ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై విమ‌ర్శ‌ల‌కు మోదీ 10 స‌మాధానాలు

ప‌లు విమ‌ర్శ‌ల‌కు స‌మాధానాలిస్తూ గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన పాల‌న‌తో పోల్చి చూపుతూ కొన్ని విష‌యాల‌ను లేవ‌నెత్తారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు సంబంధించి మోదీ ప్ర‌సంగంలోని 10 ముఖ్య అంశాలు మీ కోసం...

ఈ ఏడాది మొద‌టి త్రైమాసికంలో వృద్ది రేటు 5.7శాతానికి ప‌డిపోవ‌డంతో విమ‌ర్శ‌కులు మోడీపై ప‌లు విధాలుగా ప్ర‌తికూల భావాల‌ను వెల్ల‌డిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి మోదీ స్పందించారు. బుధ‌వారం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌ట‌రీస్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఒక కార్య‌క్ర‌మంలో త‌న‌పై, త‌మ‌ ప్ర‌భుత్వంపై వ‌స్తున్న ప‌లు విమ‌ర్శ‌ల‌కు స‌మాధానాలిస్తూ గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన పాల‌న‌తో పోల్చి చూపుతూ కొన్ని విష‌యాల‌ను లేవ‌నెత్తారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు సంబంధించి మోదీ ప్ర‌సంగంలోని 10 ముఖ్య అంశాలు మీ కోసం...

1. వృద్దిని ప‌ట్టాలెక్కించేందుకు ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నం

1. వృద్దిని ప‌ట్టాలెక్కించేందుకు ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నం

ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో వృద్ది రేటు విష‌యంలో వెనుక‌బ‌డ‌టం ప్ర‌భుత్వానికి తెలుస‌ని త‌మ ప్ర‌భుత్వం తిరిగి వృద్దిని ప‌ట్టాలెక్కించేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం ఈ మూడేళ్ల‌లో తీసుకున్న నిర్ణ‌యాలైన నోట్ల ర‌ద్దు, జీఎస్టీ, బ్యాంకింగ్ దివాలా చ‌ట్టం వంటివి వృద్దిని త‌దుప‌రి ద‌శ‌కు తీసుకెళ్ల‌గ‌ల‌వ‌ని ఆశాభావం వ్యక్తం చేశారు.

2. జీఎస్టీ అమ‌లు-ఇబ్బందులు

2. జీఎస్టీ అమ‌లు-ఇబ్బందులు

జీఎస్‌టీ అమ‌లు గురించి అందులో త‌లెత్తుతున్న ఇబ్బందుల‌పై మాట్లాడుతూ తాను ఇదివ‌ర‌కే చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, సంస్థ‌లు ఎదుర్కొంటున్న సమ‌స్య‌ల‌ను గుర్తించాల‌ని జీఎస్టీ కౌన్సిల్‌ను కోరిన‌ట్లు చెప్పారు.

3. చిన్న వ్యాపారుల‌కు అవ‌స‌ర‌మైన స‌వ‌ర‌ణ‌లు

3. చిన్న వ్యాపారుల‌కు అవ‌స‌ర‌మైన స‌వ‌ర‌ణ‌లు

చిన్న ట్రేడ‌ర్లు లేదా వ్యాపారుల‌కు అనుకూలంగా ఉండేందుకు సవ‌ర‌ణ‌లు చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉన్న‌ట్లు మోదీ భ‌రోసా ఇచ్చారు. నోట్ల ర‌ద్దు త‌ర్వాత న‌గ‌దు ప్ర‌వాహం త‌గ్గింద‌ని మోదీ చెప్పారు.

4. మూలాలు బ‌లంగా ఉన్నాయ్‌

4. మూలాలు బ‌లంగా ఉన్నాయ్‌

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మూలాలు బలంగా ఉన్నాయ‌ని విశ్వాసం వ్య‌క్తం చేసిన మోదీ, సంస్క‌ర‌ణ‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని నొక్కి చెప్పారు. మ‌రో వైపు ఆర్థిక స్థిర‌త్వాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవ‌న్నీ చేస్తామ‌న్నారు. ఒక త్రైమాసికంలో వృద్ది రేటు ప‌డిపోవ‌డం తాత్కాలికమైన‌ది అని చెప్పుకొచ్చారు. వ‌చ్చే త్రైమాసికాల్లో వృద్ది రేటు మ‌ళ్లీ పెరుగుతుంద‌ని భ‌రోసా వ్య‌క్త‌ప‌రిచారు.

5. ఎఫ్‌డీఐల రాక ఇలా...

5. ఎఫ్‌డీఐల రాక ఇలా...

త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎఫ్‌డీఐల ప్ర‌వాహం గురించి అంకెల‌తో స‌హా వివ‌రించారు. మూడేళ్ల‌లో వివిధ రంగాల్లో వ‌చ్చిన ఎఫ్‌డీఐ(విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు)

నిర్మాణ రంగంలోకి వ‌చ్చిన ఎఫ్‌డీఐల్లో 75% గ‌త మూడేళ్ల‌లో వ‌చ్చాయి.

మైనింగ్‌లోకి 56% ఎఫ్‌డీఐల రాక‌

కంప్యూట‌ర్ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్లోకి 53% ఎఫ్‌డీఐలు వ‌చ్చాయి.

రెన్యువ‌బుల్ ఎన‌ర్జీ(పున‌రుత్పాద‌క ఇంధ‌న‌,శ‌క్తి వ‌న‌రులు)లోకి 49% ఎఫ్‌డీఐ

ఇవ‌న్నీ 1992 త‌ర్వాత దేశంలోకి వ‌చ్చిన ఎఫ్‌డీఐల్లో మొత్తం వ‌చ్చిన వాటిలో గ‌త మూడేళ్ల శాతాలు.

6. యూపీఏ హ‌యాంలో వృద్ది రేట్ల సంగ‌తి

6. యూపీఏ హ‌యాంలో వృద్ది రేట్ల సంగ‌తి

వృద్ది రేటు ఒక త్రైమాసికంలో తగ్గితేనే విమ‌ర్శలు వ‌స్తున్న త‌రుణంలో గతంలో యూపీఏ హ‌యాంలో వృద్ది రేటు 5.7% త‌గ్గిన విష‌యాన్ని మోదీ ప్ర‌స్తావించారు. కొన్ని త్రైమాసికాల్లో వృద్ది రేటు 0.2%, 1.5% సైతం న‌మోద‌యింద‌ని మోదీ చెప్పారు.

7. ద్ర‌వ్యోల్బ‌ణం గత ప్ర‌భుత్వ హయాంలోనే ఎక్కువ‌

7. ద్ర‌వ్యోల్బ‌ణం గత ప్ర‌భుత్వ హయాంలోనే ఎక్కువ‌

గ‌త ప్ర‌భుత్వ హయాంలో జీడీపీ వృద్ది రేటు కంటే ద్ర‌వ్యోల్బ‌ణం ఎక్కువ‌గా న‌మోద‌య్యేది. ధ‌ర‌ల పెరుగుద‌ల‌, ఆర్థిక లోటు, క‌రెంటు ఖాతా లోటు వంటివి వార్త‌ల్లోకి వ‌చ్చిన‌ప్పుడు జీడీపీ వృద్ది ప్ర‌స్తావ‌న వ‌చ్చేదని వ‌క్కాణించారు.

8. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత నియంత్ర‌ణ‌లో ద్ర‌వ్యోల్బ‌ణం

8. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత నియంత్ర‌ణ‌లో ద్ర‌వ్యోల్బ‌ణం

ఎన్‌డీఏ ప్ర‌భుత్వం హ‌యాంలో రెండంకెల స్థాయి నుంచి ద్ర‌వ్యోల్బ‌ణం 3% కంటే త‌క్కువ‌కు దిగి వ‌చ్చింది. క‌రెంటు ఖాతా లోటు 2.5% కంటే త‌క్కువ‌కు, ద్ర‌వ్య లోటు 3.5% కంటే త‌క్కువ‌కు తీసుకొచ్చేందుకు కృషి చేశామ‌ని చెప్పారు.

9. సంస్క‌ర‌ణ‌లు

9. సంస్క‌ర‌ణ‌లు

ప్ర‌భుత్వం సంస్క‌ర‌ణ‌ల‌పై దృష్టి పెట్టింద‌ని మోదీ వివ‌ర‌ణ ఇచ్చారు. 21 రంగాల్లో 87 పెద్ద‌, చిన్న చిన్న సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకొచ్చామ‌ని అన్నారు. వీటికి సంబంధించి గ‌త కాంగ్రెస్ పాలన‌కు త‌మ ప్ర‌భుత్వంలో ప‌నితీరుకు బేరీజు వేసుకోవ‌చ్చ‌ని స‌ల‌హా ఇచ్చారు.

10. నవంబ‌రు 8 చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది

10. నవంబ‌రు 8 చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది

నవంబ‌రు 8వ తేదీ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని మోదీ చెప్పారు. త‌మ ప్ర‌భుత్వానికి నోట్ల ర‌ద్దు వంటి సాహసోపేత‌మైన నిర్ణ‌యం తీసుక‌నే ధైర్యం ఉంద‌న్నారు. ఆ రోజును అవినీతిపై యుద్ధం ప్ర‌క‌టించిన మొద‌టి రోజుగా అభివ‌ర్ణించారు. త‌మ‌పై విమ‌ర్శ‌ల‌ను కొట్టి పారేస్తూ కొంద‌రికి నిరాశావాదం రుద్దిన త‌ర్వాత‌నే రాత్రికి నిద్ర బాగా వ‌స్తుంద‌ని చుర‌క‌లంటించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+