హెచ్‌టీసీ కార్పొరేష‌న్ యూనిట్ కొనుగోలుకు గూగుల్

పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ త‌యారీదారు తైవాన్‌కు చెందిన హెచ్‌టీసీ కార్పొరేష‌న్‌ను ద‌క్కించుకునేందుకు గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్ 1.1 బిలియ‌న్ డాల‌ర్లు వెచ్చించ‌నున్న‌ట్లు స‌మాచారం.

పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ త‌యారీదారు తైవాన్‌కు చెందిన హెచ్‌టీసీ కార్పొరేష‌న్‌ను ద‌క్కించుకునేందుకు గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్ 1.1 బిలియ‌న్ డాల‌ర్లు వెచ్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. దీని ద్వారా గూగుల్ హార్డ్‌వేర్ త‌యారీలోకి ప్ర‌వేశించేందుకు అవ‌కాశం క‌లుగుతుంది. గ‌తేడాది నుంచి త‌మ హార్డ్‌వేర్ సామర్థ్యాన్ని పెంచేందుకు, ఉత్ప‌త్తుల త‌యారీకి గూగుల్ ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందుకోసం గూగుల్ హార్డ్‌వేర్ విభాగాన్ని న‌డిపించేందుకు మోటారోలా మాజీ ఉద్యోగి రిక్ ఒస్టెర్లోహ్‌ను త‌మ కంపెనీలోకి తీసుకున్నారు. స్మార్ట‌ఫోన్ల త‌యారీలో త‌మ‌కు ఉన్న ఆస‌క్తికి, అంతే కాకుండా రానున్న హార్డేవ‌ర్ బిజినెస్‌లో అవ‌కాశాల‌ను అందిపుచ్చుకునేందుకు తాజా ఒప్పందం ఒక నిద‌ర్శ‌మ‌ని సెర్చ్ ఇంజిన్ దిగ్గ‌జం గూగుల్ ప్ర‌క‌టించింది.

గూగుల్ చేతికి హెచ్‌టీసీ పిక్సెల్ స్మార్ట‌ఫోన్ వ్యాపారం

ఈ ఒప్పందంతో హెచ్‌టీసీ సంస్థ‌కు చెందిన ఫోన్ మేథో హ‌క్కుల లైసెన్సు గూగుల్ సంస్థ‌కు ద‌క్క‌నుంది. తైవాన్ సంస్థ మిగిలిన స్మార్ట్‌ఫోన్ వ్యాపారం అలాగే కొన‌సాగుతుంది. దీర్ఘ‌కాలం భాగ‌స్వాములుగా కొన‌సాగుతున్న గూగుల్, హెచ్‌టీసీ ప‌లు అంశాల్లో వ్యాపారాన్ని కొన‌సాగిస్తూ వ‌స్తున్నాయి. అయితే హెచ్‌టీసీకి సంబంధించి పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ ద్వారా 20 శాతం వాటా వ‌స్తోంది. ఒక‌ప్పుడు ప్ర‌పంచంలో ప‌ది 10 ఫోన్ల‌లో ఒక‌దాన్ని హెచ్‌టీసీ అమ్మేది. అయితే శ్యామ్‌సంగ్ ఎల‌క్ట్రానిక్స్‌, చైనీస్ ఫోన్ త‌యారీదార్లు, యాపిల్ నుంచి వ‌చ్చిన పోటీతో ఇప్పుడు మార్కెట్ వాటా త‌గ్గింది.
2011లో హెచ్‌టీసీ స్మార్ట‌ఫోన్ వాటా 8.8% ఉండ‌గా గతేడాది ఇది 0.9 శాతానికి త‌గ్గిందని ఐడీసీ నివేదించింది. ఏడాది క్రిత‌మే లాంచ్ చేసిన పిక్సెల్ వాటా 1% కంటే త‌క్కువే ఉంటుంది. ఐడీసీ అంచ‌నాల ప్ర‌కారం 28 లక్ష‌ల ఫోన్లు కంపెనీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాయి. ప్ర‌స్తుతం గూగుల్; హెచ్‌టీసీ ఒప్పందం నియంత్ర‌ణ సంస్థ‌ల అనుమ‌తుల త‌ర్వాత 2018 ప్ర‌థమార్థంలో ముగిసే అవ‌కాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+