దీవాళి సేల్ ప్రారంభించిన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్
తక్కువ ధర విమాన టిక్కెట్లను అందించే ఇండిగో, స్పైస్‌జెట్లకు పోటినిస్తూ 12 రూట్లలో ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్ తక్కువ ధరలో విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చాయి.
దేశీయ విమాన సంస్థలు ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్ దీవాళి సేల్లో భాగంగా రెగ్యులర్ ధరల కంటే తక్కువ ధరలో విమాన ప్రయాణాన్ని ఆఫర్ చేస్తున్నాయి. తక్కువ ధర విమాన టిక్కెట్లను అందించే ఇండిగో, స్పైస్‌జెట్లకు పోటినిస్తూ 12 రూట్లలో ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్ తక్కువ ధరలో విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఆహారానికి సైతం అతి తక్కువగా రూ.250 నుంచి మొదలుకొని చార్జీలను విధించబోతున్నాయి.

ఎయిర్ ఇండియా సేల్ టిక్కెట్లు అక్టోబర్ 13 నుంచి డిసెంబరు 15 మధ్య బుక్ చేసుకునే టిక్కెట్లు, చేసే ప్రయాణాలకు వర్తిస్తాయి. అయితే అక్టోబర్ 21,22,23 తేదీల్లో ఆఫర్ వర్తించదు.
జెట్ ఎయిర్‌వేస్ దీవాళి సేల్లో భాగంగా రూ.1299 నుంచే విమాన ప్రయాణ టిక్కెట్లను అమ్మకానికి ఉంచబోతున్నట్లు వయా.కామ్ పేర్కొంది. జెట్ ఎయిర్‌వేస్ ప్రీమియం లేదా బిజినెస్ క్లాస్ ప్రయాణాలకు సంబంధించి ముంబయి-ఢిల్లీ వన్ వే ప్రయాణ టిక్కెట్‌ను రూ.14,085కే అందిస్తోంది.
ఈ వారంతంతో మొదలుకొని జెట్ ఎయిర్‌వేస్ దేశీయ రుచులను తమ ప్రయాణికులకు అందించేందుకు ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా పేరుతో ప్రణాళికను సిద్దం చేసింది. ఎకానమీ క్లాస్ ప్రయాణికులు 90 నిమిషాల కంటే ఎక్కువ తమ విమానాల్లో ప్రయాణిస్తే దేశంలో వివిధ రకాల ఫుడ్ ఆప్షన్లలోంచి వెరైటీ ఫుడ్ మెనూలోంచి తమకు కావాల్సిన దాన్ని పొందవచ్చు.


Click it and Unblock the Notifications