భారత స్టాక్ మార్కెట్ సూచీలు-సరికొత్త రికార్డులు
ఈ రోజు ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ బాగా పుంజుకొని 201 పాయింట్ల లాభంతో ఆల్ టైం గరిష్టం 32,634 వద్ద ముగియగా మరో సూచీ నిఫ్టీ 63 ప
ఈ రోజు ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ బాగా పుంజుకొని 201 పాయింట్ల లాభంతో ఆల్ టైం గరిష్టం 32,634 వద్ద ముగియగా మరో సూచీ నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి సరికొత్త జీవన కాల గరిష్టమైన 10,231 వద్ద స్థిరపడింది.
ఒక్క పవర్, మౌలిక రంగం తప్ప బీఎస్ఈలో అన్ని రంగాలు లాభాల బాట పట్టాయి. వాటిలో లోహ రంగం(2.02%), హెల్త్ కేర్(1.24%), టెక్నాలజీ(1.23%), ఆటో(1.19%) బాగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి. మరో వైపు పవర్(0.13%), ఇన్‌ఫ్రా(0.05%) స్వల్పంగా నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్లో లాభపడిన వాటిలో భారతీ ఎయిర్‌టెల్(4.38%), ఎం అండ్ ఎం(3.62%), హెచ్‌యూఎల్(2.92%), సిప్లా(2.42%), టాటా మోటార్స్(2.33%) ముందుండగా మరో వైపు యాక్సిస్ బ్యాంక్(1.52%), హెచ్డీఎఫ్‌సీ(0.51%) మారుతి(0.35%), విప్రో(0.34%), ఎన్టీపీసీ(0.31%) నష్టపడ్డ వాటిలో ఉన్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సరికొత్త రికార్డు నమోదు
బీఎస్ఈ సూచీ 0.79% లాభంతో పైకి ఎగసి జీవనకాల గరిష్టం 32,687 వద్ద ముగిసింది. ఇదే దరిదాపు స్థాయిని గతంలో ఆగస్టు 2 నాడు తాకింది.


Click it and Unblock the Notifications