రెండు రెట్లు పెరిగిన బంగారం దిగుమతులు
దేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్థం (ఏప్రిల్-సెప్టెంబర్)లో బంగారం దిగుమతులు రెండు రెట్లకు పైగా పెరిగి 16.95 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్
దేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్థం (ఏప్రిల్-సెప్టెంబర్)లో బంగారం దిగుమతులు రెండు రెట్లకు పైగా పెరిగి 16.95 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బంగారం దిగుమతులు దేశ కరెంటు ఖాతా లోటు (సిఎడి)పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది రెండో త్రైమాసికం (ఏప్రిల్-సెప్టెంబర్)లో దేశంలోకి 6.88 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు జరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 1.80 బిలియన్ డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో 5 శాతం తగ్గి 1.71 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దేశ వాణిజ్య లోటు 8.98 బిలియన్ డాలర్లకు తగ్గి ఏడు నెలల కనిష్ట స్థాయికి చేరుకునేందుకు ఇది కారణం అయింది.

ఈ నెల నుంచి దేశవ్యాప్తంగా పండుగల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం దిగుమతులు మరింత పెరుగడం ఖాయమని బులియన్ మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో బంగారం దిగుమతులు పెరగడంతో జూన్ నెలాఖరు నాటికి కరెంటు ఖాతా లోటు 14.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో ఇది 2.4 శాతంగా ఉంది. కరెన్సీ రేటు విలువపై ప్రభావం చూపే విదేశీ మారకద్రవ్యం రాక, పోక మధ్య వ్యత్యాసాన్ని కరెంటు ఖాతా లోటు అంటారు.
More From GoodReturns

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!



Click it and Unblock the Notifications