For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పార్టీ నిధుల ప‌రంగా ఖ‌రీదైనదిగా భాజ‌పా

ఇటీవ‌ల ఎన్నికల సంఘం అన్ని పార్టీల‌ను విరాళాల వివ‌రాల‌ను బ‌హిరంగ‌ప‌ర‌చాల్సిందిగా కోరింది. వీటిలో బీజేపీకి రూ.1,172 కోట్లు, కాంగ్రెస్ కు రూ.779 కోట్లు అందాయి. అసోసియేట్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్స్ వెల్ల‌డి

|

రాజకీయ పార్టీల నిధుల సేకరణలకు అడ్డు అదుపు లేకుండాపోతోంది. వ‌రుస పదేళ్ళలో జరిగిన 3 లోక్ సభ ఎన్నికల్లో పార్టీలు సేకరించిన విరాళాలు 5 రెట్ల మేర పెరిగాయి. విరాళాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంటే పార్టీలు ఊరుకుంటాయా? ఎన్నికల ఖర్చులు పెంచేశారు. గత పదేళ్ళలో ఎన్నికల ఖర్చు 4 రెట్లు ఎక్కువైంది. విరాళాల సేకరణలో అధికార భాజపా మొదటిస్థానంలో, కాంగ్రెస్ రెండవ స్థానంలోనూ నిలిచాయి. గడచిన 10 ఏళ్ళలో ఈ రెండు పార్టీలతో పాటు మిగిలిన రాజకీయ పార్టీలకు రూ.2236 కోట్లు విరాళాలు అందాయి. వీటిలో బీజేపీకి రూ.1,172 కోట్లు, కాంగ్రెస్ కు రూ.779 కోట్లు అందాయి. ఇటీవ‌ల ఎన్నికల సంఘం అన్ని పార్టీల‌ను విరాళాల వివ‌రాల‌ను బ‌హిరంగ‌ప‌ర‌చాల్సిందిగా కోరింది. అసోసియేట్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్స్ వెల్ల‌డించిన విశ్లేష‌ణ గుడ్‌రిట‌ర్న్స్ తెలుగు పాఠ‌కుల కోసం...

2004-05 నుంచి 2015-16 మధ్య ఆస్తుల వివ‌రాలు

2004-05 నుంచి 2015-16 మధ్య ఆస్తుల వివ‌రాలు

7 జాతీయ పార్టీల‌కు సంబంధించి ప‌దేళ్ల‌లో ఆస్తుల గ‌స‌టు 61.62 కోట్ల రూపాయ‌లు పెరిగింది.

దీంతో 2004లో ఉన్న సాధార‌ణ‌ స్థాయి నుంచి 2015-16 నాటికి రూ.388 కోట్ల‌కు పెరిగింది.

2008-09 నుంచి పార్టీల నిధులు త‌గ్గ‌గా, 2009-10 నుంచి 2010-11 నాటికి రూ.156 కోట్ల పెరుగుద‌ల‌ను న‌మోదు చేశాయి.

బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ

బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ

2004-05 ఆర్థిక సంవ‌త్స‌రంలో భాజ‌పా రూ.122.93 కోట్ల ఆస్తుల‌ను డిక్లేర్ చేసింది.

అదే 2015-16 వ‌చ్చేస‌రికి 15% వార్షిక పెరుగుద‌ల‌ను న‌మోదు చేసి రూ.893.88 కోట్ల స్థాయికి చేరింది.

సీపీఎం, ఏఐటీసీ పార్టీలు రెండు మాత్ర‌మే ఆస్తుల విష‌యంలో త‌గ్గుద‌ల‌ను క‌న‌బ‌ర‌చాయి.

జాతీయ పార్టీలు ఇలా...

జాతీయ పార్టీలు ఇలా...

జాతీయ పార్టీలు 6 విభాగాల్లో త‌మ ఆస్తుల‌ను విభ‌జించాయి.

అవి: స‌్థిర ఆస్తులు ; రుణాలు,అడ్వాన్సులు ; ఎఫ్‌డీఆర్ లేదా డిపాజిట్లు ;టీడీఎస్ ; పెట్టుబ‌డులు ; ఇత‌ర ఆస్తులు

2004-05లో జాతీయ పార్టీలు గ‌రిష్టంగా ఎఫ్‌డీఆర్ లేదా డిపాజిట్ల కింద రూ.183.442 కోట్ల‌ను చూపించాయి.

ఇత‌ర ఆస్తుల్లో పార్టీల‌న్నీ క‌లిపి చూపిన నిధుల విలువ రూ.1605.114 కోట్లు

పార్టీల మూల‌ధ‌నం

పార్టీల మూల‌ధ‌నం

పార్టీల మొత్తం మూల‌ధ‌నం 2015-16లో రూ.2336 కోట్లుగా ఉంది.

ఇది 2004-05లో కేవ‌లం రూ.383.56 కోట్లుగానే ఉంది.

భాజ‌పా వ‌ద్ద అత్య‌ధికంగా రూ.869 కోట్ల నిధులు, బీఎస్పీ వ‌ద్ద 433 కోట్ల రూపాయ‌లున్నాయి.

ప‌దేళ్ల‌లో భాజ‌పా నిధులు 700% పెరిగితే కాంగ్రెస్ రిజ‌ర్వ్ నిధులు 169% మేర మాత్ర‌మే పెరిగాయి.

 భార‌తీయ జ‌న‌తా పార్టీ

భార‌తీయ జ‌న‌తా పార్టీ

2004-05లో భాజ‌పా స్థిరాస్తుల విలువ 23.475 కోట్లుగా ఉండ‌గా 2015-16 నాటికి 140.82 కోట్ల‌కు పెరిగింది.

భాజ‌పా అప్పులు, అడ్వాన్సులు సైతం అదే స్థాయిలో పెరిగాయ‌ట‌.

2004-05లో అప్పులు, అడ్వాన్సుల విలువ 2.6 కోట్లుగా ఉండ‌గా 2015-16 నాటికి304.72 కోట్ల రూపాయ‌ల‌య్యాయి.

అదే స‌మ‌యంలో మొత్తం ఆస్తులు 122.93 కోట్ల నుంచి 893.88 కోట్ల రూపాయ‌ల‌కు పెరిగాయి.

ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్(ఐఎన్‌సీ)

ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్(ఐఎన్‌సీ)

కాంగ్రెస్ స్థిర ఆస్తుల విలువ‌లో పెద్ద‌గా పెరుగుద‌ల చూపించ‌లేదు.

2004-05లో 13.71 కోట్లు, 2015-16లో 55.777 కోట్ల రూపాయ‌ల స్థిరాస్తుల‌ను బ్యాలెన్స్ షీట్లో పొందుప‌రిచింది.

అదే స‌మ‌యంలో అప్పులు, అడ్వాన్సులు 16.73 కోట్ల నుంచి రూ. 53.92 కోట్ల‌కు వృద్ది చెందాయి.

ప‌దేళ్ల స‌మ‌యంలో మొత్తం ఆస్తులు 5 రెట్లు పెరిగాయి.

2004-05 లో పార్టీ వెల్ల‌డించిన మొత్తం ఆస్తుల విలువ 167.35 కోట్లుగా ఉండ‌గా తాజా గ‌ణాంకాల ప్ర‌కారం 758.79 కోట్లుగా పార్టీ అధికారిక లెక్క‌లు వెల్ల‌డిస్తున్నాయి.

కొత్త‌గా క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా... ఇవి ట్రై చేయండి

కొత్త‌గా క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా... ఇవి ట్రై చేయండి

2017లో మ‌ధ్య త‌ర‌గ‌తికి మంచి క్రెడిట్ కార్డులు 2017లో మ‌ధ్య త‌ర‌గ‌తికి మంచి క్రెడిట్ కార్డులు

Read more about: political parties funds
English summary

పార్టీ నిధుల ప‌రంగా ఖ‌రీదైనదిగా భాజ‌పా | assets and liabilities Of national parties in India by ADR

The Bharatiya Janata Party's (BJP) declared assets jumped by 627 percent from Rs 122.93 crore to over Rs 893 crore between FY 2004-05 and 2015-16, according to an analysis by Association for Democratic Reforms (ADR).
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X