ఈ టిక్కెట్లపై సేవా రుసుము 2018 మార్చి వరకూ లేదు
రైల్వే ఈ-టికెట్లపై సేవా రుసుము మినహాయింపును 2018 మార్చి చివరి వరకు పొడిగించింది. గత ఏడాది నవంబర్‌లో పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ-టికెట్లపై సేవా రుసుముకు కేంద
రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. రైల్వే ఈ-టికెట్లపై సేవా రుసుము మినహాయింపును 2018 మార్చి చివరి వరకు పొడిగించింది. గత ఏడాది నవంబర్‌లో పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ-టికెట్లపై సేవా రుసుముకు కేంద్రం తాత్కాలికంగా మినహాయింపునిచ్చింది. తాజాగా ఈ మినహాయింపును 2018 మార్చి 31వరకు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసే రైలు టికెట్లపై రూ.20 నుంచి రూ.40 వరకు గతంలో సేవా రుసుం వసూలు చేశారు.

రైలు ప్రయాణాలకు సంబంధించి టిక్కెట్లను బుకింగ్ వ్యవహారాలను చూసే అధీకృత సంస్థ ఐఆర్‌సీటీసీ. ప్రయాణికులు ఈ-టిక్కెట్లు బుక్ చేసుకునేలా ప్రోత్సహించే చర్యను బోర్డు సమర్థించింది. మాములుగా ఐఆర్‌సీటీసీకి వచ్చే ఆదాయం 33 శాతం సేవా రుసుముల నుంచే వస్తోందని సీనియర్ రైల్వే అధికారులు అన్నారు. గతేడాది ఐఆర్‌సీటీసీకి వచ్చిన మొత్తం ఆదాయంలో కేవలం సేవా రుసుము ద్వారానే రూ.540 కోట్లు రావడం గమనార్హం. ఈ ఛార్జీల రద్దు కారణంగా నవంబర్ 23,2016 నుంచి 28,ఫిబ్రవరి 2017 మధ్య బుక్ అయిన టిక్కెట్లపై సేవా పన్ను కట్టించకపోవడం వల్ల ఐఆర్‌సీటీసీకి రూ.184 కోట్ల మేర ఆదాయం తగ్గింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications