ఇన్వెస్టర్ల సౌలభ్యం కోసం మ్యూచువల్ ఫండ్ల వర్గీకరణ
శుక్రవారం విడుదల చేసిన సర్క్యులర్‌లో మ్యూచువల్ ఫండ్లను డెట్, ఈక్విటీ, హైబ్రిడ్, సొల్యూషన్ ఒరియెంటెడ్(ప్రత్యేక ఉద్దేశం), ఇతర కేటగిరీలుగా విభజించాలని సెబీ ప్రతిపాదించింది
పెట్టుబడిదారుల సౌకర్యం కోసం మ్యూచువల్ పండ్లన్నింటినీ 5 వర్గాలుగా విభజించాలని అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలను సెబీ కోరింది. శుక్రవారం విడుదల చేసిన సర్క్యులర్‌లో మ్యూచువల్ ఫండ్లను డెట్, ఈక్విటీ, హైబ్రిడ్, సొల్యూషన్ ఒరియెంటెడ్(ప్రత్యేక ఉద్దేశం), ఇతర కేటగిరీలుగా విభజించాలని సెబీ ప్రతిపాదించింది. ఈ వర్గీకరణ పెట్టుబడి వ్యూహాన్ని అనుసరించి ఉండాలని సెబీ తెలిపింది. ఈ ప్రతిపాదనతో మ్యూచువల్ పండ్ హౌస్‌లు రకరకాలుగా ఉన్న ఎక్కువ పథకాలను కలిపి వర్గీకరణలో ఇన్వెస్టర్లకు తికమక లేకుండా పరిమిత పథకాల రకాలను అందుబాటులో ఉంచే వీలు కలుగుతుంది.
ప్రతి క్లాస్ మళ్లీ అంతర్గతంగా విభజన అయిన తర్వాత మొత్తం 36 వివిధ పథకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డివిడెండ్ ఆధారిత ఈక్విటీ, బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ ఫండ్ ఇలా రకరకాల ఫండ్ల పేరుతో మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఫండ్లను వేరు పరిచే అవకాశం ఉంది. డూప్లికేషన్‌కు తావు లేకుండా ఫండ్ హౌస్ ఒక్కో కేటగిరీకి ఒకే స్కీమ్‌ను ఉంచేలా కొత్త వర్గీకరణలు ఉంటాయి.

మన దేశంలో 42 ఫండ్ హౌస్‌లు 20.4 లక్షల కోట్ల నిధులను నిర్వహిస్తున్నాయి. సెప్టెంబరు నాటికి 2వేల మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడులు మ్యూచువల్ పండ్ సంస్థల వద్ద ఉన్నాయి. స్కీమ్‌ల కలయికతో పరిమితంగా మ్యూచువల్ పండ్ పథకాల్లో రకాలను అందుబాటులో ఉంచడం ఇప్పుడే మొదలైందని ఇన్వెస్టర్లకు సులువుగా ఉంచే ఏర్పాటు ఇప్పుడే మొదలైందని మిరాయ్ అసెట్స్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో స్వరూప్ మొహంతి తెలిపారు.


Click it and Unblock the Notifications