For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రా బ్యాంకు వ‌డ్డీ రేట్లు స్వ‌ల్పంగా త‌గ్గింపు

ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించినట్లు బుధ‌వారం ప్రకటించింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ అధారిత రేట్ల (ఎంసిఎల్‌ఆర్‌)ను 15 బేసిస్‌ పాయింట్ల మేర కోత పెట్టినట్లు తెలి

|

ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించినట్లు బుధ‌వారం ప్రకటించింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ అధారిత రేట్ల (ఎంసిఎల్‌ఆర్‌)ను 15 బేసిస్‌ పాయింట్ల మేర కోత పెట్టినట్లు తెలిపింది. ఇక‌పై ఆంధ్రా బ్యాంకులో తీసుకునే రుణాల‌కు వ‌డ్డీ రేట్లు 9.55%గా అమ‌ల‌వుతాయి. పక్షం, నెల, మూడు నెలలు, ఆరు నెలలు ఏడాది కాలపరిమితి కలిగిన ఐదు కాలాలకు సంబంధించిన రుణాలపై వడ్డీ రేట్లలో మార్పులు చేసినట్లు పేర్కొంది. తగ్గించిన వడ్డీ రేట్లు అక్టోబ‌ర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయని పేర్కొంది.

 వ‌డ్డీ రేట్లను త‌గ్గించిన ఆంధ్రా బ్యాంకు

బేస్ రేట్ అంటే బ్యాంకులు ఏ వ‌డ్డీ రేటులో ప్ర‌జ‌ల‌కు రుణాలు అందిస్తాయో దానికి సంబంధించిన క‌నీస ప‌రిమితి. నిజానికి ఇప్పుడు ఆంధ్రా బ్యాంకు ప్రైమ్ లెండింగ్ రేటు 13.95%గా ఉంది. బేస్ రేటు 9.55%గా ఉంది. ఏప్రిల్ 4న మార్చిన బేస్ రేటు 9.70%గా ఉండింది. ఇప్పుడు దాన్ని స్వ‌ల్పంగా తగ్గించారు. ఆర్‌బీఐ మార్జిన‌ల్ కాస్ట్ బేస్‌డ్ లెండింగ్ రేట్ల‌ను 2016 ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి తెచ్చింది.

Read more about: andhra bank banking interest rate
English summary

ఆంధ్రా బ్యాంకు వ‌డ్డీ రేట్లు స్వ‌ల్పంగా త‌గ్గింపు | Andhra cuts interest rates by 0.15% to 9.55%

State-owned Andhra Bank on Wednesday said it has cut the base rate by 0.15 per cent to 9.55 per cent from October 1.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X