ఆధార్ వల్ల ప్రభుత్వానికి రూ.58 వేల కోట్ల మిగులుబాటు
డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో మొదట ఖర్చు తగ్గించడమే ముఖ్యమని, ఒకసారి అది జరిగితే ఆర్థికంగా అందరినీ పైకి తీసుకురావడం సాధ్యమవుతుందని నీలేకని అభిప్రాయపడ్డారు.
భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ కార్డు వల్ల అక్రమాలకు అడ్డుకట్ట పడిందని యూఐడీఏఐ మాజీ ఛైర్మెన్ నందన్ నీలేకని పేర్కొన్నారు. ఆధార్ నమోదుతో నిజమైన లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరికి ఒకే శాశ్వత ఆధార్ సంఖ్య కలిగి ఉండటం వలన ఎలాంటి అక్రమాలు జరిగే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు 58,450 కోట్ల (9 బిలియన్ డాలర్లు) మిగులు చేకూరినట్లు తెలిపారు.

అమెరికా పర్యటనలో ఉన్న నీలేకని ప్రపంచ బ్యాంకు, ఐఎమ్ఎఫ్ వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ డిజిటల్ వ్యవస్థను సరిగ్గా వినియోగించుకుంటే అబివృద్ధి చెందుతున్న దేశాలు చాలా సమస్యలను అధిగమించవచ్చని ఆయన అన్నారు. డేటా ఎకానమీ, గుర్తింపు ధ్రువీకరణ, చెల్లింపులు సున్నితంగా సాగడం, కాగిత రహిత లావాదేవీలు మొదలైనవీ డిజిటల్ ఎకానమీలో ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో మొదట ఖర్చు తగ్గించడమే ముఖ్యమని, ఒకసారి అది జరిగితే ఆర్థికంగా అందరినీ పైకి తీసుకురావడం సాధ్యమవుతుందని నీలేకని అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 100 కోట్లకు పైగా ప్రజలు ఆధార్‌ను నమోదు చేసుకున్నారని చెప్పారు. ఆధార్ సంఖ్య జారీ కార్యక్రమాన్ని గత యూపీఏ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చినా, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విజయవంతంగా ముందుకు తీసుకెళ్తొందని కితాబిచ్చారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications