టెలికాం కంపెనీలు ఆర్‌కామ్-ఎయిర్‌సెల్ విలీనం కథ కంచికి చేరింది. విలీన ఒప్పందం కాలం చెల్లిన రెండు కంపెనీలు ప్రకటించాయి. ‘‘ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ మొబైల్ వ్యాపారం విలీన ప్రతిపాదన పరస్పర ఆమోదం పొందడంల
టెలికాం కంపెనీలు ఆర్‌కామ్-ఎయిర్‌సెల్ విలీనం కథ కంచికి చేరింది. విలీన ఒప్పందం కాలం చెల్లిన రెండు కంపెనీలు ప్రకటించాయి. ''ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ మొబైల్ వ్యాపారం విలీన ప్రతిపాదన పరస్పర ఆమోదం పొందడంలో విఫలం చెందింది'' అని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ప్రకటనలో తెలిపింది. విలీనం విషయమై గతేడాది సెప్టెంబర్‌లో ఈ రెండు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. న్యాయ, నియంత్రణపరమైన అనిశ్చిత పరిస్థితులు, స్వార్థపూరిత శక్తుల జోక్యంతో ఒప్పందానికి ఆమోదం పొందడంలో జాప్యానికి కారణమయ్యిందని ఆర్‌కామ్ ఆరోపించింది. టెలికం రంగంలో విపరీతమైన పోటీకితోడు విధానపరమైన నూతన చర్యలతో ఈ రంగానికి రుణాల లభ్యతపై తీవ్ర ప్రభావం పడినట్లు పేర్కొంది. ఇలా ఎన్నో అంశాల కారణంగా విలీన ఒప్పందం గడువు తీరిపోయినట్లు వివరించింది. వాస్తవానికి ఈ విలీనం ద్వారా రూ.45,000 కోట్ల రుణ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని ఆర్‌కామ్ భావించింది.

విలీనం సాకారం కాకపోవడంతో ఆదివారం సమావేశమైన ఆర్‌కామ్ బోర్డు రుణాలు తీర్చివేసేందుకు ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలించింది. ఆర్‌కామ్ అభ్యర్థన మేరకు రుణదాతలు ఈ ఏడాది డిసెంబర్ వరకు గడువిచ్చిన విషయం తెలిసిందే. కాగా, స్పెక్ట్రమ్ పోర్ట్‌ఫోలియోను వినియోగించుకోవడం, 4జీ టెక్నాలజీపై దృష్టి సారించడం ద్వారా ప్రత్యామ్నాయ ప్రణాళికను పరిశీలిస్తున్నట్టు ఆర్‌కామ్ తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications