దేశంలో ఈ త‌ర‌హా ప్ర‌త్యేక‌త క‌లిగిన రెస్టారెంట్లు మ‌రెక్క‌డా ఉండ‌వు

రోజూ ఇంట్లో తిని బోర్ కొట్టి సెల‌వు రోజుల్లో బ‌య‌ట వెళ్లి తింటూ ఉంటారు చాలా మంది. మీరు పెట్టే డ‌బ్బుకు ఒక్కోసారి సంతృప్తి ఉండదు. ఒక్క‌సారి ఈ 10 రెస్టారెంట్ల‌లో మీరు అడుగు పెడితే మీకే తెలుస్తుంది. వీటి

ఎంత సంపాదిస్తే ఏం లాభం. బాగా తినే యోగం ఉండాల‌ని చాలా మంది కోరుకుంటారు. ఎప్పుడు వారాంతంలో రెస్టారెంట్ల‌కు వెళ్ల‌డం ఈ మ‌ధ్య మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి సైతం సాధార‌ణ విష‌యం. అయితే ఎప్పుడ‌వే రెస్టారెంట్లా అనే కుటుంబ స‌భ్యులు పోరు పెడుతుంటారు. దాన్నుంచి విభిన్న‌మైన అనుభూతి ఇచ్చేందుకు దేశ‌వ్యాప్తంగా వివిధ న‌గ‌రాల్లో ఔత్సాహికులు వివిధ ర‌కాల ఆలోచ‌న‌ల‌తో స‌రికొత్త త‌ర‌హా రెస్టారెంట్ల‌ను ప్రారంభించారు. అక్క‌డి వివ‌రాలు తెలుగు గుడ్ రిటర్న్స్ పాఠకుల కోసం...

1. కుంజుం ట్రావెల్ కేఫ్‌, న్యూఢిల్లీ

1. కుంజుం ట్రావెల్ కేఫ్‌, న్యూఢిల్లీ

కుంజుం కేఫ్‌కు ఒక ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ ఉంటుంది. పుస్త‌క ప్రియుల‌ను, ప్ర‌యాణికుల‌ను ఇది ల‌క్ష్యంగా చేసుకుంది. తాము చేస్తున్న యాత్రా విశేషాల గురించి పంచుకునేందుకు ఇది అవ‌కాశం క‌ల్పిస్తుంది. విహార యాత్ర‌లు చేసేవారు తామంతా క‌లిసి అనుభ‌వాల‌ను పంచుకునేందుకు, త‌మ ఫోన్ నంబ‌ర్లు, మెయిల్ ఐడీల‌ను ఒక‌రికొక‌రు పంచుకునేందుకు, కాఫీ తాగుతూ మాట్లాడేందుకు, ఆలోచ‌న‌ల‌ను పంచుకునే వ‌ర్క్‌షాప్‌ల‌ను ఈ హోట‌ల్ నిర్వ‌హిస్తుంది. ఈ హోట‌ల్‌ను కొంత మంది యాత్రా ర‌చ‌యిత‌లు న‌డుపుతున్నారు. దీని సొంత దారు అజ‌య్ జైన్‌. మీ ప‌ని అయిన త‌ర్వాత చివ‌ర్లో బిల్లు ఇవ్వ‌రు. ఎవ‌రికి తోచినంత వారు చెల్లిస్తే స‌రిపోతుంది.

ధ‌ర ఇద్ద‌ర‌కి : సుమారు రూ.200

చిరునామా: T-49, Ground Floor, Hauz Khas Village, New Delhi

2. తీహార్ జైల్ ఫుడ్ కోర్ట్, న్యూఢిల్లీ కోర్ట్

2. తీహార్ జైల్ ఫుడ్ కోర్ట్, న్యూఢిల్లీ కోర్ట్

ఈ హోట‌ల్‌లో మొత్తం ఫ‌ర్నిచ‌ర్‌ను ఖైదీలే త‌యారుచేశారు. 50 మంది ఒకేసారి కూర్చొని తిన‌గ‌లిగేంత విస్తీర్ణం ఉన్న దీంట్లో ఇంటిరీయ‌ర్ డెక‌రేష‌న్ చూస్తే ఎవ‌రికైనా ముచ్చ‌టేయాల్సిందే. హోట‌ల్‌కు వ‌చ్చిన వినియోగ‌దారుల‌తో ఎలా తెలుసుకోవాల‌నే విష‌య‌మై వెయిట‌ర్ల‌కు జైలుకు ద‌గ్గ‌ర్లోనే ఉన్న హోట‌ల్ మేనేజ్‌మెంట్ సంస్థ శిక్ష‌ణ ఇచ్చింది. ఇక్క‌డ ఉత్త‌ర భార‌త దేశ రుచులే దొరుకుతాయి.

డీల‌క్స్ తాలి: రూ.150

స‌మోసా : రూ.10

ధ‌ర ఇద్ద‌ర‌కి : సుమారు రూ.300

3. వెలి లేక్ ఫ్లోటింగ్ రెస్టారెంట్

3. వెలి లేక్ ఫ్లోటింగ్ రెస్టారెంట్

కేర‌ళ‌ను దేవుడిచ్చిన స్వ‌ర్గంతో స‌మాన‌మైన స్థ‌లంగా భావిస్తారు.

ఇక్క‌డ ప్ర‌కృతి ర‌మ‌నీయ‌మైన స్థలాల‌తో పాటు మ‌రెన్నో ఉన్నాయి.

అలాంటి వాటిలో ఈ రెస్టారెంట్ కూడా ఒక‌టి.

వెలి అనే గ్రామ‌స్థులంతా క‌లిసి ఏర్పాటు చేసిన రెస్టారెంట్ స‌ర‌స్సు ఒడ్డున ఉంటుంది.

నీటిపైన తేలియాడుతూ ఉండేలా ఏర్ప‌ర‌చ‌డం దీని ప్ర‌త్యేక‌త‌

ఫ్లోటింగ్ బ్రిడ్జిల‌ను దాటుతూ ఈ రెస్టారెంట్లోకి వెళ్లాలి.

స్థానిక ఉత్ప‌త్తులతోనే ఈ రెస్టారెంట్లోని ఆహారాన్ని తయారుచేస్తారు.

4. ఖైదీ కిచెన్, చెన్నై

4. ఖైదీ కిచెన్, చెన్నై

ఇది మ‌న చెన్నై రెస్టారెంట్

కొన్ని రెస్టారెట్లు నీళ్ల‌లో ఉంటే...మరి కొన్ని ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నాయి. ఏదైనా కస్టమర్లను ఆ కట్టుకునేందుకే. చైన్నెలో తాజాగా ఓ వెరైటీ రెస్టారెంట్ నిర్మించారు. ఏదైనా త‌ప్పు చేసి జైలు కెళితే... చిప్ప కూడు తింటావు జాగ్ర‌త్త అని అంద‌రూ హెచ్చ‌రిస్తుంటారు. కానీ, అలాంటి జైలులో చికెన్ బిర్యానీ తింటే ఎలా ఉంటుంది? అదీ ఏ త‌ప్పూ చేయ‌కుండా... ఈ ఆలోచ‌నకు ప్రతిరూపమే ఖైదీ కిచెన్. చెన్న‌ైలోని మైలాపూర్ ఉంది ఈ వెరైటీ రెస్టారెంట్.

ఇక్క‌డ తినే ప‌దార్ధాల‌ను స‌ర్వ్ చేసే వెయిట‌ర్లు ఖైదీల యూనిఫాంలో ఉంటారు. వారికి వెన‌కాల ఖైదీ నెం. 786 త‌ర‌హాలో నెంబ‌ర్లు ఉంటాయి. మేనేజ‌ర్లు పోలీసు అధికారుల యూనిఫాంలో ఉంటారు. హోట‌ళ్ళ‌లో రూములు సెల్‌లా వెరైటీగా ఉంటాయి. హోట‌ల్ ముందు ఎలివేష‌న్ కూడా జైలు లానే ఉంటుంది. ఇక్క‌డ ఫామిలి వ‌చ్చి భోజ‌నం చేస్తే.. అంద‌రూ సెల్‌లో కూర్చుని తిన్న‌ఫీలింగ్ ఉంటుందట.

ఒక ఇద్ద‌రు వెలితే దాదాపుగా బిల్లు రూ.1500 అవుతుంది.

5. 11 ఈస్ట్ స్ట్రీట్ కేఫ్‌, పుణె

5. 11 ఈస్ట్ స్ట్రీట్ కేఫ్‌, పుణె

డైనింగ్ టేబుల్ వ‌ద్ద, చుట్టుప‌క్క‌ల అంతా బ్రిటీష్ క్లాసిక్ ట‌చ్ ఉండటం ఈ స్ట్రీట్ ప్ర‌త్యేక‌త‌.

పుణె గురించి తెలిసిన వారికి 11 ఈస్ట్ స్ట్రీట్ కేఫ్ గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.

అక్క‌డ‌క్క‌డ జిగేలుమ‌నిపించే స్టోర్లు, ఆంగ్లేయుల శైలి క‌లిగిన ఫ‌ర్నిచ‌ర్ ఉంచ‌డం ద్వారా లండ‌న్‌ను ప్ర‌తిసృష్టి చేసే విధంగా వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేస్తారు.

ఇక్క‌డ ఆహ్లాద‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే స్టోర్ల 3డీ చిత్రాల‌ను రెండు ప‌క్క‌ల ఏర్పాటు చేయ‌డం.

లైవ్ కిచెన్ ద్వారా ఇక్క‌డ ఆహార ప‌దార్థాల‌ను త‌యారుచేయ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.

ధ‌ర ఇద్ద‌ర‌కి : సుమారు రూ.1800

చిరునామా:

11 East Street Cafe, 11 East Street Camp, Virwani Plaza

Pune - 411001

Maharashtra

6. ఓహ్రీస్ 70 ఎంఎం, హైద‌రాబాద్‌

6. ఓహ్రీస్ 70 ఎంఎం, హైద‌రాబాద్‌

బాలీవుడ్ ఫ్యాన్లు ఆశ్చ‌ర్య‌ప‌డేలా వారిని సంతృప్తి ప‌రిచే అనుభ‌వాన్ని ఒహ్రీస్ క‌ల్పిస్తుంది.

ఒక అసాధార‌ణ ఆహార ఆస్వాద‌న అనుభూతిని ఈ రెస్టారెంట్ క‌ల్పిస్తుంది.

ధ‌ర ఇద్ద‌రు వెళితే : సుమారు రూ.1500

చిరునామా: Ohri's at Jalavihar, Necklace Road, Hyderabad Metro, Hyderabad

7. టేస్ట్ ఆఫ్ డార్క్‌నెస్, హైద‌రాబాద్‌

7. టేస్ట్ ఆఫ్ డార్క్‌నెస్, హైద‌రాబాద్‌

తినేది ఏంటో చూడ‌కుండా దాన్ని చీక‌ట్లో అనుభూతి చెంద‌డం ఈ ఆహార‌శాల ప్ర‌త్యేక‌త‌.

మొత్తం కేఫ్ అంతా చీక‌ట్లో ఉండి, క‌ళ్లు లేని వారు ఎలా చేస్తారో మ‌న‌కు అలాంటి అనుభూతినినిస్తుంది.

క‌ళ్లు లేక‌పోతే అది ఎంత క‌ష్ట‌మో అలాంటి అనుభ‌వాన్ని ఇది క‌ల్పిస్తుంది.

షేకింగ్ బ్రిడ్జ్‌, పార్క్ అనుభ‌వం ఇక్క‌డి సొంతం

8. హైజాక్ కేఫ్‌, అహ్మ‌దాబాద్‌

8. హైజాక్ కేఫ్‌, అహ్మ‌దాబాద్‌

డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్‌ను రెస్టారెంట్ లాగా వాడుకోవ‌డం ఇక్క‌డి ప్ర‌త్యేక‌త‌.

ప్ర‌యాణిస్తూ ఆహారాన్ని ఆస్వాదించ‌డం ఒక కొత్త అనుబూతినిస్తుంది.

ఒక గంట లేదా రెండు గంట‌ల పాటు అహ్మ‌దాబాద్‌లో ప్ర‌యాణిస్తూ తింటూ వివిధ స్థ‌లాలు చూస్తు వెళ్లొచ్చు

దీని ట్యాగ్ లైన్ మీరు మొద‌టిసారి చేసే ప్ర‌త్యేక‌మైన ప‌నిని చివ‌ర‌గా ఎప్పుడు చేశారు?

చిరునామా: S G Highway, Ahmedabad 380054, India

9.నేచ‌ర్స్ టాయ్‌లెట్ కేఫ్‌, అహ్మ‌దాబాద్‌

9.నేచ‌ర్స్ టాయ్‌లెట్ కేఫ్‌, అహ్మ‌దాబాద్‌

మామూలుగా మ‌నం తినేట‌ప్పుడు టాయిలెట్ గురించి మాట్లాడితేనే ఏదోలా ఉంటుంది.

అంతే కాకుండా ఎవ‌రూ టాయిలెట్లో ఆహారాన్ని తిన‌రు.

ఈ మీల్ మాత్రం టాయిలెట్ సీట్‌లో పెడ‌తారు.

నేచ‌ర్స్ టాయిలెట్ కేఫ్ అనేది భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టి టాయిలెట్ థీమ్‌తో వ‌చ్చిన రెస్టారెంట్.

చిరునామా: Safai Vidhyalay, besides Mahatma Gandhi Ashram, Ashram Road, Old Wadaj, Ahmedabad.

10. ది బార్ స్టాక్ ఎక్స్చేంజీ, ముంబయి

10. ది బార్ స్టాక్ ఎక్స్చేంజీ, ముంబయి

స్టాక్ మార్కెట్ సూత్రాల ఆధారంగా ప‌నిచేసే పబ్ సౌక‌ర్యం క‌లిగిన రెస్టారెంట్ ఇది.

మార్కెట్ ప్రారంభ స‌మ‌యం, జీరో అవ‌ర్‌లో ఇక్క‌డ త‌క్కువ ధ‌ర‌ల‌కే డ్రింక్స్ లభిస్తాయి.

వాటి ప్రాముఖ్య‌త‌ను బ‌ట్టి డ్రింక్స్ ధ‌ర‌లు మారుతూ ఉంటాయి.

ఎక్కువ ప్రాముఖ్య‌త ఉన్న డ్రింక్ ధ‌ర అత్య‌ధికంగా ఉంటుంది.

ఇద్ద‌ర‌కి ధ‌ర : రూ.1200

చిరునామా: 3rd Floor, Kenilworth Building, Off Linking Road, Linking Road, Bandra West

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+