ఈ తరహా తీసుకున్న డబ్బును మీరు ఏ ఖర్చుకైనా వాడుకోవచ్చని బ్యాంకు తెలిపింది. అయితే ఈ తరహా తీసుకునే రుణం రూ.50 వేలకు మించకూడదు. ఇంకా వీటీకి ఎటువంటి నిర్వహణ చార్జీలు అదనంగా ఉండవు.
ఈ పండుగకి ఏదైనా వస్తువు కొనుక్కోవాలని అనుకున్నారు. అయితే అందుకు తగిన డబ్బు లేదనుకోండి. ఏం చేస్తారు? చాలా మంది వ్యక్తిగత రుణం కోసం ప్రయత్నిస్తారు. కొంత మంది క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసి మళ్లీ నిదానంగా అప్పు తీర్చేస్తారు. అయితే అన్ని వేళలా అందరికీ అంత సులువుగా వ్యక్తిగత రుణం లభించదు. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఎస్బీఐ పండుగ రుణాలను(ఫెస్టివ్ లోన్) ఆఫర్ చేస్తున్నది. ఈ తరహా తీసుకున్న డబ్బును మీరు ఏ ఖర్చుకైనా వాడుకోవచ్చని బ్యాంకు తెలిపింది. అయితే ఈ తరహా తీసుకునే రుణం రూ.50 వేలకు మించకూడదు. ఇంకా వీటీకి ఎటువంటి నిర్వహణ చార్జీలు అదనంగా ఉండవు. ఎస్‌బీఐ పండుగ రుణం(ఫెస్టివల్ లోన్)కు సంబంధించిన ఇతర ముఖ్యాంశాలను ఇక్కడ తెలుసుకుందాం.
రుణ పరిమితి:
రుణం తీసుకునే వ్యక్తి ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యం ఆధారంగా ఎస్‌బీఐ ఫెస్టివల్ లోన్ పరిమితిని నిర్ణయిస్తారు. కనీసం రూ.5వేలు మొదలుకొని గరిష్టంగా రూ.50 వేల వరకూ ఈ తరహా రుణం ఉంటుంది. లేదా నెలవారీ ఆదాయానికి 4 రెట్ల వరకూ సొమ్మును రుణంగా పొందవచ్చు. ఎంత ఇవ్వాలనేది బ్యాంకు నిర్ణయిస్తుంది.

కావాల్సిన పత్రాలు:
ఇటీవల వేతన పత్రం(శాలరీ స్లిప్), ఫారం 16 వంటివి వేతన ఉద్యోగులు సమర్పించాల్సినవి. అదే స్వయం ఉపాధి కలిగిన వారైతే గత రెండు సంవత్సరాలకు సంబంధించిన ఐటీ రిటర్నులు రుజువుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఇంటి చిరునామాతో పాటు, ఫోటోను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
సెక్యూరిటీ: ఉద్యోగం కల్పించిన సంస్థ నుంచి చెక్ ఆఫ్ సౌకర్యం ఉన్నట్లయితే ఎటువంటి ప్రాథమిక లేదా హామీ పూర్వక సెక్యూరిటీని సమర్పించాల్సిన పనిలేదని ఎస్‌బీఐ తెలిపింది. లేకపోతే జీవిత భాగస్వామి నుంచి వ్యక్తిగత హామీ ఉన్నట్లయితే చాలు. లేదా ఎవరైనా ఇతర వ్యక్తి నుంచి సొమ్ముకు సమానమైన హామీని ఇప్పించవచ్చు.
రుసుములు: ఒక్కో దరఖాస్తుకు బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.100 చార్జీ చేస్తుంది. ఎటువంటి పెనాల్టీ లేకుండా రుణాన్ని కొంచెంగా లేదా మొత్తంగా ఏ దశలోనైనా తిరిగి చెల్లించవచ్చని ఎస్బీఐ పేర్కొన్నది.
ఈఎంఐ షెడ్యూల్: 12 వాయిదాల్లో రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications