స్వల్పంగా పుంజుకున్న బంగారం ధర
అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు, స్థానిక బంగారు వ్యాపారులు కొనుగోళ్లు జరపడంతో బంగారానికి స్వల్పంగా డిమాండ్ పెరిగింది. దీంతో రేట్లు పెరిగేందుకు ఆస్కారం ఏర్పడింది.
బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పుంజుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.75 పెరిగి రూ.30,450గా పలుకుతోంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు, స్థానిక బంగారు వ్యాపారులు కొనుగోళ్లు జరపడంతో బంగారానికి స్వల్పంగా డిమాండ్ పెరిగింది. దీంతో రేట్లు పెరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. వెండి సైతం కాస్త కోలుకొని కేజీకి 100 రూపాయలు పెరిగి రూ. 40,100 వద్ద ఉంది.

అంతర్జాతీయంగా సైతం బంగారం ధరలు 0.03% పెరిగి ఔన్సుకు 1268.20 అమెరికన్ డాలర్లుగా పలుకుతోంది. అదే వెండి మాత్రం 0.06% పెరిగి ఔన్సుకు 16.59 అమెరికా డాలర్లుగా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 99.9%, 99.5% స్వచ్చత గల బంగారం ధరలు రూ.75 పెరగడంతో రూ.30,450గాను, రూ.30,300గాను పలుకుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్లో బంగారం రూ.225 తగ్గిన సంగతి తెలిసిందే. భారతదేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒక్కో నగరంలో ఒక్కోలా ఉంటాయి. వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తెలుగు గుడ్‌రిటర్న్స్ గోల్డ్,సిల్వర్ రేట్ల విభాగాన్ని చూడొచ్చు.
బంగారం, వెండి ధరలు-ప్రధాన నగరాల్లో
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications