స్థిరంగా కొనసాగుతున్న మార్కెట్
అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో చమురు,సహజ వాయు, కన్సూమర్ డ్యూరబుల్స్, పీఎస్‌యూ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో నాలుగు రోజుల లాభాలకు చెక్ పెడుతూ దేశీయ మార్కెట్లు నష్టపోయాయి.
*80 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ఉదయం నుంచి హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్లు చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో చమురు,సహజ వాయు, కన్సూమర్ డ్యూరబుల్స్, పీఎస్‌యూ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో నాలుగు రోజుల లాభాలకు చెక్ పెడుతూ దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 79.68 పాయింట్లు దిగజారి 31,592 వద్ద స్థిరపడగా మరో సూచీ నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 9889 వద్ద ముగిసింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(0.86%), హెల్త్ కేర్(0.35%), లోహ రంగం(0.29%), పవర్(0.17%) లాభాల బాటలో సాగగా, మరో వైపు నష్టపోయిన వాటిలో చమురు,సహజ వాయు(0.56%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.4%),పీఎస్‌యూ(0.31%), బ్యాంకింగ్(0.31%) రంగాలు ఉన్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్‌ను చూస్తే ఎన్టీపీసీ(1.79%), కోల్ ఇండియా(1.11%), ఎం అండ్ ఎం(0.85%), రిలయన్స్(0.61%), కొటక్ బ్యాంక్(0.49%) ఎక్కువ లాభపడిన వాటిలో ఉండగా మరో వైపు పవర్ గ్రిడ్(1.99%), ఐసీఐసీఐ బ్యాంక్(1.54%), హీరో మోటోకార్ప్(0.97%), బజాజ్ ఆటో(0.94%), యాక్సిస్ బ్యాంక్(0.82%) నష్టపోయి వాటిలో ముందు ఉన్నాయి.


Click it and Unblock the Notifications