For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమిత్ షా కొడుకు కంపెనీ ఆస్తులు ఏడాదిలో 16000 రెట్లు

జై షా కంపెనీల టర్నోవర్ పెరుగుదల..లోపలి విషయాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో జరిగిందనే విషయం బహిర్గతం అవుతోంది. ఈ అంశాలపై ప్రముఖ వెబ్ సైట్ ‘దవైర్.ఇన్’ సంచలన కథనం ప్రచురింది. అదేంటో మీరూ చూడండి. ఈ వ్య‌వ‌

|

మోడీ జ‌ట్టుకు మొద‌టిసారి అవినీతి మ‌ర‌క అంటేలా ఉంది. మోడీ, అమిత్ జోడీల‌పై దాడికి ఇప్పుడు ప్ర‌తిప‌క్షాల‌కు స‌రైన పాయింట్ దొరికింది. అమిత్ షా తనయుడు జై షా కంపెనీల టర్నోవర్ సంవ‌త్స‌రం కాలంలో 16 వేల రెట్లు పెరగటం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ఈ వ్యవహారంపై కూడా మరి సీబీఐ విచారణ ఆదేశిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అయితే ఈ ఆరోపణలను బిజెపి కొట్టిపడేస్తోంది. అంతా సవ్వంగానే ఉందని చెబుతోంది. కానీ జై షా కంపెనీల టర్నోవర్ పెరుగుదల..లోపలి విషయాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో జరిగిందనే విషయం బహిర్గతం అవుతోంది. ఈ అంశాలపై ప్రముఖ వెబ్ సైట్ 'దవైర్.ఇన్' సంచలన కథనం ప్రచురింది. అదేంటో మీరూ చూడండి. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర అంశాలు..

 16లక్ష‌ల శాతం వృద్ది

16లక్ష‌ల శాతం వృద్ది

టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీని 2004లో నెలకొల్పారు. ఇందులో అమిత్ షా తనయుడు జై షా, జితేంద్ర షా, అమిత్ షా భార్య సోనాల్ షా కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారు. 2013-14 సంవత్సరంలో టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ కు ఎలాంటి స్థిరాస్థి కానీ..ఎలాంటి స్టాక్ నిల్వలు లేవు. కంపెనీ ఆదాయ పన్ను శాఖ నుంచి 5796 రూపాయల రీఫ‌డ్ కూడా పొందింది. ఈ కాలంలో ఆదాయం కేవలం 50 వేల రూపాయలు మాత్రమే. కానీ 2015-16 సంవత్సరంలో మాత్రం కంపెనీ ఆదాయం ఏకంగా ఒకేసారి 80.5 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇది 16 లక్షల శాతం వృద్ధి రేటు అన్న మాట.

ఇన్వెంట‌రీస్ ఒకే సారి 9 కోట్లకు

ఇన్వెంట‌రీస్ ఒకే సారి 9 కోట్లకు

కంపెనీ రిజర్వులు..మిగులు కూడా 19 లక్షల రూపాయల నుంచి 80.2 లక్షల రూపాయలకు పెరిగాయి. వ్యాపార చెల్లింపుల మొత్తం కూడా 5618 రూపాయల నుంచి 2.65 కోట్ల రూపాయలకు పెరిగాయి. అంతకు ముందు ఏడాది కంపెనీ ఆస్తులు కేవలం రెండు లక్షల రూపాయలుగానే చూపించారు. ఎలాంటి స్థిరాస్తులు కూడా లేవన్నారు. స్వల్పకాలిక రుణాలు, అడ్వాన్స్ లు కూడా పది వేల రూపాయల నుంచి 4.14 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఇన్వెంటరీస్ కూడా జీరో నుంచి ఒకేసారి 9 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఈ వివరాలు అన్నీ కూడా దివైర్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ (ఆర్ వోసీ) నుంచి సేకరించినవే.

ఆదాయ‌పు పన్ను రిట‌ర్నుల ఫైలింగ్‌లో ఇలా...

ఆదాయ‌పు పన్ను రిట‌ర్నుల ఫైలింగ్‌లో ఇలా...

ఉత్పత్తుల అమ్మకం ద్వారానే ఆదాయం పెరిగిందని ఫైలింగ్స్ లో పేర్కొన్నారు. అదే సమయంలో విదేశాల నుంచి కూడా 51 కోట్ల రూపాయల ఆదాయం చూపించారు. అంతకు ముందు ఏడాది మాత్రం అది జీరో. మరో ఆసక్తికరమైన అంశం కూడా ఇందులో వెలుగుచూసింది. ఈ కంపెనీ లిస్టెడ్ సంస్థ అయిన కెఐఎఎఫ్ఎస్ ఫైనాన్సియల్ సర్వీసెస్ నుంచి 15.78 కోట్ల రూపాయల అన్ సెక్యూర్డ్ రుణం పొందింది. అయితే ఈ టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ కు ఇఛ్చిన అన్ సెక్యూర్డ్ లోన్ వివరాలు మాత్రం కంపెనీ వార్షిక నివేదికలో ఎక్కడా పొందుపర్చలేదు. ఇలాంటి వింతలు ఎన్నో అమిత్ షా తనయుడి కంపెనీలో చోటుచేసుకున్నాయి. అయితే ది వైర్ కథనంపై అమిత్ షా తనయుడు మండిపడ్డారు. తమ కంపెనీ వ్యవహారాల్లో ఎలాంటి లోటుపాట్లు లేవని..వైర్ పై వంద కోట్లకు పరువు నష్టం దావావేస్తామని ప్రకటించారు.

ముఖ్యాంశాలు

ముఖ్యాంశాలు

* మోడీ ప్ర‌ధానమంత్రి అయిన ఏడాది కాలంలోనే జై షా ఆస్తులు 16 వేల రెట్లు పెరిగాయి

* రెవెన్యూ 50 వేల నుంచి 80 కోట్ల‌కు ఒక్క ఏడాది కాలంలోనే

* ప్రాథ‌మికంగా స్టాక్ ట్రేడింగ్ వ్యాపారం నిర్వ‌హించే కంపెనీ ప‌వ‌న విద్యుత్ త‌యారీ, పీఎస్‌యూల‌కు రుణాలు క‌ల్పించే దానిలోకి అడుగిడింది.

* అమిత్ షా కొడుకు నిజాయితీగా, న్యాయ‌బ‌ద్దంగా చేస్తున్న వ్యాపారం గురించి క‌థ‌నం రాస్తే మీపై దావా వేస్తామ‌ని జై షా కంపెనీ త‌ర‌పు లాయ‌ర్లు దై వైర్‌కు హెచ్చ‌రిక‌లు పంపారు.

టెంపుల్ ఎంట‌ర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి

టెంపుల్ ఎంట‌ర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి

అహ్మ‌దాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాల‌యంలో 2004 ఆగ‌స్టు 23న కంపెనీ న‌మోద‌యింది.

ఈ కంపెనీ ప్రభుత్వేత‌ర కంపెనీగాను, షేర్ వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన వ‌ర్గీక‌ర‌ణ‌లో ఉంది.

ఈ కంపెనీ సీఐఎన్‌(CIN) - U51109GJ2004PTC044634, రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌- 044634

కంపెనీ అడ్ర‌స్‌: . 503, Sheraton House, B/s Pramukh Plaza Polytechnic Road, Ambawadi Ahmedabad Ahmedabad GJ 380015 IN, Ahmedabad - 380054, Gujarat, India.

అమిత్ షా గురించి

అమిత్ షా గురించి

అమిత్ షా ప్ర‌స్తుతం భారతీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా ప‌నిచేస్తున్నారు.

గుజ‌రాత్‌కు చెందిన ఈ రాజ‌కీయ నాయకుడు గుజ‌రాత్ రాష్ట్ర మాజీ హోం మినిస్ట‌ర్‌.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో భాజ‌పా త‌ర‌పున ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఇంచార్జీగా ప‌నిచేశారు.

ఆయ‌నకు ఉన్న ఒకే ఒక కుమారుడు జై షా

Read more about: amit shah company revenue turnover
English summary

అమిత్ షా కొడుకు కంపెనీ ఆస్తులు ఏడాదిలో 16000 రెట్లు | An astonishing increase in the turnover of Amit Shah temple enterprises

An astonishing increase in the turnover of Amit Shah, BJP President’s son, Jay Amitbhai Shah’s Temple Enterprise Private Ltd was revealed by the details filed by the firm in the Registrar of companies(ROC).
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X