101 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్, 10వేలకు పైనే నిఫ్టీ
పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు సానుకూలంగా కదలడంతో వరుసగా రెండో రోజూ మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ 101 పాయింట్లు పుంజుకుని 32,607 వద్ద నిలవగా... నిప్టీ 23 పాయింట
పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు సానుకూలంగా కదలడంతో వరుసగా రెండో రోజూ మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ 101 పాయింట్లు పుంజుకుని 32,607 వద్ద నిలవగా... నిప్టీ 23 పాయింట్లు పుంజుకొని 10208 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే పీఎస్‌యూ(1.8%), పవర్(1.28%), మౌలిక రంగం(1.25%), చమురు,సహజ వాయువు(0.63%) లాభపడగా మరో వైపు ఐటీ(0.76%), హెల్త్‌కేర్(0.41%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.31%), టెక్నాలజీ(0.22%) నష్టపోయాయి.

సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో ఆసియా పెయిన్స్ (+ 4.1%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (+ 3.56%), ఎన్‌టీపీసీ (+ 2.92%), ఒఎన్జిసి (+ 2.56%), హెచ్యుఎల్ (+ 1.81%) ముందుండగా; మరో వైపు టాటా మోటర్స్ (-1.54% ), ఇన్ఫోసిస్ (-1.37%), సన్ ఫార్మా (-1.07%), లూపిన్ (-0.98%) మరియు ఎం అండ్ ఎం (-0.81%) ఎక్కువగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications