ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ వచ్చిన సమయంలోనే వాటికి పోటీగా పేటీఎమ్ సైతం ఉత్పత్తుల ఆన్‌లైన్ అమ్మకాలను చేపడుతోంది. సెప్టెంబరు 23 వరకూ ఈ సేల్ కొనసాగుతుంద
పేటీఎమ్ మేరా క్యాష్ బ్యాక్ సేల్ పేరిట ఈ-కామర్స్ ఉత్పత్తుల అమ్మకాలను మొదటిసారిగా చేపడుతోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ వచ్చిన సమయంలోనే వాటికి పోటీగా పేటీఎమ్ సైతం ఉత్పత్తుల ఆన్‌లైన్ అమ్మకాలను చేపడుతోంది. సెప్టెంబరు 23 వరకూ ఈ సేల్ కొనసాగుతుంది. స్మార్ట్ ఫోన్లపై రూ.15 వేల వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్లను మేరా క్యాష్ బ్యాక్ సేల్‌లో భాగంగా ఇస్తున్నారు. ముఖ్యంగా యాపిల్, శ్యామ్‌సంగ్, గూగుల్, జియోని, వివో, మోటారోలా కంపెనీలకు సంబంధించి ఆకట్టుకునే రాయితీలను అందిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1. యాపిల్ ఐఫోన్ 7 ప్లస్
ఐఫోన్ X మార్కెట్లోకి రావడంతో పాత ఫోన్లు అప్పుడే తక్కువ ధరలకు వస్తున్నాయి. ఐఫోన్ పాత మోడళ్లయిన ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 6 వార్షిక స్పెషల్ ఆఫర్లో భాగంగా రూ.10 వేలకు పైగా తగ్గింపుతో అందుబాటులో ఉంచుతున్నారు. పేటీఎమ్ మాల్ ఐఫోన్ 7 ప్లస్(256జీబీ) రూ.76,900 ధరకు అందిస్తున్నారు. అయితే అదే సమయంలో ఫ్లిప్‌కార్ట్ ఇదే ఫోన్‌ను రూ.75,999 ధరకు అందుబాటులో ఉంచింది. అంతే కాకుండా ఫ్లిప్‌కార్ట్లో రూ.15,300 ఎక్స్చేంజీ ఆఫర్ సైతం ఉంది. ఇంకా పేటీఎమ్ మాల్ ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) జెట్ బ్లాక్ రూ.65 వేలకు ఆఫర్ ప్రకటించింది.

2. ఐఫోన్ 7
పేటీఎమ్ మాల్ ఐఫోన్ 7(256జీబీ) ఫోన్‌ను రూ.58,399 ధరకు అందిస్తోంది. ఇతర ఈ-కామర్స్ వెబ్‌సైట్లతో పోల్చి చూస్తే ఇదే బెస్ట్ డీల్. ఫ్లిప్‌కార్ట్ ఇదే ఫోన్‌కు రూ.62,999 ధర ఉంచింది, ఇంకా రూ.15,300 ఎక్స్చేంజీ ఆఫర్ ద్వారా అదనంగా పొందవచ్చు. మరో వైపు అమెజాన్ జెట్ బ్లాక్ ఐఫోన్(256జీబీ)ని రూ.61వేలకు అమ్ముతున్నది.
ఇంకా పేటీఎమ్ మాల్ ఐఫోన్7(32జీబీ) ఫోన్‌ను రూ.48,595గా నిర్ణయించింది. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్ ధర కంటే కాస్త ఎక్కువ.

3. ఐఫోన్6
యాపిల్ ఐఫోన్6-32జీబీ ఫోన్‌ను పేటీఎమ్ రూ.27,335 ధరకు అమ్ముతున్నది. మరో వైపు ఐఫోన్6 గోల్డ్ వేరియంట్ ఫోన్‌ను రూ.27,480కు అందుబాటులో ఉంది.
పేటీఎమ్ మాల్ ఆఫర్లతో పోలిస్తే ఫ్లిప్‌కార్ట్ ఇదే ఫోన్(గ్రే, గోల్డ్ వేరియంట్లు)ధర రూ.25,999.
అమెజాన్ ఐఫోన్6-32జీబీ ఫోన్ ధరను రూ.25,330(గ్రే), రూ.25,999(గోల్డ్) ధరలను నిర్ణయించింది.

4. గూగుల్ పిక్సెల్
గూగుల్ పిక్సెల్ 32 జీబీ(వెరీ సిల్వర్) ఫోన్‌ను పేటీఎమ్ రూ.41,788 ధర వద్ద అమ్ముతోంది. ప్రస్తుతం భారతదేశంలో పిక్సెల్ ఫోన్ తక్కువ ధరకు అందిస్తున్న వెబ్సైట్ ఇదే. కాబట్టి గూగుల్ పిక్సెల్ 32 జీబీ(వెరీ సిల్వర్) మోడల్ పేటీఎమ్ మాల్‌లో సెప్టెంబరు 23లోపు దక్కించుకోండి.
ఇతర ఈ-కామర్స్ వెబ్‌సైట్ అయిన అమెజాన్ గూగుల్ పిక్సెల్ ఫోన్‌ను రూ.50,300 ధరకు, ఫ్లిప్‌కార్ట్ ఫోన్ రూ.44,000గా నిర్ణయించింది. మూడు వెబ్‌సైట్లతో పోల్చి చూస్తే గూగుల్ పిక్సెల్ ఫోన్‌ను పేటీఎమ్ మాల్‌లో కొనడమే మంచిది. ఫ్లిప్‌కార్ట్ మాత్రం పాత ఫోన్‌ను మార్చుకుంటే అదనంగా రూ.20 వేల ఆఫర్ ఇస్తోంది.

5. యాపిల్ మాక్‌బుక్ ఎయిర్ 13.3 అంగుళాలు
2017 యాపిల్ మాక్‌బుక్ ఎయిర్ రూ.45,699 ధరకు పేటీఎమ్లో అందుబాటులో ఉంది. మాక్ బుక్ ఉత్తమ ధరకు కొనాలంటే ఇదే ఉత్తమ స్థానం. మాక్‌బుక్ ఎయిర్ ఫీచర్లు చూస్తే ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్‌తో వస్తోంది. ఇంకా 128జీబీ(డ్రైవ్), మ్యాక్ ఓఎస్ ఉంది.
LAPTOP12000 కూపన్ కోడ్ ద్వారా రూ.12వేల పేటీఎమ్ వాలెట్ చెల్లింపు చేయడం వల్ల కొనుక్కోవచ్చు.

6. యాపిల్ వాచ్ సిరీస్ 1-42 ఎమ్ఎమ్ స్పేస్ గ్రే
దాదాపు అన్ని యాపిల్ వాచ్‌లపై కనీసం రూ.7వేల క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పేటీఎమ్ మాల్ ఇస్తోంది. 1-42 ఎమ్ఎమ్ స్మార్ట్ వాచ్‌ను కనీస దర రూ.17,900కే దక్కించుకోవచ్చు.
ఈ వాచ్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఇంకా తక్కువ ధరకే రావొచ్చు.
యాపిల్ వాచ్ సిరీస్ 2-38 ఎమ్ఎమ్ రూ.32,900 నుంచే లభిస్తోంది. (7వేల క్యాష్‌బ్యాక్)

7. సోనీ 43-ఇంచులు ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ 3డీ లెడ్ టీవీ
సోనీ 43 ఇంచెస్ స్మార్ట్ 3డీ లెడ్ టీవీ పేటీఎమ్ మాల్ సేల్‌లో భాగంగా రూ.46,712 ధరకు లభిస్తోంది. ఈ టీవీ హెచ్‌డీఎమ్ఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులతో వస్తోంది. సోనీ నుంచి ఒక ఏడాది కాలం పాటు మ్యాన్యుఫాక్చర్ వారెంటీతో వస్తోంది.

8. ఎల్‌జీ 43 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ లెడ్ టీవీ
43ఇంచెస్ ఎల్‌జీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర తక్కువలో రూ.35,592కు అందిస్తున్నారు. పేటీఎమ్ ద్వారా కొనేందుకు BIGBONANZA20 కోడ్ వాడుకోవాలి. తద్వారా రూ.8898 క్యాష్ బ్యాక్ అందుకుంటారు.
ఈ టీవీ 1920x1080 పిక్సెల్ రెజల్యూషన్ కలిగి ఉంటుంది. బిల్ట్ ఇన్ యాప్‌లు నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ఇంతర ఫీచర్లతో ఈ ఎల్ఈడీ టీవీ సిద్దంగా ఉంది. వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం. సొంతం చేసుకోండి.

పేటీఎమ్ మాల్-క్యాష్‌బ్యాక్ ద్వారా అందుబాటులో ఉన్న ఫోన్లు
మోటో సీ-16 జీబీ ధర రూ.5894 ఆఫర్లో లభిస్తున్నది. నిజానికి ఈ ఫోన్ ప్రైస్ రూ.6799.
వివో V5s(16జీబీ) బ్లాక్ కలర్ రూ.16,600, క్రౌన్ గోల్డ్ రూ.16,686 ధరకు లభిస్తోంది.
మోటో ఈ4(16జీబీ) గోల్డ్ కలర్ రూ.8590 ధరకే లభిస్తోంది.
లెనోవో కే6 పవర్-32జీబీ పేటీఎమ్ మాల్ ధర రూ.9909.
వివో V5 - 32GB క్రౌన్ గోల్డ్ రూ.15,380
లెనోవో జెడ్2 ప్లస్-64GB ఫోన్ ధర రూ.13,599.

501 మిలియన్ డాలర్ల అమ్మకాలు
పేటీఎమ్ మాల్ మొదటిసారి పెద్ద ఈ-కామర్స్ సంస్థలతో పోటీపడి 500 మిలియన్ డాలర్ల అమ్మకాలను చేపట్టాలనుకుంటోంది. అలీబాబా పెట్టుబడిదారుగా ఉన్న ఈ సంస్థ పేటీఎమ్ మాల్ పేరిట రూ.701 కోట్ల ఉచిత ఆఫర్లను, క్యాష్ బ్యాక్‌లను అందించేందుకు సిద్దమైంది. 24 గంటల్లో టాప్20 నగరాల్లో 80% ఉత్పత్తులపై ఆర్డర్లను సంపాదించినట్లు పేటీఎమ్ చెపుతోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications