For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విజేత‌: ల‌లితా జువెల‌ర్స్ కిర‌ణ్ కుమార్‌

ఆ ప్ర‌క‌ట‌న ప్ర‌తి చానెల్‌లోనూ, విరామ స‌మ‌యాల్లో అన్ని చాన‌ళ్ల‌లోనూ ఒకేలా వ‌స్తోంది. దీంతో ఈ యాడ్ చూడ‌ని టీవీ ప్రేక్ష‌కులు లేరంటే అతిశ‌యోక్తి కాదేమో! ఈ నేప‌థ్యంలో ల‌లితా జువెల‌ర్స్ కిర‌ణ్ కుమార్ గురిం

|

తెలుగు మీడియా ప్రపంచంలో లలితా జ్యెవెలర్స్ యాడ్ (వాణిజ్య ప్రకటన) సరికొత్త సునామీ సృష్టిస్తోంది. ఏ చానెల్ చూసినా, ఏ పేపర్ చదివినా, ఏ రేడియో విన్నా, ఎక్కడ చూసినా లలిత జ్యువెలర్స్ యాడ్ ప్రత్యక్షమవుతుంది. ఆ యాడ్ కోసం ఆ సంస్థ వాళ్లు ప్రచారం కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో ఏమో కానీ ఆ ప్ర‌క‌ట‌న ప్ర‌తి చానెల్‌లోనూ, విరామ స‌మ‌యాల్లో అన్ని చాన‌ళ్ల‌లోనూ ఒకేలా వ‌స్తోంది. దీంతో ఈ యాడ్ చూడ‌ని టీవీ ప్రేక్ష‌కులు లేరంటే అతిశ‌యోక్తి కాదేమో! ఈ నేప‌థ్యంలో ల‌లితా జువెల‌ర్స్ కిర‌ణ్ కుమార్ గురించి తెలుసుకుందాం.

1. సంస్థ‌కు గ‌తేడాది టర్నోవర్ రూ.11 వేల కోట్లు

1. సంస్థ‌కు గ‌తేడాది టర్నోవర్ రూ.11 వేల కోట్లు

లలితా జువెలర్స్‌ గత ఆర్థిక సంవత్సరం రూ.11,000 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఈ సంవత్సరం ఇది రూ.15,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తోంది. మరో మూడేళ్లలో (2020నాటికి) రూ.50,000 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కిరణ్‌ కుమార్‌ చెప్పారు.జిఎస్టి అమలుతో నగల వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. నిజానికి జిఎ్‌సటితో వ్యాపార లావాదేవీల్లో పూర్తి పారదర్శకత ఏర్పడి, రాష్ట్రాల పన్ను ఆదాయమూ పెరుగుతుందని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కీల‌క పట్ట‌ణాల్లో ఒక్కో చోటా షోరూంల‌ను విస్త‌రించుకుంటూ వెళుతోంది ల‌లితా జువెల‌ర్స్‌.

2. సంస్థ స్థాప‌న‌

2. సంస్థ స్థాప‌న‌

వెన్నుచూప‌ని దీక్ష‌తో వ్య‌వ‌స్థాప‌క దృక్ప‌థంతో ల‌లితా జువెల‌ర్స్ ప్రారంభ‌మైంది. దీన్ని ప్రారంభించేముందు ఎమ్‌. కిర‌ణ్ కుమార్‌కు బులియ‌న్ ప‌రిశ్ర‌మ‌లో 20 ఏళ్ల అనుభ‌వం ఉంది. చెన్నైలో మొద‌టి ల‌లితా జువెల‌ర్స్ షోరూం 1985లో తెరిచారు. ఇక్క‌డ ఉండే గోల్డ్ ఒరిజిన‌ల్. ఎందుకంటే వీటికి బీఐఎస్ స‌ర్టిఫికేష‌న్‌తో పాటు 916 బీఐఎస్ హాల్‌మార్క్ ఉంటుంది.

హైద‌రాబాద్‌లో ఈ రోజు బంగారం ధ‌ర‌

3. ల‌లితా జువెల‌ర్స్ డిజైన్లు

3. ల‌లితా జువెల‌ర్స్ డిజైన్లు

లలితా జువెల‌ర్స్ త‌యారు చేయించే డిజైన్లు ముంబ‌యి, రాజ్‌కోట్‌, కోల్‌క‌త‌, కేర‌ళ‌, కొయంబ‌త్తూర్ ప్రాంతాల అభిరుచుల స‌మాహారంగా నిలుస్తాయి. బంగారు నాణ్య‌త‌లో రాజీ ఉండ‌ద‌ని దాని వ్య‌వ‌స్థాప‌కులు చెబుతారు. ఇక్క‌డ చిన్న రింగుల నుంచి పెద్ద పెద్ద ఆభర‌ణాల వ‌ర‌కూ త‌యారు చేస్తారు.

చెన్నైలో ఈ రోజు బంగారం ధ‌ర‌

4. ల‌లితా జువెల‌ర్స్ షోరూంల్లో వేస్టేజీ త‌క్కువ‌

4. ల‌లితా జువెల‌ర్స్ షోరూంల్లో వేస్టేజీ త‌క్కువ‌

యాంటిక్ నుంచి ట్రెండీ వ‌ర‌కూ వేల ర‌కాల బంగారు ఆభ‌ర‌ణాల‌ను షోరూంలో ఉంచుతున్నారు. రాజ్‌కోట్‌, కోల్‌క‌త‌, ముంబ‌యి, కేర‌ళ‌, కొయంబ‌త్తూర్ ప్రాంతాల వారిని మెప్పించేలా యాంటిక్, కుంద‌న్‌, రోడియం వంటి వాటితో పాలిష్ చేసిన బంగారు ఆభ‌ర‌ణాలు ఉన్నాయి. వీటిపై విధించే త‌రుగు చార్జీలు తమిళ‌నాడులోనే ఈ షోరూంలోనే అతి త‌క్కువ‌. సాధార‌ణంగా 1నుంచి 8% వ‌ర‌కూ ఉండ‌గా, కొన్ని సార్లు 9% వెస్టేజ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మేకింగ్ చార్జీలు ఉండ‌వు.

5. కిర‌ణ్ కుమార్ మాట‌

5. కిర‌ణ్ కుమార్ మాట‌

బంగారంతో ప్ర‌తి కుటుంబానికి భార‌త‌దేశంలో ఉన్న అనుబంధం గురించి నా అనుభ‌వంలో చాలా తెలుసుకున్నాను. కేవ‌లం ఆభ‌ర‌ణాలే కాకుండా ప్ర‌తి ఇంటిలో ఉండే క‌నీస వ‌స్తువులా భావిస్తారు చాలా మంది. బంగారం భ‌విష్య‌త్తు కోసం పెట్టుబ‌డి. మొత్తం కుటుంబానికి ఇది ఆర్థిక ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. ఆర్థికంగా ప‌డే క‌ష్టం, ప్ర‌తి వ్య‌క్తి దాన్ని సొంతం చేసుకునే తీరు,దానికి వెచ్చించే స‌మ‌యం వంటివి నాకు బాగా తెలుసు. దాన్ని దృష్టిలో ఉంచునే బంగారు ఆభ‌ర‌ణాల వ్యాపారంలో నేను వినియోగ‌దారుల కోసం పెట్టుబ‌డి ఖ‌ర్చు త‌గ్గించాను.

6. బ‌యోగ్ర‌ఫీ

6. బ‌యోగ్ర‌ఫీ

ఆయ‌న వాళ్ల అమ్మ ఇచ్చిన బంగారంతో చిన్న‌గా వ్యాపారాన్ని ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగారు. 15 ఏళ్ల వ‌యసులో అమ్మ నాలుగు గాజులు ఇచ్చి ఆభ‌ర‌ణాల త‌యారీకి ప్రోత్స‌హించారు. కిర‌ణ్ కుమార్ ప్ర‌స్తుతం 46 ఏళ్ల వ‌య‌సులో ఉంటారు. ద‌క్షిణ భార‌త‌దేశంలో ల‌లితా జువెల‌ర్స్‌కు ప్ర‌స్తుతం 11 షోరూంలు ఉన్నాయి. తిరుప‌తి, హైద‌రాబాద్, వైజాగ్ న‌గ‌రాల్లో షోరూంలు ఉన్నాయి. చెన్పైలో మొద‌లైన ల‌లితా జువెల‌ర్స్ ప్ర‌స్తుతం దేశ‌మంతా విస్త‌రించింది. దేశ‌వ్యాప్తంగా 15 బ్రాంచీలు ఉన్నాయి.

7. విజ‌యం బాట‌లో లలితా జువెల‌ర్స్

7. విజ‌యం బాట‌లో లలితా జువెల‌ర్స్

కిర‌ణ్ కుమార్ పెద్ద‌గా చ‌దువుకోలేదు. ఆయ‌న ఒక సాధార‌ణ కుటుంబంలో పెట్టారు. చిన్న‌ప్పుడు క‌ష్టాల క‌డ‌లితో ప్ర‌స్థానం ప్రారంభించారు. చ‌దువు రాక‌పోవ‌డం కూడా ఆయ‌న‌కు ఒక ప్ల‌స్ అయిందని అంటారు. నెల్లూరులో బంగారం వ్యాపారం బాగా ప్ర‌సిద్ధి. ఒక‌ప్పుడు ద‌క్షిణ భార‌త‌దేశంలో నెల్లూరు బంగారు వ్యాపారులు బాగా పేరు పొంది ఉండేవారని ఆయ‌న అన్నారు. రెండు మూడేళ్లు వాళ్ల ద‌గ్గ‌ర ప‌నిచేసిన త‌ర్వాత బంగారం ఆభ‌ర‌ణాల త‌యారీని నేర్చుకున్నానని ఆయ‌న చెప్పారు.

 8. 60 గ్రాముల‌తో మొద‌లు

8. 60 గ్రాముల‌తో మొద‌లు

మొద‌టిసారి అమ్మ గారు ఇచ్చిన 4 గాజులు క‌రిగించి 60 గ్రాముల‌తో ల‌లితా జువెల‌ర్స్కు త‌న బంగారాన్ని అమ్మారు. మొద‌ట ల‌లితా జువెల‌ర్స్‌కు బంగారం స‌ర‌ఫ‌రా చేసే స్థాయి నుంచి దాన్ని టేకోవ‌ర్ చేసే ద‌శ‌కు ఎదిగారు. ద‌క్షిణ భార‌త‌దేశంలో పెద్ద బంగారు వ్యాపార దుకాణాల‌కు ఒక‌ప్పుడు స‌ప్ల‌యిర్‌గా ఉన్న ఆయ‌న ప్ర‌స్తుతం ల‌లితా జువెల‌ర్స్ ద్వారా వినియోగ‌దారుల‌కు నేరుగా బంగారం ఆభ‌ర‌ణాలు అమ్మ‌డంలో బిజీగా ఉన్నారు. 1999లో కిర‌ణ్ ల‌లితా జువెల‌ర్స్ సంస్థ‌ను టేకోవ‌ర్ చేశారు.

9. అక్క‌డ అలా... ఇక్క‌డ ఇలా...

9. అక్క‌డ అలా... ఇక్క‌డ ఇలా...

ఒక‌ప్పుడు కిర‌ణ్ కుమార్ కెన‌డా, లండ‌న్, సింగ‌పూర్, దుబాయ్ వంటి మార్కెట్ల‌కు మంచి ఎగుమ‌తిదారుగా ఉండేవారు.ఇక్క‌డ మ‌న దేశంలో కేర‌ళ‌, చెన్నై, హైద‌రాబాద్‌లో కొన్ని జువెల‌ర్స్‌కు నిరంత‌రం బంగారం స‌ర‌ఫ‌రా చేశారు. నెల్లూరులో బంగారు వ్యాపారంలో ప‌నిచేసే వారు ఆయ‌న‌కు మంచి ప్రోత్సాహం ఇవ్వ‌డంతో పాటు, త‌న కుటుంబ స‌భ్యుల్లాగా వ్య‌వ‌హ‌రించారని కిర‌ణ్ సంతోషిస్తుంటారు.

10. సంప్ర‌దింపులు

10. సంప్ర‌దింపులు

ల‌లితా జువెల‌ర్స్ మెయిల్ ఐడీ: [email protected]

ల‌లితా జువెల‌ర్స్ ఫోన్ నంబ‌రు : 044 - 28349860

ల‌లితా జువెల‌ర్స్ ప‌థ‌కాల ఫోన్ నంబ‌రు: 044 - 28349860

ప్ర‌ధాన శాఖ‌ చిరునామా : No-123, Usman Road,

Panagal Park,

T - Nagar,

Chennai,

Tamil Nadu 600 017, India

క్రెడిట్ కార్డుల‌పై విధించే వివిధ రుసుములు, చార్జీలు

క్రెడిట్ కార్డుల‌పై విధించే వివిధ రుసుములు, చార్జీలు

క్రెడిట్ కార్డుల‌పై విధించే వివిధ రుసుములు, చార్జీలుక్రెడిట్ కార్డుల‌పై విధించే వివిధ రుసుములు, చార్జీలు

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఈ 10 మార్గాల్లో పెట్టుబ‌డి పెడితే సంప‌న్నుల‌వ్వ‌డం ఖాయం

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఈ 10 మార్గాల్లో పెట్టుబ‌డి పెడితే సంప‌న్నుల‌వ్వ‌డం ఖాయం

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఈ 10 మార్గాల్లో పెట్టుబ‌డి పెడితే సంప‌న్నుల‌వ్వ‌డం ఖాయంమ‌ధ్య‌త‌ర‌గ‌తి ఈ 10 మార్గాల్లో పెట్టుబ‌డి పెడితే సంప‌న్నుల‌వ్వ‌డం ఖాయం

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణంప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

బంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలు

బంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలు

బంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలుబంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలు

మ‌న దేశంలో అత్యధిక‌ వేత‌నాలిచ్చే ఉద్యోగాలివే... చేరిపోతారా?

మ‌న దేశంలో అత్యధిక‌ వేత‌నాలిచ్చే ఉద్యోగాలివే... చేరిపోతారా?

మ‌న దేశంలో అత్యధిక‌ వేత‌నాలిచ్చే ఉద్యోగాలివే... చేరిపోతారా?మ‌న దేశంలో అత్యధిక‌ వేత‌నాలిచ్చే ఉద్యోగాలివే... చేరిపోతారా?

Read more about: lalithaa jewellers gold
English summary

విజేత‌: ల‌లితా జువెల‌ర్స్ కిర‌ణ్ కుమార్‌ | success story of Lalitha jewellery kiran kumar

With a rich legacy that dates back to 1985, Lalithaa Jewellery stands out amongst the various jewellers in Chennai, not just for its low wastage but also for the exhaustive range it offers and indeed for the depth and beauty of the craft inherent in almost every item it showcases.The designs, all of them in 916 BIS Hallmarked gold, spell class, staking claim to mixed origins like Mumbai, Rajkot, Kolkata, Kerala and Coimbatore regions. The quality of gold, certified as they are by the Bureau of Indian standards as 916 BIS Hallmark, is unmistakable. And the intricate workmanship that’s a hallmark of the Lalithaa brand, is a fine attraction.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X