భారత ఆర్థిక వ్యవస్థ స్వల్ప ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ వృద్ది రేటులో వెనుకపడినప్పటికీ ముకేశ్ అంబానీ సంపద మాత్రం పెరిగింది. ఫోర్బ్స్ జాబితాలో ఏయే ప్రముఖులు ఏయే స్థానాల్లో ఉన్నారో చూద్దాం.
ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2017 ఏడాదికి భారతదేశంలో ధనవంతుల జాబితాను విడుదల చేసింది. అందులో వరుసగా 10వ ఏటా ముకేశ్ అంబానీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ స్వల్ప ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ వృద్ది రేటులో వెనుకపడినప్పటికీ ముకేశ్ అంబానీ సంపద మాత్రం పెరిగింది. ఈ జాబితాలో ఏయే ప్రముఖులు ఏయే స్థానాల్లో ఉన్నారో చూద్దాం.

1. ముకేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ 38 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారని ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. ఒక పక్క ఆర్థిక వ్యవస్థ కుంగుతున్నప్పటికీ ఆయన సంపద మాత్రం సంవత్సర కాలంలో 15.3 బిలియన్ డాలర్లు పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ విధంగా ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలో ఇండియాలో అత్యధిక ధనవంతుడిగా ముకేశ్ అంబానీ రావడం వరుసగా పదో సంవత్సరం.

2. అజిమ్ ప్రేమ్‌జీ
సాధారణంగా టాప్-10లో రెండో స్థానాన్ని సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ దక్కించుకుంటారు. అయితే ఈసారి విప్రో లిమిటెడ్ ఛైర్మన్ 19 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది.

3. హిందూజా సోదరులు
ఫోర్బ్స్ ఇండియా ధనవంతుల జాబితా 2017లో హిందూజా సోదరులు మూడో స్థానం సాధించారు. వారి నికర సంపద విలువ 18.4 బిలియన్ డాలర్లు. మే 2017లో సైతం యూకేలో అత్యధిక ధనవంతులైన 1000 మంది జాబితాలో వీరు నిలిచారు.

4. లక్ష్మీ మిట్టల్
ఆర్సెలార్ మిట్టల్ సంస్థ అధినేత లక్ష్మీ మిట్టల్ 16.5 బిలియన్ డాలర్లతో ఈ ఏడాది ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచి ఎప్పటిలాగే సంపదతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 1950లో రాజస్థాన్ రాష్ట్రంలో జన్మించిన ఆయన కోల్‌కత సెయింట్ జేవియర్ కాలేజీలో చదువుకున్నారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బీ.కాం పట్టా పొందారు.

5. పల్లోంజి మిస్త్రీ
భారత నిర్మాణ రంగ దిగ్గజం షాపూర్జీ పల్లోంజి గ్రూప్ అధినేత పల్లోంజి మిస్త్రీ 16 బిలియన్ డాలర్లతో జాబితాలో 5వ స్థానంలో నిలిచారు. పల్లోంజి మిస్త్రీ ప్రస్తుత వయసు 88. ఈయనకు మన దేశ పౌరసత్వంతో పాటు ఐర్లాండ్ దేశ పౌరసత్వం సైతం ఉంది. టాటా సన్స్‌లో పల్లోంజి మిస్త్రీ గారికి 18.4% వాటా ఉంది.

6. గోద్రెజ్ గ్రూప్
గోద్రెజ్ కుటుంబం 14.2 బిలియన్ డాలర్లతో ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో 6వ స్థానంలో ఉంది. 2016 జనవరి నాటికి ఆది గోద్రెజ్ నికర ఆస్తుల విలువ 4 బిలియన్ డాలర్లు. ఆది గోద్రెజ్ ఎంఐటీ సోలన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ప్రస్తుతం 2011 ఏప్రిల్ నుంచి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)కి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

7. శివ్‌నాడర్
హెచ్‌సీఎల్ వ్యవస్థాపక ఛైర్మన్ శివ నాడర్. ఈ ఏడాది ఫోర్బ్స్ భారత ధనవంతుల జాబితాలో 7వ స్థానంలో శివ నాడర్ నిలిచారు. ఆయన నికర సంపద 13.6 బిలియన్ డాలర్లు అయినట్లు ఫోర్బ్స్ లెక్క గట్టింది.
శివనాడర్ చెన్నైలో ఎస్ఎస్ఎన్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌ను స్థాపించారు.

8. కుమార మంగళం బిర్లా
ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ అయిన కుమార బిర్లా 12.6 బిలియన్ డాలర్లతో ఫోర్బ్స్ జాబితాలో 8వ స్థానం దక్కించుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బిర్లా కుటుంబంలో కుమార మంగళం బిర్లా నాలుగో తరం వారు. ఆయన స్వతహాగా చార్టెడ్ అకౌంటెంట్.

9. దిలీప్ సంఘ్వీ
సన్ ఫార్మా వ్యవస్థాపక ఎండీ అయిన దిలీప్ సంఘ్వీ ఈ ఏడాది ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో 9వ స్థానానికి దిగజారారు. ఈయాన నికర సంపద 12.1 బిలియన్ డాలర్లు. కలకత్తా యూనివర్సిటీ నుంచి బీ.కాం పూర్తిచేసిన ఈయన మొదట డ్రగ్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.

10. గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ గౌతమ్ అదానీ ఫోర్బ్స్ భారత శ్రీమంతుల్లో పదో స్థానానికి ఎగబాకారు. ఈ ఏడాది ఆయన నికర సంపద విలువ 11 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. అదానీ గ్రూప్ ప్రధాన వ్యాపారాలు కోల్ ట్రేడింగ్; కోల్ మైనింగ్; చమురు,సహజ వాయువు వెలికితీత;పోర్టు వ్యాపారాలు, లాజిస్టిక్స్, విద్యుత్ తయారీ ప్రాజెక్టులు, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మొదలైనవి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications