ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) నికర లాభం 2.1 శాతం తగ్గి రూ.6.446 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం జూల
2 శాతం తగ్గిన టీసీఎస్ లాభం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) నికర లాభం 2.1 శాతం తగ్గి రూ.6.446 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.6,586 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించినట్లు ఆ సంస్థ బీఎస్ఈకి తెలిపింది. ప్రస్తుత త్రైమాసికంలో తమకు రూ.30,541 కోట్ల రెవెన్యూ వచ్చిందని, గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.29,284 కోట్ల రెవెన్యూ కంటే ఇది 4.3 శాతం ఎక్కువ అని టీసీఎస్ తెలిపింది. అదేవిధంగా షేరుకు 7 రూపాయల చొప్పున డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. ద్వితీయ త్రైమాసికంలో వస్తు డిమాండ్ అన్నివిధాలుగా పెరగడం కూడా వృద్ధి పరిమాణం కూడా విస్తరించిందని టిసిఎస్ తెలిపింది.

డిజిటల్ మార్కెట్‌లో తమ కంపెనీ వాటా విస్తరిస్తోందని టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథ్ వెల్లడించారు. అలాగే తమ పెట్టుబడుల కార్యక్రమాన్ని కూడా మరింతగా విస్తరిస్తున్నామని, డిజిటల్ డిజైనింగ్, పరివర్తనాత్మక సామర్ధ్యాల్లో పెడుతున్న పెట్టుబడులు మంచి లాభాలను ఆర్జిస్తున్నాయని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే డిజిటల్ వ్యాపారంలో తమ వృద్ధిరేటు నిలకడగా పెరుగుతోందని టీసీఎస్ సిఎఫ్‌ఓ వి.రామకృష్ణన్ తెలిపారు. టీసీఎస్ డిజిటల్ రెవెన్యూ ఏటేటా 31 శాతం మేర పెరుగుతోందని, మొత్తం కంపెనీ రెవెన్యూలో దీని వాటా 19.7 శాతమని వివరించారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications