For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొండి బకాయిల అంశం మ‌ళ్లీ తెర‌పైకి... యాక్సిస్ ఫ‌లితాల‌తో బెంబేలు

ఇప్పటికే ల‌క్ష‌ల కోట్ల‌లో పేరుకుపోయిన ఈ వ‌సూలు కాని రుణాల‌(ఎన్‌పీఏల‌)కు మరో రూ.40 వేల కోట్ల మేర అదనంగా ఎన్‌పీఏలు జతయ్యే ప్రమాదం ఉందని బ్యాంకింగ్‌ రంగం ఆందోళనచెందుతోంది.

|

మొండి బ‌కాయిల‌ ప్ర‌భావం(ఎన్‌పీఏ) దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని ఇప్ప‌ట్లో వదిలేలా లేదు.ఇప్పటికే ల‌క్ష‌ల కోట్ల‌లో పేరుకుపోయిన ఈ వ‌సూలు కాని రుణాల‌(ఎన్‌పీఏల‌)కు మరో రూ.40 వేల కోట్ల మేర అదనంగా ఎన్‌పీఏలు జతయ్యే ప్రమాదం ఉందని బ్యాంకింగ్‌ రంగం ఆందోళనచెందుతోంది. ఆర్‌బీఐ ఆదేశాలతో యాక్సిస్‌ బ్యాంక్‌ కన్సార్టియంకు చెందిన ఎనిమిది రుణ ఖాతాలను ఎన్‌పీఏలుగా పునర్‌వర్గీకరించడమే దీనికి ప్రధాన కారణం.

 దేశ మొండి బ‌కాయిల తీవ్ర‌త మ‌ళ్లీ బ‌య‌ట‌కు వెల్ల‌డైంది

2016-17కు సంబంధించి వార్షిక రిస్క్‌ ఆధారిత పర్యవేక్షణ ప్రక్రియ(ఆర్‌బీఎస్‌)లో భాగంగా ఈ ఏడాది మార్చి నాటికి యాక్సిస్‌ రుణాల వర్గీకరణ, కేటయింపులపై ఆర్‌బీఐ ఈ ఆదేశాలను జారీచేసింది. దీని ఫలితంగా మొత్తం 9 స్టాండర్డ్‌ (క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించేవి)రుణ ఖాతాలను ఎన్‌పీఏలుగా చూపాల్సివచ్చిందని.. ఇందులో 8 ఖాతాలు కనార్సియం(ఇతర బ్యాంకులతో కలిపి ఇచ్చిన రుణాలు)కు చెందినవని ఇటీవలి క్యూ2(2017-18, సెప్టెంబర్‌ క్వార్టర్‌) ఫలితాల సందర్భంగా యాక్సిస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌ వరకూ ఈ 9 ఖాతాలనూ యాక్సిస్‌ బ్యాంక్‌ స్టాండర్డ్‌ రుణాలుగానే ఖాతా పుస్తకాల్లో వర్గీకరించింది. జూన్‌ చివరినాటికి ఈ ఖాతాల రుణ బకాయిల విలువ దాదాపు రూ.42,000 కోట్లుగా అంచనా. వీటిలో కేవలం 6 శాతం రుణ బకాయిని మాత్రమే ఎన్‌పీఏలుగా యాక్సిస్‌ లెక్కగట్టడం గమనార్హం. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ ఖాతాలన్నింటినీ యాక్సిస్‌ బ్యాంక్‌ ఎన్‌పీఏలుగా ప్రకటించడంతో కన్సార్షియంలోని ఇతర బ్యాంకుల్లో భయం మొదలైంది. తమ రుణ బకాయిల పరిస్థితి ఏంటన్నది ఆయా బ్యాంకుల ఆందోళన. అవి కూడా ఆ ఖాతాల్ని ఎన్‌పీఏలుగా చూపించాల్సివుంటుంది.ఇప్పటికే బ్యాంకింగ్‌ రంగం రూ.8 లక్షల కోట్లకు పైగా మొండిబకాయిలతో కునారిల్లుతోన్న‌ సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ వెలువడిన క్యూ2 ఫలితాలను చూస్తే.. పరిస్థితి కుదుటపడకపోగా, ఎన్‌పీఏలు అంతకంతకూ పెరుగుతున్న దాఖలాలు వెల్ల‌డ‌వుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 దేశ మొండి బ‌కాయిల తీవ్ర‌త మ‌ళ్లీ బ‌య‌ట‌కు వెల్ల‌డైంది

యాక్సిస్ బ్యాంకు ఇటీవ‌ల వెల్ల‌డించిన జులై-సెప్టెంబ‌రు త్రైమాసిక ఫ‌లితాల్లో దాదాపు రూ.27 వేల కోట్ల మొండి బ‌కాయిల‌ను బ్యాలెన్స్ షీట్లో చూపించింది. అంత‌కు ముందు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆ బ్యాంకు ఎన్‌పీఏల భారం రూ.22,031 కోట్లుగా ఉంది. రెండేళ్ల క్రితం కేవ‌లం రూ.4451 కోట్ల మేర‌కు మాత్ర‌మే ఈ బ్యాంకు వ‌సూలు కాని రుణాల తీవ్ర‌త ఉంది.

Read more about: npa banking
English summary

మొండి బకాయిల అంశం మ‌ళ్లీ తెర‌పైకి... యాక్సిస్ ఫ‌లితాల‌తో బెంబేలు | bad loans problem is getting worse but banks are reluctant to even acknowledge

India’s bad loans problem is getting worse but banks are reluctant to even acknowledge it in their quarterly results. Take Axis Bank, one of the country’s major private lenders
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X