బీఎస్ఎన్ఎల్ దసరా,దీపావళి ఆఫర్లు
ప్రైవేటు ఆపరేటర్లు డేటా, కాల్ ప్లాన్‌లను కలిపి తక్కువ ధరలో ఉత్తమ ప్లాన్లను విడుదల చేస్తుండటంతో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ సైతం మధ్య తరగతిని ఆకట్టుకునే విధంగా ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం
వినియోగదారులకు దసరా, దీపావళి కానుకగా అపరిమిత ఆఫర్లతో సరికొత్త పథకాలను అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు తెలిపారు. వినియోగదారుల అవసరాలను గుర్తించి సరికొత్త ప్లాన్లను అందిస్తున్నామన్నారు. రూ.80 రీఛార్జ్‌తో ఫుల్ టాక్‌టైం, ఈ ఆఫర్ అక్టోబర్ పదో తేదీ వరకూ వర్తిస్తుందన్నారు. రూ.120 రీఛార్జ్‌తో రూ.130 ఫుల్ టాక్‌టైం, రూ.929 ప్లాన్‌తో అపరిమిత లోకల్, ఎస్‌టిడి కాల్స్‌ను ఏ నెట్‌వర్క్‌కైనా 90 రోజు లు గడువులోగా వినియోగించుకోచ్చని తెలిపారు. ఈ ప్లాన్‌లో ప్రతి రోజూ 1జీబీ 3జి డేటా ఇస్తున్నామని చెప్పారు.

90 రోజుల అపరిమితి కాల్స్,2జీబీ ప్లాన్
ప్లాన్ రూ.666లో అపరిమితమైన లోకల్, ఎస్ టిడి కాల్స్ ఏ నెట్‌వర్క్‌కైనా రోమింగ్ ఫ్రీతో 90 రోజుల గడువుతో వాడుకో వాలన్నారు. ప్రతి రోజూ 2 జిబి 3జి డేటా అందిస్తున్నామని తెలిపారు. రూ.19తో రీఛార్జి చేసుకుంటే 90 రోజుల పాటు నిమిషానికి బీఎస్ఎన్ఎల్‌కు 15 పైసలు, ఇతర నెట్‌వర్క్‌లకు 35 పైసలు చొప్పున కాల్ చేసుకోవచ్చని చెప్పారు. ఏడు రూపా యలతో రీఛార్జి చేసుకుంటే 30 రోజుల పాటు నిమిషానికి బీఎస్ఎన్ఎల్ మొబైల్‌కు 15 పైసలు, ఇతర నెట్‌వర్క్‌కు 35 పైసలు చొప్పున కాల్స్ చేసుకునే సౌకర్యం కలిగిం చామని తెలిపారు. నెలవారీ అద్దె రూ.49తో 12 నెలల పాటు ఇన్‌స్టలేషన్ ఛార్జీలు లేకుండా ల్యాండ్ లైన్ పొందే అవకాశం కల్పించామన్నారు. వీటితోపాటు మరెన్నో పరిమిత, అపరిమిత సేవలను బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రైవేటు ఆపరేట్లకు పోటీగా బీఎస్ఎన్ఎల్
ప్రైవేటు ఆపరేటర్లు డేటా, కాల్ ప్లాన్‌లను కలిపి తక్కువ ధరలో ఉత్తమ ప్లాన్లను విడుదల చేస్తుండటంతో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ సైతం మధ్య తరగతిని ఆకట్టుకునే విధంగా ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.429 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా 90 రోజుల పాటు ప్రతి రోజు 1జీబీ డేటా, 90 రోజుల అపరిమితి ఉచిత కాల్స్ పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications