రెండు రోజుల లాభాలకు బ్రేక్
వరుసగా రెండు రోజులపాటు లాభాల దుమ్ము రేపిన మార్కెట్లు చివరికి పెద్దగా లాభం లేదు, నష్టం లేదు అన్నట్లుగా ముగిశాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య సూచీలు కదలాడాయి.
స్తబ్దుగా కొనసాగిన దేశీయ మార్కెట్లు
వరుసగా రెండు రోజులపాటు లాభాల దుమ్ము రేపిన మార్కెట్లు చివరికి పెద్దగా లాభం లేదు, నష్టం లేదు అన్నట్లుగా ముగిశాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య సూచీలు కదలాడాయి. చివరికి నామమాత్ర మార్పులతో ముగిశాయి. సెన్సెక్స్ 24 పాయింట్లు క్షీణించి 32,609 వద్ద నిలవగా.. నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 10,234 వద్ద స్థిరపడ్డాయి.
దాదాపు 45 రోజులుగా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం నగదు విభాగంలో నామమాత్రంగా రూ. 30 కోట్ల విలువైన స్టాక్స్ మాత్రమే విక్రయించారు. అయితే శుక్రవారం రూ. 1698 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఎఫ్‌పీఐలకు ధీటుగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్న దేశీ ఫండ్స్(డీఐఐలు) సోమవారం దాదాపు రూ. 273 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. ఈ బాటలో శుక్రవారం సైతం డీఐఐలు రూ. 1590 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(0.79%), చమురు,సహజవాయు రంగం(0.74%), మూలధన వస్తువులు(0.43%), పీఎస్‌యూ(0.41%) లాభాల్లో కొనసాగిన వాటిలో ఉండగా మరో వైపు ఐటీ(0.24%), బ్యాంకింగ్(0.24%),కన్సూమర్ డ్యూరబుల్స్(0.2%) నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ, నష్టపోయిన వాటిలో టాప్ షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
సిప్లా(4.09%), భారతీ ఎయిర్టెల్ (+ 2.86%), ఆసియా పెయింట్స్ (+ 2.06%), బజాజ్ ఆటో (+ 1.09%), హీరో మోటోకార్ప్ (+ 0.85%) లాభాల్లో కొనసాగిన వాటిలో ఉన్నాయి.
మరో వైపు బాగా నష్టపోయిన వాటిలో యాక్సిస్ బ్యాంక్(1.44%), టాటా మోటార్స్(1.04%), ఇన్పోసిస్(0.84%), డాక్టర్ రెడ్డీస్(0.62%), కొటక్ బ్యాంక్(0.44%) మొదలైనవి ఉన్నాయి.


Click it and Unblock the Notifications