For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ‌రుస‌గా ఐదో సెష‌న్ మార్కెట్ల‌కు న‌ష్టాలే

రెండు సూచీలు 1% పైగా న‌ష్ట‌పోవ‌డంతో ఈ రోజు(సోమ‌వారం) దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. సెప్టెంబ‌రు డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియ‌నుండ‌టం, ఆసియా మార్కెట్ల బ‌ల‌హీన సంకేతాలు, మార్కెట్ దిగ్గ‌జాల్లో

|

*9900కు దిగువ‌న నిఫ్టీ
రెండు సూచీలు 1% పైగా న‌ష్ట‌పోవ‌డంతో ఈ రోజు(సోమ‌వారం) దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. సెప్టెంబ‌రు డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియ‌నుండ‌టం, ఆసియా మార్కెట్ల బ‌ల‌హీన సంకేతాలు, మార్కెట్ దిగ్గ‌జాల్లో ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్‌సీ మార్కెట్ల‌ను దిగ‌జార్చేందుకు కార‌ణాలుగా నిలిచాయి. ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి మ‌న దేశీయ మార్కెట్లు నెల రోజుల కనిష్టం వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 296 పాయింట్లు దిగ‌జారి 31,627 వద్ద నిలవగా.. నిఫ్టీ 92 పాయింట్లు కోల్పోయి 9,873 వద్ద స్థిరపడింది.

 న‌ష్టాల పాల‌యిన మార్కెట్లు

ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ నష్టపోగా.. రియల్టీ అత్యధికంగా 3.2 శాతం పతనమైంది. ఫార్మా, మెటల్, ఆటో, బ్యాంకింగ్ 2-1 శాతం మధ్య తిరోగమించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఏసీసీ, అరబిందో, అదానీ పోర్ట్స్, అంబుజా, అల్ట్రాటెక్, ఐటీసీ, బాష్, ఐవోసీ, కొటక్ బ్యాంక్, ఐషర్ 3.6-2 శాతం మధ్య క్షీణించాయి. అయితే టాటా పవర్, కోల్ ఇండియా, జీ, ఐసీఐసీఐ, హెచ్ యూఎల్, బీవోబీ, ఆర్ఐఎల్ 2-0.4 శాతం మధ్య బలపడ్డాయి. బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలు న‌ష్టాల పాల‌వ్వ‌గా స్థిరాస్తి రంగం అన్నింటి కంటే ఎక్కువ‌గా 3.46% న‌ష్ట‌పోయింది.
సెన్సెక్స్ సూచీలో న‌ష్ట‌పోయిన వాటిలో అదానీ పోర్ట్స్‌(3.29%), కొట‌క్ బ్యాంక్‌(2.24%), లుపిన్‌(2.2%), టాటా స్టీల్‌(2.2%), ఐటీసీ(2.18%) ముందుండ‌గా, మ‌రో వైపు లాభ‌ప‌డిన వాటిలో కోల్ ఇండియా(1.2%), ఐసీఐసీఐ బ్యాంక్(0.87%), హెచ్‌యూఎల్‌(0.55%), రిల‌య‌న్స్(0.36%), టీసీఎస్‌(0.23%) టాప్‌-5 స్థానాల్లో ఉన్నాయి.

English summary

వ‌రుస‌గా ఐదో సెష‌న్ మార్కెట్ల‌కు న‌ష్టాలే | Sensex plummets 296 points

The Sensex and Nifty ended the session down by nearly 1 per cent owing to sustained foreign fund outflows and persistent concerns over US-North Korea tug-of-war. Profit-booking at higher levels also dampened the domestic sentiment.
Story first published: Monday, September 25, 2017, 16:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X