పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. దీనికి తోడు ఆన్‌లైన్ వినియోగం కూడా పెరగడంతో బ్యాంకుల నుంచి బ్యాంకులకు నగదు బదిలీతో పాటు, ఆన్‌లైన్ కొనుగోళ్లు, పేటీఎం, క
* ఆగస్టు నెలలో గణనీయంగా పెరిగిన డిజిటల్ చెల్లింపులు
పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. దీనికి తోడు ఆన్‌లైన్ వినియోగం కూడా పెరగడంతో బ్యాంకుల నుంచి బ్యాంకులకు నగదు బదిలీతో పాటు, ఆన్‌లైన్ కొనుగోళ్లు, పేటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులు బాగా ఎక్కువయ్యాయి. దీంతో నగదు రహిత లావాదేవీలకు మొగ్గుచూపేవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. గత ఆగస్టులో దేశవ్యాప్తంగా 7.56కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటాలో ఈ విషయం వెల్లడైంది.

ఆన్‌లైన్ డేటా లావాదేవీలపై ఆర్‌బీఐ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. ఆగస్టులో 7.56కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. అంతకు ముందు జులైలో 6.9కోట్లు, జూన్‌లో 6.58కోట్ల ఆన్‌లైన్ లావాదేవీలు జరిగాయి. నెలనెలకు బ్యాంకు నుంచి బ్యాంకు బదిలీలు, డెబిట్ కార్డు పేమెంట్స్ వరుసగా 9.5శాతం, 3.5శాతం వృద్ధి చెందుతున్నట్లు ఆర్‌బీఐ నివేదికలో పేర్కొంది.

అయితే బ్యాంక్ ఖాతాల ద్వారా డిజిటల్ చెల్లింపులు పెరగగా.. మొబైల్ వ్యాలెట్ పేమెంట్స్ మాత్రం కాస్త తగ్గిపోయాయి. జులైలో 23.54కోట్ల మొబైల్ వ్యాలెట్ చెల్లింపులు జరగగా.. ఆగస్టులో ఆ సంఖ్య 22.54కోట్లకు మాత్రమే పరిమితమైంది. కాగా.. ఆగస్టులో వినాయకచవితి, రాఖీ పౌర్ణమి, స్వాత్రంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఆఫర్లు అదరగొట్టిన విషయం తెలిసిందే. వీటివల్లే డిజిటల్ లావాదేవీలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్, అక్టోబర్‌లోనూ ఈ లావాదేవీలు మరింత పెరుగుతాయన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications