వచ్చే ఏడాదికి ఆర్థిక సంవత్సరంలో మార్పు లేదు
వచ్చే ఏడాదికి ఫిబ్రవరిలో బడ్జెట్ యథావిథిగా ప్రవేశపెట్టొచ్చని, ఈసారికి తొందరపడి బడ్జెట్ సమర్పించే సమయాన్ని, ఆర్థిక సంవత్సరాన్ని మార్చబోమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి
వచ్చే ఏడాదికి ఫిబ్రవరిలో బడ్జెట్ యథావిథిగా ప్రవేశపెట్టొచ్చని, ఈసారికి తొందరపడి బడ్జెట్ సమర్పించే సమయాన్ని, ఆర్థిక సంవత్సరాన్ని మార్చబోమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్-మార్చి కాకుండా జనవరి-డిసెంబరు మాసాలకు ఆర్థిక సంవత్సరానికి మార్చకుండా ఉండేందుకు ప్రభుత్వం వద్ద చాలా కారణాలు ఉన్నాయి. జీఎస్టీ అమలు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ రెవెన్యూ వసూళ్లకు సంబంధించి కొన్ని అంచనాలు రావాల్సి ఉంది. అందుకే ప్రస్తుతానికి ఆర్థిక సంవత్సరం మార్పును వాయిదా వేస్తున్నామని ఒక అధికారి చెప్పారు. అంతే కాకుండా జీఎస్టీ అమలు తర్వాత వ్యవస్థ గాడిలో పడి, ప్రభుత్వానికి పన్ను లెక్కల మీద ఒక రకమైన స్పష్టత వచ్చే దాని కోసం సైతం అధికార పార్టీ ఎదురుచూస్తున్నది.

ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మీద జీఎస్టీ, పెద్ద నోట్ల మార్పడి వంటి పెద్ద సంస్కరణల ప్రభావాలు ఉన్నాయి. పన్నుల వసూళ్లతో పాటు, ఆర్థిక సంవత్సరం విషయంలో ఇన్నాళ్లు దేశం ఏప్రిల్-మార్చి క్యాలెండర్‌ను అనుసరిస్తూ వస్తోంది. "ఈ ఏడాదికి ఆర్థిక సంవత్సర మార్పు ఉండదు. దీన్ని ఇంకా పరిశీలిస్తున్నాం. ఏం చేయాలనేది చూస్తాం." అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
వచ్చే ఏడాది సైతం బడ్జెట్ను ముందుగా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టి దాని తదనంతర పరిణామాలను పరిశీలించి ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చని అన్నారు. ఈ సంవత్సరమే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి చివరి వారం నుంచి మొదటి వారానికి మార్చిన సంగతి తెలిసిందే. శంకర్ ఆచార్య నేతృత్వంలో బడ్జెట్ నెలల(ఏప్రిల్ 1 నుంచి) మార్పుకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications