టైర్-2 ప‌ట్ట‌ణాల్లో మ్యూచువ‌ల్ ఫండ్ల కొనుగోలు హ‌వా

సెప్టెంబ‌రు చివ‌రి నాటికి టైర్-2 ప‌ట్టణాల్లో మ్యూచువల్ ఫండ్ ఆస్తుల కొనుగోలు విలువ రూ.3.8 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది. గ‌తేడాది ఉన్న రూ.2.74 ల‌క్ష‌ల కోట్ల‌తో పోలిస్తే ఇది 38% పెరిగ‌న‌ట్లు లెక్క అని ఐసీఆ

సెప్టెంబ‌రు చివ‌రి నాటికి టైర్-2 ప‌ట్టణాల్లో మ్యూచువల్ ఫండ్ ఆస్తుల కొనుగోలు విలువ రూ.3.8 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది. గ‌తేడాది ఉన్న రూ.2.74 ల‌క్ష‌ల కోట్ల‌తో పోలిస్తే ఇది 38% పెరిగ‌న‌ట్లు లెక్క అని ఐసీఆర్‌ఏ(ఇక్రా) తెలిపింది. మొత్తం మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిశ్ర‌మ‌లో కేవ‌లం టైర్-2 ప‌ట్ట‌ణాల వాటా ఇప్ప‌టి దాకా ఉన్న దాని ప్ర‌కారం 17.7% ఉంది. అంతే కాకుండా డైరెక్ట్ ప్లాన్ల కంటే రెగ్యుల‌ర్ ప్లాన్ల ద్వారానే టైర్-2 ప‌ట్ట‌ణాల్లోని పెట్టుబ‌డిదారులు మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డి మార్గంలోకి ప్ర‌వేశిస్తున్న‌ట్లు తెలుస్తోంది. టైర్-1 స్థాయి ప‌ట్ట‌ణాల్లో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోకి డైరెక్ట్ ప్లాన్ల‌లోకి ప్ర‌వేశించే వారి సంఖ్య 46 శాతంగా ఉండ‌గా అదే టైర్-2 స్థాయి 15 ప‌ట్ట‌ణాల్లో ఇది 21%గా ఉంది.

మ్యూచువ‌ల్ ఫండ్ల కొనుగోలు

ముఖ్య న‌గ‌రాల‌యిన న్యూఢిల్లీ(ఎన్‌సీఆర్‌), ముంబ‌యి(థానే,న‌వీ ముంబ‌యి క‌లుపుకుని), కోల్‌క‌త‌, చెన్నై, బెంగుళూరు, అహ్మ‌దాబాద్‌, బ‌రోడా, చంఢీఘ‌డ్, హైద‌రాబాద్‌, జైపూర్, కాన్పూర్‌, ల‌క్నో, ప‌నాజి, పుణె, సూర‌త్ వంటివి మ్యూచువ‌ల్ ఫండ్ పరిశ్ర‌మ‌కు టాప్ బిజినెస్ న‌గ‌రాలు. అయితే ఇవి కాకుండా రెండవ స్థాయి న‌గ‌రాల్లో సైతం మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిశ్ర‌మ ఏడాది కాలంగా బాగా పుంజుకుంది. అసెట్ మేనేజ్‌మెంట్ లేదా మ్యూచువ‌ల్ పండ్ కంపెనీల‌తో పాటు, యాంఫీ మ్యూచువ‌ల్ ఫండ్ విష‌యాల గురించి ప్ర‌చారం ఎక్కువ‌గా చేయ‌డంతో ఎక్కువ‌గా మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబడులు పెరిగాయని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. సెప్టెంబ‌రు నెల‌కు మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిశ్ర‌మ‌లో మొత్తం ఆస్తుల విలువ రూ.20.40 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. ఆగ‌స్టు నెల‌లో కంటే ఇది స్వ‌ల్పంగా ఎక్కువ‌. అదే స‌మ‌యంలో మొత్తం ఫోలియోల సంఖ్య ఆగ‌స్ట్‌లో ఉన్న దాని కంటే 2% పెరిగి సెప్టెంబ‌రులో 6.20 కోట్లుగా ఉన్నాయి. కొత్త ఫోలియోల విష‌యంలో 9.24 ల‌క్ష‌ల ఈక్విటీ ఫండ్ ఫోలియో ఖాతాలు, 2.16 లక్ష‌ల‌ బ్యాలెన్స్‌డ్ ఫండ్ ఫోలియో ఖాతాలు జ‌త చేరాయి. అదే నెల కాలంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల విష‌యంలో ఫోలియోల సంఖ్య‌లో 5564, అదే ఫండ్ ఆఫ్ ఫండ్స్ విష‌యంలో 2259 త‌గ్గుద‌ల జ‌రిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+