స్తబ్దుగా ముగిసిన మార్కెట్లు
దేశీయ మార్కెట్లు ఈ రోజు పెద్దగా లాభాల్లేకుండా ముగిశాయి. సెన్సెక్స్ 27 పాయింట్లు కోల్పోయి 31,599.76 పాయింట్ల వద్ద ముగియగా మరో వైపు నిఫ్టీ 1 పాయింట్(0.01%) దిగజారి 9871 వద్ద స్థిరపడింది. దీంతో
దేశీయ మార్కెట్లు ఈ రోజు పెద్దగా లాభాల్లేకుండా ముగిశాయి. సెన్సెక్స్ 27 పాయింట్లు కోల్పోయి 31,599.76 పాయింట్ల వద్ద ముగియగా మరో వైపు నిఫ్టీ 1 పాయింట్(0.01%) దిగజారి 9871 వద్ద స్థిరపడింది. దీంతో వరుసగా ఆరో సెషన్ మార్కెట్లు నష్టాలతో ముగిసినట్లయింది. విదేశీ ఫండ్ సంస్థలు మన దేశ స్టాక్‌లను అమ్ముతుండటంతో పాటు బలహీన ఆసియా మార్కెట్లు మన సూచీ నష్టాలకు కారణమయ్యాయి.

ఎన్‌ఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ 0.4% బలహీనపడగా... స్థిరాస్తి, లోహ రంగాలు 2.5% లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో వేదాంత, ఓఎన్‌జీసీ, ఐబీ హౌసింగ్, టాటా స్టీల్, యాక్సిస్, హిందాల్కో, లుపిన్, బోష్, ఐసీఐసీఐ, కోల్ ఇండియా 3.5-1% మధ్య పైకి ఎగశాయి. అయితే బీపీసీఎల్, ఇన్‌ఫ్రాటెల్, టాటా పవర్, హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, మారుతి 4-1% మధ్య దిగజారాయి.
బీఎస్ఈ సూచీలో లాభపడిన వాటిలోఓఎన్‌జీసీ(4.32%), టాటా స్టీల్(2.19%), యాక్సిస్ బ్యాంక్(1.82%), లుపిన్(1.40%), హీరో మోటోకార్ప్(1.39%) ముందుండగా నష్టపోయిన వాటిలో సెంట్రల్ బ్యాంక్(6.40%), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ లిమిటెడ్(3.91%), భారతీ ఇన్‌ఫ్రాటెల్(3.82%), బీపీసీఎల్(3.67%), బాటా ఇండియా(2.71%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications