For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వ‌ల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

అమెరికా మార్కెట్ల రికార్డు ర్యాలీ కారణంగా గత వారం లాభాల బాట‌లో సాగిన‌ దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. రోజు మొత్తం స్వల్ప కదలికలకే పరిమితమై చివరికి సోమ‌వారం నామమాత్ర లాభాలతో ముగిశాయి

|

అమెరికా మార్కెట్ల రికార్డు ర్యాలీ కారణంగా గత వారం లాభాల బాట‌లో సాగిన‌ దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. రోజు మొత్తం స్వల్ప కదలికలకే పరిమితమై చివరికి సోమ‌వారం నామమాత్ర లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 33 పాయింట్లు పెరిగి 31,847 వద్ద నిలిచింది. నిఫ్టీ 9 పాయింట్లు బలపడి 9,989 వద్ద స్థిరపడింది. అయితే తొలుత నిఫ్టీ ఒక దశలో 10,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఈ ఏడాది రెండో త్రైమాసిక ఫ‌లితాల‌ను కంపెనీలు వెల్ల‌డించే స‌మ‌యం ఆస‌న్నం అవ‌డంతో ఇన్వెస్ట‌ర్లు అప్ర‌మత్తంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో లాభాలు ప‌రిమితం అయ్యాయి.

లాభాల‌తో ముగిసిన మార్కెట్లు

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(2.2%), మూల‌ధ‌న వ‌స్తువుల‌(0.9%) బాగా లాభ‌ప‌డ్డాయి. ఇంకా ఎఫ్ఎంసీజీ(0.66%), ఐటీ(0.39%) ఒక ర‌కంగా లాభ‌ప‌డిన వాటిలో ఉన్నాయి. మ‌రో వైపు చ‌మురు, స‌హజ వాయు రంగం(1.01%), మౌలిక రంగం(0.81%), ప‌వ‌ర్‌(0.59%), పీఎస్‌యూ(0.54%) రంగాలు న‌ష్ట‌పోయాయి
బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభ‌ప‌డ్డ వాటిలో కోల్ ఇండియా(1.81%), హెచ్‌యూఎల్(1.37%0, కొట‌క్ బ్యాంక్(1.34%), డాక్ట‌ర్ రెడ్డీస్(1.34%), అదానీ పోర్ట్స్(1.16%) ముందుండ‌గా మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో ప‌వ‌ర్ గ్రిడ్‌(1.68%), ఓఎన్‌జీసీ(1.58%), రిల‌య‌న్స్‌(0.73%), ఎన్‌టీపీసీ(0.8%), బ‌జాజ్ ఆటో(0.58%) ఉన్నాయి.

English summary

స్వ‌ల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు | The Sensex and Nifty ended marginally higher

The 30-share BSE index Sensex ended higher by 32.67 points or 0.1 per cent at 31,846.89 and the 50-share NSE index Nifty closed up 9.05 points or 0.09 per cent at 9,988.75.
Story first published: Monday, October 9, 2017, 16:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X