ముహూరత్ ట్రేడింగ్ సాయంత్రం
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో 'ముహూరత్' ట్రేడింగ్ నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల మధ్య ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహిస్తారు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో 'ముహూరత్' ట్రేడింగ్ నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల మధ్య ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహిస్తారు. గంట పాటు జరగనున్న ఈ ట్రేడింగ్ వ్యవహారాలను శుక్రవారం ఖాతాల్లో సర్దుబాటు చేయనున్నారు. 'బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ' (బీఎస్‌ఈ)లో ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఈక్విటీ అండ్ ఎస్‌ఎల్‌బీ విభాగాల్లో ముహూరత్ ట్రేడింగ్ జరగనుంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లో ప్రత్యేక ట్రేడింగ్ కరెన్సీ, డెరివేటివ్స్, ఫీచర్స్ అండ్ ఆఫ్షన్స్, క్యాపిటల్ మార్కెట్ విభాగాల్లో నిర్వహించనున్నారు. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించేందుకు బాంబే స్టాక్ ఎక్చేంజీ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్చేంజీ (ఎన్ఎస్ఈ)లు ఏర్పాట్లు చేశాయి.

గత ఏడాది కాలంగా భారత స్టాక్ మార్కెట్లు నిలకడగా వృద్ధి సాధిస్తున్నాయి. నిప్టీ 10వేల పాయింట్లక కీలకమై న స్థాయిని అధిగమించింది. ఫ్రంట్‌లైన్ ఇండెక్స్‌లు అన్నీ ఈ ఏడాది ప్రారంభం నుంచి 20-22 మేర లాభపడ్డాయి. ఇప్పుడు దీపావళి సందర్భంగా రా బోయే ఏడాది కాలంపాటు బాగా మెరుగ్గా రాణిం చే షేర్ల గురించి పలు సంస్థలు సిఫారసులు చేస్తున్నాయి. భారత్ మార్కెట్లలో ముహూరత్ ట్రేడింగ్ కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. హిందూ కేలండ ర్ ప్రకారం గుజరాతీలు, మార్వాడీలు ఎక్కువగా ఉ ండే బ్రోకింగ్ కమ్యూనిటీలో సాంప్రదాయాలకు ప్రాధానం ఎక్కువే. అందుకే దీపావళి సందర్భంగా కొత్త ఏడాదిగా భావించి అకౌంట్ సెటిల్‌మెంట్స్ చేస్తుంటారు. గురువారం రోజు ముహూరత్ ట్రేడిం గ్ సాయంత్రం సమయంలో ఉంటుంది. దీపావళికి సెలవు రోజు అయినప్పటికీ ప్రత్యేకంగా ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు ట్రేడింగ్ నిర్వహిస్తారు.


Click it and Unblock the Notifications