For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశంలోని ప్ర‌భుత్వ బ్యాంకుల‌కు రూ.2.11 లక్షల కోట్ల నిధులు

నిరర్థక ఆస్తులతో కునారిల్లుతున్న పిఎస్‌బిలకు రానున్న రెండేండ్ల కాలంలో దాదాపు రూ.2.11 లక్షల కోట్ల మేర మూలధన నిధులను అందించేందుకు ఉద్దేశించిన ప్రణాళికకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించ

|

నోట్ల ర‌ద్దు, జీఎస్టీ వంటి చ‌రిత్రాత్మ‌క సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొట్టుమిట్టాడుతున్న వేళ ప్ర‌భుత్వం స్పందించింది. పలు పరోక్ష ఉద్దీపన చర్యలను చేపట్టేందుకు కేంద్ర కేబినెట్‌ మంగళవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థలో స్తబ్దతకు ప్రధాన కారణంగా నిలుస్తున్న బ్యాంకింగ్‌ రంగానికి తిరిగి కొత్త ప్రోత్సాహానిచ్చేలా ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పిఎస్‌బి) బాసటగా నిలవాలని కేబినెట్‌ నిర్ణయించింది. నిరర్థక ఆస్తులతో కునారిల్లుతున్న పిఎస్‌బిలకు రానున్న రెండేండ్ల కాలంలో దాదాపు రూ.2.11 లక్షల కోట్ల మేర మూలధన నిధులను అందించేందుకు ఉద్దేశించిన ప్రణాళికకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను కూలంక‌షంగా తెలుసుకుందాం.

బ్యాంకుల‌కు మూల‌ధ‌న వ‌న‌రుల తోడ్పాటు

బ్యాంకుల‌కు మూల‌ధ‌న వ‌న‌రుల తోడ్పాటు

ఇందులో దాదాపు రూ.1.35 లక్షల కోట్ల సొమ్మును రీక్యాపిటలైజేషన్‌ బాండ్ల రూపంలోనూ, రూ.76,000 కోట్ల మేర సొమ్మును బడ్జెటరీ దన్ను, ఈక్విటీ జారీ రూపంలో బ్యాంకులకు సమకూర్చనున్నట్టుగా కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

బ్యాంకులకు బాసటగా నిలిచేందుకు గాను జారీ చేయనున్న బాండ్ల స్వరూపం, వాటి వివరాలను సమయానుసారంగా వెల్లడించనున్నట్టుగా కుమార్‌ తెలిపారు. 2015లో రూ.2.75లక్షల కోట్లుగా ఉన్న బ్యాంకుల నిరర్థక ఆస్తులు, ఈ ఏడాది జూన్‌ నాటికి రూ.7.33 లక్షల కోట్లకు చేరిన విషయం తెలిసిందే.

2. వ్య‌వ‌స్థ‌లో ఆర్థిక మాంద్యం

2. వ్య‌వ‌స్థ‌లో ఆర్థిక మాంద్యం

డిమాండ్‌ తగ్గి ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు సర్కారు చేపట్టిన పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి కారణంగా ఆర్థికంలో మరింత మాంద్యం నెలకొంది. మొండి బాకీలు అంతకంతకు పెరగడం, మూలధన కొరత కారణంగా బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు జంకుతున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థకు ప్రాణ వాయువు లాంటి బ్యాంకుల నుంచి పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారికి రుణాలు అందడం లేదు. ఫలితంగా చాలా యూనిట్లు ఉత్పత్తిని తగ్గించుకోవడంతో పాటు పలు కీలక ప్రాజెక్టులు నిలిపివేశాయి. ఫలితంగా పారిశ్రామిక వృద్ధి పడకేసింది. దీంతో ఉద్యోగాల సృష్టి పూర్తిగా స్తంభించడంతో పాటు ఉన్న కొలువులు గాలిలో కలిసి పోతున్నాయి. మరోవైపు వృద్ధి రేటు మూడున్నరేండ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే తొలత ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టైన బ్యాంకులకు తిరిగి పూర్వ వైభవం తేవడమే ఏకైక మార్గమని సర్కారు భావించినట్టుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే బ్యాంకులకు భారీ బాసటను ప్రకటించినట్టుగా అర్థమవుతోంది.

3. జైట్లీ నోట.. మ‌ళ్లీ సంస్క‌ర‌ణ‌ల మాట‌

3. జైట్లీ నోట.. మ‌ళ్లీ సంస్క‌ర‌ణ‌ల మాట‌

బ్యాంకులకు మరింత మూలధనీకరణతో పాటు, ఈ రంగంలో రానున్న రోజుల్లో మరిన్ని వరుస సంస్కరణలు చేపట్టునున్నట్టుగా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంకేతాలిచ్చారు. మరోవైపు దేశ ఆర్ధిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కునేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. గత కొన్ని వారాలుగా ఆర్ధిక వ్యవస్థపై చాలా సమీక్షలు జరిగాయన్నారు. కాగా గతంలో నిర్ణయించినట్టుగానే ఇంధ్రధనుష్‌ పథకంలో భాగంగా బ్యాంకులకు మిగతా రూ.18,000 కోట్ల మేర నిధులు అందుతాయని జైట్లీ తెలిపారు. దేశంలో బ్యాంకులు అంతర్జాతీయ ప్రమాణాల మేరకు బాసిల్‌-3 నిబంధనలను అందుకొనే విత్త సంస్థలకు రూ.70,000 కోట్ల మూలధనీకరణ జరిపేందుకు సర్కారు 2015లో ఇంధ్రధనుష్‌ పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగ సర్కారు 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాలలో వరుసగా రూ.25,000 కోట్ల మేర నిధులను బ్యాంకులకు అందించింది. 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరానికి సాలీనా రూ.10,000 కోట్ల మేర నిధులను అందించేందుకు సర్కారు ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది.

4. అప్ప‌ట్లో ఇంద్ర‌ధ‌నుష్ ప్ర‌క‌టించినప్ప‌టికీ...

4. అప్ప‌ట్లో ఇంద్ర‌ధ‌నుష్ ప్ర‌క‌టించినప్ప‌టికీ...

ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ చ‌ర్య ద్వారా మొండి బ‌కాయిల విష‌యంలో బ్యాంకుల‌కు కాస్త ఉప‌శ‌మ‌నంతో పాటు, బాసెల్-3 నిబంధ‌న‌ల‌ను పాటించేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌మాణాల‌ను అందుకోవ‌డం, ప్రాధాన్య రంగాల‌కు రుణ విత‌ర‌ణ వంటివ‌న్నీ సాధ్య‌మ‌వుతాయ‌ని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మిష‌న్ ఇంద్ర ధ‌నుష్ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించిన కేంద్రం ఇప్ప‌టికే బ్యాంకుల‌కు మూల‌ధన ఏర్పాట్లు చేసింది. అయితే అవి ఏ మాత్రం స‌రిపోవ‌డం లేదు. దీంతో కొత్త‌గా పెద్ద ఎత్తున బ్యాంకుల‌కు మూల‌ధ‌నాన్ని స‌మ‌కూర్చే చ‌ర్య‌ల‌కు కేంద్రం సిద్ద‌మైంది.

నిధుల కొర‌త‌, జీఎస్‌టీ కాదు... ఆర్థిక వృద్ధి వెనుక‌బాటుకు ఇంకేదో ఉందినిధుల కొర‌త‌, జీఎస్‌టీ కాదు... ఆర్థిక వృద్ధి వెనుక‌బాటుకు ఇంకేదో ఉంది

Read more about: banks arun jaitley
English summary

దేశంలోని ప్ర‌భుత్వ బ్యాంకుల‌కు రూ.2.11 లక్షల కోట్ల నిధులు | Centre announced 2.11 lakh crores for banks recapitalisation

Government plans to come out with ‘Indradhanush 2.0’, a comprehensive plan for recapitalisation of public sector lenders, with a view to make sure they remain solvent and fully comply with the global capital adequacy norms, Basel-III.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X