ఈ సేల్ సందర్భంగా లక్షల కొద్దీ ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించారు. గతేడాది 2 రోజులు సేల్ ఉండగా ఈసారి అది రెట్టింపయింది. అమెజాన్ సేల్ సందర్భంగా కొన్ని ఆఫర్లను చూద్దాం.
పండుగల సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌ను ప్రారంభించింది. సెప్టెంబరు 21 అర్ధరాత్రి ప్రారంభమైన ఈ సేల్ సెప్టెంబరు 24న ముగుస్తుంది. ఈ సేల్ సందర్భంగా లక్షల కొద్దీ ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించారు. గతేడాది 2 రోజులు సేల్ ఉండగా ఈసారి అది రెట్టింపయింది. అమెజాన్ సేల్ సందర్భంగా కొన్ని ఆఫర్లను చూద్దాం.

పండుగ సందర్భంగా 40% ఆఫర్
అమెజాన్ నోకియా, రెడ్‌మీ, టీవీ బ్రాండ్లు సోనీ, శ్యామ్‌సంగ్, పానాసోనిక్, టీసీఎల్, బీపీఎల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 40% ఆఫర్‌ను ప్రకటించింది. లెనోవో కె8 నోట్(32జీబీ), నూబియా ఎం2 లైట్, కూల్‌ప్యాడ్ కూల్1(3జీబీ), పానాసోనిక్, ఎలూగా పల్స్ ఎక్స్, నూబియా ఎన్1 లైట్, మైక్రోమ్యాక్స్ స్పార్క్ వీడియో ఫోన్లపై భారీ రాయితీలను ప్రకటించింది. కొన్ని ఉత్తమ ఫోన్లపై రాయితీలను ఇక్కడ తెలుసుకుందాం.

వన్ ప్లస్5, వన్ ప్లస్ 3టీ
వన్‌ప్లస్ 5 అదనంగా రూ.3000 ఎక్స్చేంజీ ఆఫర్‌తో లభిస్తోంది. 64 జీబీ ఫోన్ రూ.32,999 ధర వద్ద లభిస్తున్నది. అమ్మకం జరిగే కాలంలో నో కాస్ట్ ఈఎంఐ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉంది. నెలకు రూ.2759 ఈఎంఐ చెల్లించాలి.
వన్‌ప్లస్ 3టీ 64జీబీ మోడల్ ఫోన్ రూ.24,999 నుంచి ప్రారంభమవుతోంది. దీనికి ఈఎంఐ రూ.2084 నుంచి మొదలవుతోంది.

మోటో జీ5ఎస్ ప్లస్, మోటో జీ5 ప్లస్
బాగా క్రేజ్ ఉన్న మోటోరాలా ఫోన్ల మీద రాయితీలు ఉన్నాయి.
మోటో జీ5ఎస్ ప్లస్ రూ.15,999 ధరకు లభిస్తోంది. ఎక్స్చేంజీ ద్వారా మరో రూ.1 వేయి ఆఫర్.
నో కాస్ట్ ఈఎంఐ కింద నెలకు రూ.1778 ధరతో నెలవారీ వాయిదాలు కట్టాల్సి ఉంటుంది.
మోటో జీ5 ప్లస్ 12,999 రూపాయలకు లభిస్తోంది. అదనంగా రూ.500 ఆఫర్ ఉంటుంది.

లెనోవో కే8 నోట్
ఈ ఫోన్ దాదాపు ఎంఆర్‌పీ నుంచి పెద్ద తేడా లేకుండా వెబ్‌సైట్లో పెట్టారు. రూ.12,999 పెట్టి ఈ ఫోన్ కొనాలి. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రస్తుతానికి ఎటువంటి ఆఫర్లు ప్రకటించలేదు. అయితే సైట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న జాబితాలోని వాటిని చూస్తే కే8 నోట్‌పై డీల్ వచ్చే అవకాశం ఉంది. అయితే అమెజాన్ వెబ్‌సైట్లో లాగిన్ అయితే రెగ్యులర్ యూజర్లకు ఆఫర్లు కనిపిస్తాయి.

హానర్ 8 ప్రో, హానర్ 6ఎక్స్
డ్యూయల్ కెమెరా, 128 జీబీ హానర్ 8ప్రో ఫోన్ 29,999 ధర వద్ద అందుబాటులో ఉంది. ఎక్స్చేంజీ ఆఫర్లో భాగంగా రూ.3000 తగ్గింపు లభిస్తుంది.
హానర్ 6ఎక్స్ 12,999 ధర వద్ద అందుబాటులో ఉండటంతో పాటు, కొన్ని ఫోన్ల ఎక్స్చేంజీ ద్వారా అదనంగా రూ.500 ఆఫర్ ఉంటుంది.

నోకియా6
ఎన్నో రోజుల తర్వాత మళ్లీ స్మార్టఫోన్లను మార్కట్లో లాంచ్ చేస్తున్న నోకియా నోకియా6ను 14,999 ధరకు అందిస్తోంది.

జియోమి ఎమ్ఐ మ్యాక్స్2, రెడ్‌మి 4
ఎమ్ఐ మ్యాక్స్2 ధర రూ.14,999 నుంచి 2000 తగ్గింపుతో 12,999 రూపాయలకే
నో కాస్ట్ ఈఎంఐ కింద రూ.1445 నుంచి చెల్లిస్తే చాలు ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
రెడ్‌మి4 రూ.10,999 నుంచి రూ.1000 తగ్గింపుతో రూ.9999కే కొనుక్కోవచ్చు.
నో కాస్ట్ ఈఎంఐ కింద నెలవారీ ఈఎంఐ రూ.1111 చెల్లించాలి.

ఎల్‌జీ క్యూ6
18:9 సైజ్ ఫుల్ విజన్ డిస్‌ప్లే కలిగిన ఎల్జీ క్యూ6 ధర రూ.14,990 వద్ద ఉంది.
సేల్‌లో భాగంగా 2000 తగ్గింపుతో రూ12,990 కే రావచ్చు.
ఇతర ఫోన్లను ఎక్స్చేంజీ చేసుకోవడం ద్వారా అదనంగా రూ.2500 ఆఫర్.
నో కాస్ట్ ఈఎంఐ కింద నెలవారీ ఈఎంఐ రూ.1083 చెల్లించాలి.

ఇంకా కొన్ని ఆఫర్లు
అమెజాన్ ఇంకా మరికొన్ని ఫోన్లపై ఆఫర్లను ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో శ్యామ్‌సంగ్ ఏ9 ప్రో(గోల్డ్), ఎమ్ఐ మ్యాక్స్2(64జీబీ), ఆసుస్ జెన్‌ఫోన్ 3, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్4 డ్యూయల్, గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్, ఇంటెక్స్ ఆక్వా గోల్డ్ ఉన్నాయి.

ఇతర ఆఫర్లు
అమెజాన్ ఎలక్ట్రానిక్ సేల్ ద్వారా పలు ఉత్పత్తుల్లో 50% ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు రూ.5000 అమెజాన్ పే బ్యాలెన్స్ కలిగి ఉంటే అదనంగా 10% రాయితీని హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులపై పొందవచ్చు. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజీ ఆఫర్లు సైతం వర్తిస్తాయి. రూ.3000 పై బడి కొనుగోళ్లు చేసిన వారు రూ.250 నెలవారీ చెల్లింపులతో వస్తువులు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్.ఇన్ యాప్ ద్వారా 10 లక్కీ విజేతలు 1లక్షా 50 వేల రూపాయల విలువైన ఉచిత ప్రయాణాలను యాత్రా నుంచి పొందవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications