చైనా క్రెడిట్ రేటింగ్ తగ్గించిన ఎస్ అండ్ పీ
నా దీర్ఘకాల రేటింగ్‌ను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గురువారం రోజున AA- నుంచి A+ కు తగ్గించింది. దేశానికి ఎక్కువగా పెరుగుతున్న ఆప్పులను దీనికి కారణంగా చూపింది.
చైనా దీర్ఘకాల రేటింగ్‌ను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గురువారం రోజున AA- నుంచి A+ కు తగ్గించింది. దేశానికి ఎక్కువగా పెరుగుతున్న ఆప్పులను దీనికి కారణంగా చూపింది. కొంత ఎక్కువ కాలం పాటు దేశానికి చెందిన అప్పు పెరగడం బట్టి దేశ ఆర్థిక స్థితికి ఎదురవుతున్న ఇబ్బందులను మేము గుర్తించామని ఎస్ అండ్ పీ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తానికి రేటింగ్‌ను స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది.

అధికారికంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు చైనా ప్రభుత్వం అప్పులను తీసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం, పలు విధాన నిర్ణయాల కారణంగా ఆర్థిక పరిస్థితి దిగజారడం విశ్లేషణలో చోటుచేసుకుంది. మే నెలలో మూడీస్ చైనా దేశ రేటింగ్‌ను తగ్గించిన తరహాలోనే ఎస్ అండ్ పీ సైతం అదే తరహా నిర్ణయాన్ని ఇప్పుడు ప్రకటించింది. అయితే చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వ మార్పునకు నిర్ణయం తీసుకునే ముందు ఎస్ అండ్ పీ నుంచి ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. చైనా వృద్ది మొదటి అర్ధభాగంలో అంచనాలను మించినప్పటికీ, ఆ దేశ రుణ వృద్ది ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల చైనా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మధ్య కాలంలో కార్పొరేట్ అప్పులను తగ్గించేందుకు దోహదం చేస్తాయని ఎస్ అండ్ పీ పేర్కొంది. అయితే వచ్చే రెండు నుంచి మూడేళ్లలో చైనా అప్పుల స్థాయి అక్కడే ఉంటుందని, దీంతో నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థ రిస్క్ పెరుగుతుందని ఎస్ అండ్ పీ అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications