కనీస నిల్వల నిబంధనల పేరిట బ్యాంకులు ఎడాపెడా జరిమానాలు బాదేస్తున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు ఊరటనిచ్చింది.
కనీస నిల్వల నిబంధనల పేరిట బ్యాంకులు ఎడాపెడా జరిమానాలు బాదేస్తున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు ఊరటనిచ్చింది. కనీస నెలవారీ బ్యాలెన్స్ (ఎంఏబీ) నిబంధనలను సడలించింది. సేవింగ్స్ ఖాతాలపై ఇప్పటిదాకా రూ. 5,000గా ఉన్న ఎంఏబీని రూ. 3,000కు తగ్గించింది. అలాగే బ్యాలెన్స్ నిబంధనలు పాటించకపోతే విధించే జరిమానాల పరిమాణాన్ని కూడా సవరించింది. కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం .. పెన్షనర్లు, మైనర్లతో పాటు ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మినిమం బ్యాలెన్స్ నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తుంది. "మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాలను ఒకే కేటగిరీ కింద లెక్కించాలని నిర్ణయించడం జరిగింది. దీనికి తగ్గట్లు మెట్రో నగరాల్లో వార్షిక కనీస నిల్వ రూ. 3,000కు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం" అని ఎస్‌బీఐ పేర్కొంది.

50 శాతం దాకా జరిమానా తగ్గుదల..
మరోవైపు, కనీస నిల్వ నిబంధనలు పాటించకపోతే విధించే జరిమానాలను కూడా తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. దీన్ని 20-50 శాతం మేర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఇకపై సెమీ ఆర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో చార్జీలు రూ. 20-40 మధ్య, పట్టణ.. మెట్రో నగరాల్లో రూ. 30-50 మధ్య ఉంటాయని తెలిపింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, ప్రధాన మంత్రి జన ధన ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనలు వర్తించవు. ఎస్‌బీఐలో మొత్తం 42 కోట్ల పొదుపు ఖాతాలు ఉండగా, ఈ కోవకి చెందిన ఖాతాలు 13 కోట్లు ఉన్నాయి. "పెన్షనర్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు, మైనర్ల ఖాతాలకు మినహాయింపు ఉంటుంది. తాజా సవరణలతో అదనంగా 5 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుతుంది" అని బ్యాంకు పేర్కొంది.

కనీస నిల్వ పేరిట మొదట విధించిన నిబంధనలు
దాదాపు అయిదేళ్ల విరామం తర్వాత ఎస్‌బీఐ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మళ్లీ కనీస నెలవారీ బ్యాలెన్స్, తత్సంబంధిత చార్జీలను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మెట్రోపాలిటన్ నగరాల్లో ఎంఏబీ రూ. 5,000గాను, పట్టణాల్లో రూ. 3,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 2,000, గ్రామీణ శాఖల్లో రూ. 1,000 కనీస బ్యాలెన్స్‌గా నిర్ణయించింది. ఒకవేళ కనీస నెలవారీ బ్యాలెన్స్ నిర్దేశిత రూ. 5,000 కన్నా 75 శాతం తగ్గితే మెట్రో నగరాల్లో రూ. 100 (జీఎస్‌టీ అదనం) చార్జీలు విధిస్తోంది. అదే 50 శాతం లేదా అంతకన్నా తక్కువగా ఉంటే.. పెనాల్టీ రూ. 50 (జీఎస్‌టీ అదనం) విధిస్తోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో జరిమానాలు రూ. 20-50 మధ్యలో (జీఎస్‌టీ అదనం) ఉంటున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications