ఈ మూడు బ్యాంకులు క్యాష్ బ్యాక్ వంటి వాటితో మొదలుకొని నో కాస్ట్ ఈఎంఐ వరకూ వివిధ రకాల నేరుగా రాయితీలు ఇస్తున్నారు. వీటి గురించి మరింత తెలుసుకుందాం.
ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డుదారులకు ఆయా బ్యాంకులు బంపర్ ఆఫర్‌నిచ్చాయి. దీపావళి సందర్భంగా వివిధ రకాల ఆఫర్లను ప్రకటించాయి. వివిధ బ్రాండ్లపై తమ వినియోగదారులకు ఆకట్టుకునే ఆఫర్లు ఇస్తున్నాయి ఈ మూడు బ్యాంకులు. క్యాష్ బ్యాక్ వంటి వాటితో మొదలుకొని నో కాస్ట్ ఈఎంఐ వరకూ వివిధ రకాల నేరుగా రాయితీలు ఇస్తున్నారు. వీటి గురించి మరింత తెలుసుకుందాం.

ఆఫర్ల కేటగిరీలేంటి?
ఆఫర్లన్నీ ముఖ్యంగా ట్రావెల్, ఫ్యాషన్, హోం ఫర్నిషింగ్ వంటి వాటి మీద ఉన్నాయి.
పాల్గొంటున్న బ్రాండ్లు: యాత్రా, గ్రోఫర్స్, బిగ్‌బాస్కెట్.కామ్, అర్బన్ క్లాప్, ఇండిగో, నియర్‌బై(nearbuy), షాపర్స్ స్టాప్, పాంటలూన్స్, ఎమిరేట్స్, డబ్లు అండ్ గ్రాబాన్(Grabon)
అన్ని కొనుగోళ్లపై, కార్డు రకాలపై కనీస లావాదేవీ పరిమితి ఉందని ఆయా కార్డు వెబ్‌సైట్లు పేర్కొన్నాయి.
కాబట్టి కొనుగోళ్లు జరిపే ముందే అన్నీ తెలుసుకుంటే మంచిది. ఆఫర్ల తేదీలు జాగ్రత్తగా చూడండి. ఇంకెందుకు ఆలస్యం ఏ కార్డు మీద ఏయే ఆఫర్లు ఉన్నాయో, ఎంత ఆదా చేసుకోవచ్చో తెలుసుకోండి మరి.

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు దారులకు 5% నుంచి 10% వరకూ
ఉదాహరణకు మీరు అర్బన్ ల్యాడర్, హోం టౌన్ ద్వారా కొనుగోళ్లు జరపాలనుకుంటే ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు దారులకు 5% క్యాష్ బ్యాక్ రాయితీ ఉంది. అదే బిగ్ బాస్కెట్ వెబ్‌సైట్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు కలిగిన వారికి 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.
మీరు ఒప్పో కొనాలనుకుంటే లేదా పండక్కి కొత్త ఫోన్ కొనాలనే ప్రణాళికలో ఉంటే ఎస్‌బీఐ కార్డు ఉంటే 5% క్యాష్ బ్యాక్

ప్రయాణాలకు సంబంధించి
మీకు ప్రయాణాలు ఇష్టమైతే ఇది మీ కోసమే. యాత్రా బుకింగ్‌లపై విమాన ప్రయాణాలకు సంబంధించి రూ.600 వరకూ ఆదా చేసుకోవచ్చు. ఫ్లాట్ 15% రాయితీలు మీరు పొందవచ్చు. Airbnb ద్వారా భారతదేశం వెలుపల బస చేసేందుకు బుక్ చేస్తున్నట్లయితే 15% రాయితీ మీ సొంతం ఎస్‌బీఐ కార్డు ద్వారా. అయితే ఈ బుకింగ్‌లన్నీ డిసెంబరు 31 లోపు చేయాలి. స్పైస్ జెట్ ద్వారా ప్రయాణం చేసే వారికి ఆ సంస్థ ఉచిత మీల్స్ ఇస్తున్నది. అయితే ఆ ఆఫర్ డిసెంబరు 14 వరకూ అందుబాటులో ఉంటుంది.

వివిధ స్టోర్లు, బ్రాండ్లపై ఆఫర్లు ఇలా...
బోస్, లెనోవో, నికాన్, క్రోమా, శ్యామ్‌సంగ్ వంటి స్టోర్లలో కొనుగోళ్లపై ఫ్లెక్సీ ఈఎంఐ సదుపాయం ఉంది. ప్రస్తుతం హెచ్‌పీ, హిటాచీ, సోని సైతం ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు దారులకు ఈఎంఐకి మార్చుకునేందుకు అవకాశం ఇస్తోంది. ఈఎంఐ ఆప్షన్లు 3,6,12 నెలల కాలపరిమితిలో అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ కార్డ్స్ వెబ్‌సైట్లో ఉన్నదాని ప్రకారం ఇలాంటి కొనుగోళ్లకు సంబంధించి, ఈఎంఐకి మార్చుకునేందుకు ఎటువంటి డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్ రుసుముల్లేవు. అంతే కాకుండా కొన్ని ఉత్పత్తులను ఈఎంఐల ద్వారా కొన్నట్లయితే వ్యాపారులు ఇచ్చే రాయితీలు అదనంగా ఉన్నాయని ఎస్‌బీఐ కార్డ్స్ వెబ్‌సైట్ పేర్కొంది.

ఐసీఐసీఐ కార్డు దారులారా ఇది మీ కోసమే...
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుదారులు సైతం ఆకట్టకునే రాయితీలు, క్యాష్ బ్యాక్‌లు పొందవచ్చు. ఐసీఐసీఐ SOTC ట్రావెల్‌తో జట్టుకట్టి రూ.3000 రాయితీని అందిస్తోంది. అయితే ఇది అంతర్జాతీయ ప్రయాణ బుకింగ్‌లకు మాత్రమే. దేశీయ ప్రయాణికులకు యాత్రా (www.yatra.com)బుకింగ్‌ల ద్వారా 5% క్యాష్ బ్యాక్ అందుతుంది. ఇంకా యాపిల్ ఉత్పత్తులైన మ్యాక్ బుక్, ఐపాడ్ వంటి వస్తువులపై ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.

ఈ-కామర్స్ ఉత్పత్తులపై హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా ఆదా
అమెజాన్, స్నాప్‌డీల్, మైంత్రా, పేజాప్, జెట్ ఎయిర్‌వేస్ ద్వారా నగదు రాయితీలను, రివార్డు పాయింట్లను హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు అందిస్తోంది. తనిష్క్, మియా, గోల్డ్ ప్లస్ స్టోర్లలో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు జరిపితే 5% రాయితీ వస్తుంది. జెట్ ఎయిర్‌వేస్ ఎకానమీ, ప్రీమియం క్లాస్ ప్రయాణికులు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఉపయోగించి మొత్తం టికెట్ ధర మీద 10 నుంచి 15% వరకూ రాయితీ పొందవచ్చు. ఈ దీపావళికి ఫ్లిప్ కార్ట్ వెబ్‌సైట్, యాప్ కొనుగోళ్లకు హెచ్‌డీఎఫ్‌సీ కార్డు వాడటం ద్వారా చెప్పుకోదగ్గ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications