భారీగా ప‌త‌న‌మైన మార్కెట్లు

భార‌త్-మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఉద్రిక్త‌త‌ల మూలంగా ట్రేడింగ్ చివ‌రి గంట‌లో తీవ్రంగా అమ్మ‌కాలు కొన‌సాగాయి. దీంతో మార్కెట్లు భారీ న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి.

ఆసియా మార్కెట్ల‌లో మిశ్ర‌మ ధోర‌ణి, ట్రేడ‌ర్లు అమ్మ‌కాల‌ను కొన‌సాగించడంతో బుధ‌వారం దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌ను కొన‌సాగించాయి. భార‌త్-మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఉద్రిక్త‌త‌ల మూలంగా ట్రేడింగ్ చివ‌రి గంట‌లో తీవ్రంగా అమ్మ‌కాలు కొన‌సాగాయి. దీంతో మార్కెట్లు భారీ న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి. నాగాలాండ్‌లోని ఎన్ఎస్‌సీఎన్‌-ఖ‌ప్లాంగ్ ప్రాంతంలో టెర్ర‌రిస్ట్ స్థావ‌రాల‌పై ఇండియ‌న్ ఆర్మీ ఈ రోజు విరుచుకుప‌డింద‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. అన్ని ప్ర‌భావాల‌తో ట్రేడింగ్ ముగిసే స‌రికి 440 పాయింట్లు కోల్పోయి 31,160 వ‌ద్ద సెన్సెక్స్‌, 136 పాయింట్లు దిగ‌జారి 9736 వ‌ద్ద నిఫ్టీ స్థిర‌ప‌డ్డాయి. ఈ రోజు ప‌త‌నంతో కూడా క‌లుపుకుంటే గ‌త నాలుగు ట్రేడింగ్ సెష‌న్ల‌లో భార‌త ప్ర‌ధాన సూచీ సెన్సెక్స్ దాదాపు 1210 పాయింట్లు న‌ష్ట‌పోయింది. విదేశీ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్లు ఈ నెల‌లో ఇప్ప‌టికి దాదాపు రూ.7వేల కోట్లు వెన‌క్కు తీసుకోవ‌డం మ‌న మ‌ద‌రుప‌ర్ల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇన్వెస్ట‌ర్లు, డే ట్రేడ‌ర్లు జాగ్ర‌త్త వ‌హించాల‌ని మార్కెట్ విశ్లేష‌కులు సూచిస్తున్నారు.
రూపాయి బ‌ల‌హీన‌త సైతం మార్కెట్ల‌ను మ‌రింత డీలా పడేలా చేయ‌డంలో త‌న ప్రభావాన్ని చూపించింది. డాల‌రుతో రూపాయి ఆరున్న‌ర నెల‌ల గ‌రిష్టానికి ప‌డిపోయింది. అమ్మ‌కాల ఒత్తిడి దాదాపు అన్ని రంగాల్లో క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల సూచీ, ఫార్మా రంగాల షేర్లు ఎక్కువ‌గా న‌ష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు 3.06% వ‌ర‌కూ దిగ‌జారాయి.

 భారీ న‌ష్టాల దిశ‌గా మన‌ మార్కెట్లు

బీఎస్ఈలో అన్ని రంగాలు న‌ష్ట‌పోయాయి. అందులో స్థిరాస్తి(2.66%), హెల్త్ కేర్‌(2.55%), క్యాపిట‌ల్ గూడ్స్‌(2.16%), ప‌వ‌ర్‌(2.15%0 ఎక్కువ‌గా న‌ష్టాల‌కు గురైన వాటిలో ముందున్నాయి.
సెన్సెక్స్ సూచీలో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయిన వాటిలో అదానీ పోర్ట్స్‌(4.85%), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(2.89%), రిల‌య‌న్స్‌(2.51%), డాక్ట‌ర్ రెడ్డీస్‌(2.5%), స‌న్ ఫార్మా(2.46%) ముందుండ‌గా లాభప‌డిన వాటిలో లార్జ్ క్యాప్ షేర్ల‌లో టీసీఎస్‌(0.62%), కోల్ ఇండియా(0.25%) మాత్ర‌మే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+