5800 అనుమానస్పద కంపెనీలు
పెద్ద నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు చేసిన వారికి సంబంధించిన సమాచారాన్ని 13 బ్యాంకులు అందజేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దాదాపు 5800 అనుమానాస్పద కంపెనీల నుంచి అధికమొత్తంలో డిప
* నోట్ల రద్దు తర్వాత డొల్లకంపెనీల ద్వారా పెద్ద ఎత్తున లావాదేవీలు
పెద్ద నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు చేసిన వారికి సంబంధించిన సమాచారాన్ని 13 బ్యాంకులు అందజేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దాదాపు 5800 అనుమానాస్పద కంపెనీల నుంచి అధికమొత్తంలో డిపాజిట్లు చేయడాన్ని గుర్తించామని పేర్కొంది. ఈ ఖాతాలను బ్యాంకు అధికారులు గుర్తించారని వెల్లడించింది. 5800 డొల్ల కంపెనీలకు చెందిన 13,140 బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.4574కోట్లు డిపాజిట్ అయ్యాయని పేర్కొంది. పలు కంపెనీలు అందులోంచి వెంటనే రూ.4,552కోట్లను వెనక్కి తీసుకున్నాయని పేర్కొంది. నోట్ల రద్దు తర్వాత జరిగిన 2,09,032 కంపెనీల లావాదేవీలపై ప్రభుత్వం దర్యాప్తు చేసింది.

నోట్ల రద్దు సమయంలో రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను చెలామణిలో ఉన్న నోట్లతో మార్చుకుని ఆ తర్వాత పలు కంపెనీలు కొన్ని ఖాతాలను మూసివేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపారు. 13 జాతీయ బ్యాంకులు అందజేసిన నివేదిక ఆధారంగా పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆయా కంపెనీలు రూ.4,753కోట్ల మేరకు లావాదేవీలు నిర్వహించాయి. తద్వారా బ్యాంకు లావాదేవీలు, ఖాతాల సంఖ్య ఒక్కసారిగా పెరిగాయి. అనంతరం ఖాతాలు మూసివేయడంతో లావాదేవీలు మందగించాయి. మూతపడ్డ కంపెనీలు పలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి తమ నల్లధనాన్ని మార్చుకున్నట్టు ఐటి అధికారులు గుర్తించారు. 2016 నవంబర్ 8కి ముందుకు 429 కంపెనీల ఖాతాల్లో ఎలాంటి బ్యాలెన్స్ లేదు. ఆ తర్వాత వీటిల్లో రూ.11 కోట్ల మేర జమ అయ్యాయి. అనంతరం ఈ ఖాతాలను ప్రభుత్వం స్తబ్దతలో పెట్టిన సమయం నాటికి రూ.42,000కు డిపాజిట్లు తగ్గాయి. అంతలోపే చాలా కంపెనీలు తమ నగదును ఉపసంహరించుకున్నట్లు అధికారులు గుర్తించారు.

ఒక కంపెనీకి అత్యధికంగా 2,134 బ్యాంకు ఖాతాలు ఉండగా, మరికొన్నింటికి 900, 300 ఖాతాలు ఉన్నాయి. ఎక్కువ కంపెనీలకు 100కు పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. కొన్ని కంపెనీల బ్యాంకు ఖాతాల్లో అప్పులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఖాతాల నుంచి కోట్లలో నగదు జమ కావడం, విత్‌డ్రా చేయడం జరిగినట్లు గుర్తించారు. డొల్ల కంపెనీలను గుర్తించి వాటిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నోట్ల రద్దు తర్వాత ఏయే బ్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో నగదు జమ అయ్యిందనే వాటికి సంబంధించిన వివరాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెలికి తీస్తోందని తెలిపింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications