సంప్రదాయ పాలసీలే ఉత్తమం
సంప్రదాయ పథకాల్లోనూ మరో రెండు రకాలున్నాయి. అవి పార్టిసిపేటింగ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్‌లు. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్‌లలో బీమా కంపెనీ ముందుగానే లబ్దిదారుడికి తాము ఇవ్వనున్న ప్రోత్సాహకాల
చరిత్రకారుల కథనాల ప్రకారం తొలిసారిగా ఇన్స్యూరెన్స్ ప్రారంభమైంది పురాతన రోమ్ నుంచే. అక్కడ చనిపోయిన వారి జ్ఞాపకార్థం పేదలు బతికేలా వారిపై డబ్బులను వెదజల్లేవారు. దాన్నే అప్పుడు బీమాగా పరిగణించేవారు. కాల గమనంలో ఎంతో మార్పు వచ్చింది. దురదృష్టకర సంఘటనలు ఎదురైనప్పుడు సొంత కుటుంబ పోషణకు ఉపయోగపడేదిగా బీమా రూపాంతం చెందింది. అనుకోని సంఘటనలు జరిగితే తనపై ఆధారపడివున్నవారి అవసరాలను తీర్చడానికి ప్రతిఒక్కరూ బీమాను నమ్ముకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అయితే, బీమా ఎంతగా విస్తరించిందో అంతేలా రిస్క్‌లూ పెరిగిపోయాయి. అవి కేవలం బీమా చేసుకునేవారికే కాదు... బీమా సౌకర్యం కల్పిస్తున్న కంపెనీలకు కూడా

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల బీమా పథకాలు అందుబాటులో వున్నాయి. వాటిల్లో ప్రధానమైనవి సంప్రదాయ బీమా ప్రణాళికలు. వీటిల్లో ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రజల పెట్టుబడులను నిర్వహిస్తుంది. పెట్టుబడులు ఏ విధంగా ఉపయోగిస్తున్నారన్న విషయంలో కస్టమర్‌కు ఎంత మాత్రం ప్రాధాన్యత వుండదు. ఇదే సమయంలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కంపెనీ మేనేజ్ చేస్తుంది కాబట్టి కొంత మేరకు రాబడి గ్యారంటీగా వస్తుంది.
ఈ సంప్రదాయ పథకాల్లోనూ మరో రెండు రకాలున్నాయి. అవి పార్టిసిపేటింగ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్‌లు. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్‌లలో బీమా కంపెనీ ముందుగానే లబ్దిదారుడికి తాము ఇవ్వనున్న ప్రోత్సాహకాల గురించి వివరిస్తుంది. భవిష్యత్‌లో పనితీరుపై వుండే రిస్క్‌ను ముందే లెక్కిస్తుంది. ఈ తరహా ప్లాన్‌లు రాబడి తక్కువైనా తమ పెట్టుబడులకు పూర్తి రక్షణ వుండాలని భావించేవారికి నప్పుతాయి. ఇన్వెస్ట్‌మెంట్‌కు పూర్తిగా ప్రొటక్షన్ కల్పిస్తూ, ముందు నిర్దేశించుకున్న కండిషన్స్ మార్చకుండా ప్లాన్ సాగుతుంది.
ఇక పార్టిసిపేషన్ విభాగంలో బీమా కంపెనీల లాభాల్లో కస్టమర్‌కు భాగం వుంటుంది. ఇది బోనస్‌ల రూపంలో లభిస్తుంది. ప్రస్తుతం అమలులో వున్న బీమా చట్టం ప్రకారం బీమా కంపెనీ తొమ్మిదింట ఒక వంతు లాభాలను తనకు వుంచుకుని మిగతా ఎనిమిది వంతులనూ కస్టమర్లకు పంచాల్సి వుంటుంది. దీన్నే పరిశ్రమలో '90/10' రూల్‌గా అభివర్ణిస్తారు. దీర్ఘకాలంలో సంపద సృష్టిపై కన్నేసి అధిక రాబడిని కోరుకునేవారికి ఈ తరహా ప్లాన్‌లు సరిపోతాయి. ఇవన్నీ సేవింగ్ ప్లాన్‌ల విభాగంలోకి వస్తాయి.
సంప్రదాయ ప్రణాళికల్లో పాలసీదారులపై పెద్దగా ఒత్తిడులుండవు. అనుకున్న సమయానికి అనుకున్న మొత్తం చేతికి అందుతుంది. మార్కెట్లో చాలా రకాల ట్రెడిషనల్ ప్లాన్‌లు వున్నాయి. ఎండోమెంట్, మనీ బ్యాక్, హోల్ లైఫ్, టర్మ్ పాలసీలు తదితరాులు రిస్క్ నుంచి రక్షిస్తూ, స్పష్టమైన రిటర్న్‌లతో పాటు పన్ను రాయితీలనూ, ప్రోత్సాహకాలనూ అందిస్తున్నాయి.
టర్మ్ ఇన్స్యూరెన్స్ లేదా ప్యూర్ రిస్క్ పాలసీలుగా పేర్కొనే రెండవ తరహా పాలసీలు నియమిత కాలపరిమితికి లోబడి వుంటాయి. వీటిల్లో ఏ విధమైన పొదుపు ప్రోత్సాహకాలూ వుండవు. ప్రీమియం పెరుగుతూ వుండటం, లెవల్ ప్రీమియం తదితర రకాలుగా ఇది కొనసాగుతాయి. హోల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీల పేరిట బీమా చేసుకున్న వ్యక్తికి జీవితాంతం వర్తించే పథకాలూ కొన్ని వున్నాయి. వీటిల్లో తదుపరి తరానికి ఉపయోగపడేలా పాలసీదారు జాగ్రత్తపడవచ్చు. వర్తమానంలో తనకు ఉపయోగపడుతూ, భవిష్యత్‌లో తాను సూచించిన నామినీకి ఆస్తులను సృష్టించి ఇవ్వాలనుకునే వారికి ఇవి సరైన మార్గాన్ని చూపుతాయి.
సంప్రదాయ ప్రణాళికల్లో మిగతావాటికన్నా ఎంతో పాపులర్ అయిన ప్లాన్‌లు ఎండోమెంట్ ప్లాన్‌లు. ఇవి సురక్షితమైన మిగులు నిధిని దాస్తాయి. వీటితో పిల్లల విద్య, వివాహం, ఆరోగ్య అవసరాలు తదితర ఖర్చులను తీర్చుకోవచ్చు. వీటి కాలపరిమితిని కూడా వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా ముందుగానే నిర్దేశించుకునే వీలుంటుంది. అయితే, అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం పరిస్థితులు కొంత మారాయి. పశ్చిమ దేశాల్లోని కస్టమర్లు తమ తమ పదవీ విరమణ కొసం దాచుకున్న నిధులను మార్కెట్ ఒడిదుడుకులు ఆవిరి చేయడం ఎన్నోసార్లు గమనించి రిస్క్ అధికంగా వున్న వైపు వెళ్లడం మానివేశారు. అందువల్లే పొదుపుకు పొదుపు, రక్షణ కల్పించేలా బీమాను ఎంచుకోవాలంటే అందుకు సంప్రదాయ పాలసీలే ఉత్తమం.


Click it and Unblock the Notifications