123 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి అంతర్జాతీయ కారణాలతో హెచ్చుతగ్గులకు లోనవుతూ వచ్చాయి. చివర్లో ట్రేడర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో దేశీయ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి.
* ఏడు రోజుల నష్టాలకు బ్రేక్...
వరుస లాభాల నుంచి మార్కెట్లు గురువారం లాభాల బాట పట్టాయి. దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఈ రోజు మార్కెట్లు కాస్తంత ఉత్సాహంగా కొనసాగాయి. అయితే ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి అంతర్జాతీయ కారణాలతో హెచ్చుతగ్గులకు లోనవుతూ వచ్చాయి. చివర్లో ట్రేడర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో దేశీయ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. రూపాయి సైతం ఇంట్రాడేలో 22 పైసలు బలపడటం ఇన్వెస్టర్లలో సానుకూలతకు దారితీసిందని బ్రోకర్లు అభిప్రాయపడ్డారు.

మార్కెట్లు ముగిసే సరికి సెన్సెక్స్ 123 పాయింట్లు లాభపడి 31,282 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 33 పాయింట్లు పుంజుకుని 9769 వద్ద స్థిరపడింది. రెండు సూచీలు గత వరుస ఏడు సెషన్లలో నష్టపోయిన సంగతి తెలిసిందే.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(0.91%), బ్యాంకింగ్(0.77%), హెల్త్ కేర్(0.69%), లోహ రంగం(0.68%) బాగా లాభపడిన వాటిలో ఉన్నాయి. మరో వైపు వినియోగదారు వస్తువులు(0.33%), క్యాపిటల్ గూడ్స్(0.32%), చమురు,సహజ వాయువు(0.13%), ఐటీ(0.1%) నష్టపోయాయి.
సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో కొటక్ బ్యాంక్(3.05%), డాక్టర్ రెడ్డీస్(2.62%), కోల్ ఇండియా(2.32%), మారుతి(2.11%), సిప్లా(2.05%) ముందుండగా, మరో వైపు నష్టపోయిన వాటిలో ఏసియన్ పెయింట్స్(2.73%), రిలయన్స్(1.48%), విప్రో(1.18%), భారతీ ఎయిర్‌టెల్(0.77%), టాటా మోటార్స్(0.69%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications