. ఆ ఆరు బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, భారతీయ మహిళా
సెప్టెంబరు 30 తర్వాత 6 అనుబంధ బ్యాంకులకు చెందిన చెక్కు పుస్తకాలు చెల్లవని ఎస్బీఐ నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. ఆ ఆరు బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, భారతీయ మహిళా బ్యాంకు. దేశమంతా ఒకే ఎస్‌బీఐ ఏర్పాటులో భాగంగా ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకును ఎస్‌బీఐలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఉద్యోగులంతా ఎస్‌బీఐ ప్రకారం పనిచేస్తుండగా మిగిలినవన్నీ ఒక్కొక్కటిగా ఎస్‌బీఐ విధానంలో కలిసిపోయాయి. ఇక మిగిలింది ఇది ఒక్కటే. దీంతో పాత చెక్కు పుస్తకాలను వదిలేసి దరఖాస్తుల ద్వారా కొత్త చెక్కు పుస్తకాలుగా మార్చుకోవాలని వినియోగదారులను ఎస్‌బీఐ కోరింది. అంతే కాకుండా సెప్టెంబరు 30 తర్వాత ఆయా బ్యాంకుల ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు సైతం పనిచేయవని తెలిపింది.
అంతే కాకుండా కనీస నిల్వ నిర్వహించని దానికి ఆయా ఖాతాలపై విధిస్తున్న కనీస పెనాల్టీలను సైతం సమీక్షిస్తోంది. గతంలో ఏప్రిల్‌లో కనీస నిల్వ లేకుండా ఉన్న ఖాతాలకు సంబంధించి చార్జీ(పెనాల్టీ)లను ప్రవేశపెట్టింది. 2012 తర్వాత మళ్లీ ఈ విధానంలోకి ఈ సంవత్సరమే వచ్చింది. "మా ఖాతాదారుల నుంచి కనీస నిల్వకు సంబంధించిన చార్జీల గురించి అభ్యర్థనలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ విధానం మీద సమీక్ష జరుపుతామ"ని ఎస్‌బీఐ ఎండీ రజనీష్ కుమార్ పీటీఐతో చెప్పారు.
కనీస నిల్వకు సంబంధించి సీనియర్ సిటిజన్లు, విద్యార్థుల విషయంలో విధానంలో మార్పులు ఉండొచ్చని ఎస్‌బీఐ తరపున ఆయన సూచన ఇచ్చారు. నెలవారీ కనీస నిల్వ ఖాతాలో లేకపోతే ఎస్బీఐ రూ.100, జీఎస్టీ పెనాల్టీ గా విధిస్తున్నది. కనీస గసటు నిల్వ మెట్రో నగరాల్లో రూ.5వేలు ఉండాలి. అలా లేకుండా 75% కంటే తక్కువ నిల్వ ఉంటే రూ.100(+జీఎస్టీ) అపరాధ రుసుము ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000 కనీస నిల్వ ఉండాలి. లేకపోతే రూ.20 నుంచి రూ.50 మధ్య పెనాల్టీ విధిస్తారు.


Click it and Unblock the Notifications