348 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
టీసీఎస్‌తో మొదలయ్యే కార్పొరేట్ ఫలితాల వెల్లడి పట్ల ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉన్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సరికి సెన్సెక్స్ 348.23 పాయింట్లు(1%) లాభపడి 32,182.22 వద్ద ముగియగా మరో సూచీ నిప
*10వేలకు పైన నిఫ్టీ
దేశంలో కీలక ఆర్థిక సమాచారానికి సంబంధించిన గణాంకాలు వెల్లనవ్వడుంటంతో దేశీయ మార్కెట్లు దూసుకెళ్లాయి. ఈ రోజు మార్కెట్ ముగిసిన తర్వాత ఆగస్టు నెల ఐఐపీ గణాంకాలు, సెప్టెంబరు నెల వినియోగదారు ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నాయి. టీసీఎస్‌తో మొదలయ్యే కార్పొరేట్ ఫలితాల వెల్లడి పట్ల ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉన్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సరికి సెన్సెక్స్ 348.23 పాయింట్లు(1%) లాభపడి 32,182.22 వద్ద ముగియగా మరో సూచీ నిప్టీ 111.60 పాయింట్లు పుంజుకుని 10,096 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం(1.9%0, స్థిరాస్తి(1.49%), ఎఫ్ఎంసీజీ(1.18%), హెల్త్ కేర్(1.15%) రంగాలు బాగా లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో కంపెనీల వారీగా చూస్తే హిందాల్కో(5.99%), భారతీ ఇన్‌ఫ్రాటెల్(5.24%), రిలయన్స్(4.22%), సన్ ఫార్మా(2.57%), అరబిందో ఫార్మా(2.04%) లాభపడిన వాటిలో ముందుండగా మరో వైపు నష్టపోయిన వాటిలో భారతీ ఎయిర్టెల్(1.17%), కోల్ ఇండియా(0.46%), ఇన్ఫోసిస్(0.37%), పవర్ గ్రిడ్(0.17%), ఏసియన్ పెయింట్స్(0.93%) ముందున్నాయి.


Click it and Unblock the Notifications