For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభంతో ముగిసిన మార్కెట్లు

ద్ర‌వ్య పాల‌సీ నేప‌థ్యంలో ఆచితూచి ఇన్వెస్ట‌ర్లు స్పందిస్తుండ‌టంతో మొత్తం సూచీలు లాభాల్లో ప‌య‌నించిన‌ప్ప‌టికీ నిఫ్టీ బ్యాంకింగ్ రంగ షేర్లు న‌ష్టాల్లో సాగాయి

|

*200 కు పాయింట్ల‌కు పైగా లాభ‌ప‌డ్డ సెన్సెక్స్‌

సుదీర్ఘ వారంతం త‌ర్వాత మంగ‌ళ‌వారం మార్కెట్లు సానుకూలంగా సాగాయి. ద్ర‌వ్య పాల‌సీ నేప‌థ్యంలో ఆచితూచి ఇన్వెస్ట‌ర్లు స్పందిస్తుండ‌టంతో మొత్తం సూచీలు లాభాల్లో ప‌య‌నించిన‌ప్ప‌టికీ నిఫ్టీ బ్యాంకింగ్ రంగ షేర్లు న‌ష్టాల్లో సాగాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 213.66 పాయింట్లు లాభ‌ప‌డి 31,497.38 వ‌ద్ద ముగియ‌గా మ‌రో సూచీ నిప్టీ 70.90 పాయింట్లు ఎగ‌సి 9859.50 వ‌ద్ద స్థిర‌ప‌డింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(2.23%), చ‌మురు,స‌హ‌జ వాయువు(1.34%), లోహ రంగం(1.18%), ఎఫ్ఎంసీజీ(1.11%) లాభ‌ప‌డిన వాటిలో ఉండ‌గా, మ‌రో వైపు ప‌వ‌ర్(0.49%), క్యాపిట‌ల్ గూడ్స్‌(0.2%) న‌ష్ట‌పోయిన వాటిలో ఉన్నాయి.

 లాభాల్లో దేశీయ మార్కెట్లు

బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో టాటా మోటార్స్‌(3.78%), ఏసియ‌న్ పెయింట్స్(2.72%), రిల‌య‌న్స్(2.07%), బ‌జాజ్ ఆటో(1.79%), అదానీ పోర్ట్స్‌(1.7%) ముందుండగా మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో ప‌వ‌ర్ గ్రిడ్‌(2.16%), మారుతి(1.06%), భార‌తీ ఎయిర్‌టెల్(1.04%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(0.97%), సిప్లా(0.89%) ఉన్నాయి.

English summary

లాభంతో ముగిసిన మార్కెట్లు | market gains with positive sentiment across global markets

The benchmark BSE Sensex ended higher by over 200 points on Tuesday due to sustained by DIIs buying ahead of RBI monetary policy review.
Story first published: Tuesday, October 3, 2017, 16:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X