ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి జైట్లీ మీడియాకు నిర్ణయాలు ప్రకటించారు. భారత్ మాల పేరిట దేశంలోని ప్రధాన రోడ్లు, గ్రామీణ రోడ్లు, సరిహద్దు రోడ్ల నిర్మాణానికి దాదాపు ఐదు లక్షల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో 2వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపడతారు.

బ్యాంకింగ్ రంగ పున‌రుజ్జీవ‌నానికి

బ్యాంకింగ్ రంగ పున‌రుజ్జీవ‌నానికి

బ్యాంకుల పునరుజ్జీవనం, అర్హులకు రుణాలు ఇవ్వటం ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు 2.1 లక్షల కోట్లు

ప్ర‌భుత్వ రంగ బ్యాంకులకు అందిస్తారని జైట్లీ ప్రకటించారు. రైల్వే సర్వతోముఖాభివృద్ధికి లక్షా 31 వేల కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు పెద్దపీట వేయటం ద్వారా భారీస్థాయిలో ఉపాధి కల్పనకు కేంద్రం శ్రీకారం చుట్టింది. పిఎస్‌యులకు పెద్దఎత్తున పెట్టుబడులు ఇవ్వటంతోపాటు, వీటిలో పెద్దఎత్తున ఆర్థిక సంస్కరణలు అమలు చేయనున్నట్టు జైట్లీ ప్రకటించారు. బ్యాంకింగ్ సంస్కరణలను తరువాత ప్రకటిస్తామన్నారు. యూపీఏ హయాంలో బ్యాంకులు బాధ్యతారహితంగా రుణాలు మంజూరు చేయటంవల్లే ఎన్‌పిఏ (నాన్ పెర్ఫార్మెన్స్ అస్సెట్స్) బాగా పెరిగిందని జైట్లీ ఆరోపించారు.

జీఎస్టీపై స్పందించిన ప్ర‌భుత్వం

జీఎస్టీపై స్పందించిన ప్ర‌భుత్వం

పిఎస్‌యుల పునరుజ్జీవనానికి పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లోకి వచ్చిన నిధులనూ ఉపయోగిస్తారని, ఇంద్రధనుష్ ద్వారా ప్రభుత్వం 18 వేల కోట్ల బడ్జెట్ మద్దతిస్తుందని జైట్లీ తెలిపారు. మైక్రో ఎకనమిక్ ఫండమెంటల్స్ చాలా ధృఢంగా ఉన్నాయన్నారు. ద్రవ్యోల్భణం తగ్గుతోంది. కరెంట్ ఖాతా లోటు 0.7 శాతం ఉంది. ఫోరెక్స్ నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. ఈ నిల్వలు 400 బియలన్ డాలర్లను అధిగమించాయని జైట్లీ వెల్లడించారు. ఉద్యమ మిత్ర వెబ్ సైట్ ద్వారా పారిశ్రామికవేత్తల పథకాలకు రుణాలు మంజూరు చేస్తారని జైట్లీ తెలిపారు.

జీఎస్టీ మూలంగా ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తులకూ జైట్లీ కొంతఊరట కలిగించారు. రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేసినందుకు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకుగాను వ్యాపారస్తులకు విధించిన జరిమానాను రద్దు చేస్తున్నట్టు జైట్లీ ప్రకటించారు.

 తీర‌ప్రాంత రోడ్ల‌ను సైతం

తీర‌ప్రాంత రోడ్ల‌ను సైతం

పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ అమలు వలన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదన్న ప్రతిపక్షాల ఆరోపణలను జైట్లీ తిప్పికొట్టారు. భారత్ మాల కార్యక్రమం కింద రానున్న ఐదేళ్లలో 5.35 లక్షల కోట్లతో 34.8వేల కిలోమీటర్లమేర రహదారుల నిర్మాణం చేపడతామని జైట్లీ వివరించారు. గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని దాదాపు 2 వేల కిలోమీటర్ల తీర ప్రాంత రోడ్లను నిర్మిస్తామన్నారు. 8,100 మంది ఇష్టపూర్వక అప్రమేయదారులు (విల్‌ఫుల్ డిఫాల్టర్స్) బ్యాంకులకు 76,600 కోట్లు ఇవ్వాల్సి ఉందని జైట్లీ చెప్పారు.

జీడీపీ ప‌ట్టాలెక్కేనా...

జీడీపీ ప‌ట్టాలెక్కేనా...

కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల కార‌ణంగా ఇక‌పై జీడీపీ పెరుగుతుందని ప్రకటించారు. భారత మాల కార్యక్రమం కింద 9వేల కిలోమీటర్లమేర ఎకనామిక్ కారిడార్లు, ఆరు వేల కిలోమీటర్లమేర ఇంటర్ కారిడార్లు, ఫీడర్ రోడ్ల నిర్మాణం, 2వేల కిలోమీటర్ల సరిహద్దు రోడ్ల నిర్మాణం, 2 వేల కిలోమీటర్ల తీర ప్రాంత రోడ్ల నిర్మాణం, 800 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రోడ్లు, పదివేల కిలోమీటర్లమేర జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందని జైట్లీ వివరించారు.

అంకెల్లో ... భార‌త‌మాల ప్రాజెక్టు

అంకెల్లో ... భార‌త‌మాల ప్రాజెక్టు

ల‌క్ష‌ల కోట్ల‌లో ఖ‌ర్చు చేయ‌డం ద్వారా ఈ పనులు చేప‌ట్ట‌నున్నారు.

  • 34,800 కి.మీ మేర జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం
  • 9000 కి.మీ పొడ‌వైన ఆర్థిక న‌డ‌వాలు(ఎక‌న‌మిక్ కారిడార్లు)

  • 6000 కి.మీ అంత‌ర్గ‌త కారిడార్లు, ఫీడ‌ర్ ర‌హ‌దారులు

  • 2000 కి.మీ స‌రిహ‌ద్దు రాదారులు

  • 800 కి.మీ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే

  • 5000 కి.మీ ర‌హ‌దారుల అప్‌గ్రెడేష‌న్‌

  • 10వేల కి.మీ జాతీయ ర‌హ‌దారుల అప్‌గ్రెడేష‌న్

  • 2000 కి.మీ మేర తీర‌ప్రాంత రోడ్ల అభివృద్ది

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+