జియో హాట్‌స్పాట్ రూ.1000కే
టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో మరో ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. దసరా పండుగ సందర్భంగా ‘జియో ఫై' (JioFi) 4జీ హాట్‌స్పాట్ పరికరంపై ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ద
టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో మరో ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. దసరా పండుగ సందర్భంగా 'జియో ఫై' (JioFi) 4జీ హాట్‌స్పాట్ పరికరంపై ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. దసరా పండుగను పురస్కరించుకొని ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ కింద జియో ఫైను రూ. 999కే అందిస్తున్నట్లు జియో ప్రకటించింది. రూ. 1999 ధర ఉన్న 'జియో ఫై' పరికరంపై వెయ్యి రూపాయల తగ్గింపును ఇస్తున్నామని, ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుంచి ౩౦ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జియో పేర్కొంది.

4జీ ఫోను లేకపోయినా 4జీ వేగంతో డేటా, కాలింగ్ సదుపాయాలు పొందగలిగే సౌకర్యాన్ని 'జియో ఫై' కల్పిస్తుంది. జేబులో పెట్టుకొని తీసుకెళ్ళగలిగే ఈ బుల్లి పరికరంతో, వినియోగదారులు 3జీ లేదా 2జీ స్మార్ట్ ఫోన్లలో, లాప్ టాప్‌లలో జియో 4జీ సేవలను పొందవచ్చు. కుటుంబ సభ్యులు లేదా చిన్న సంస్థలోని సిబ్బంది జియో డిజిటల్ లైఫ్‌కి అనుసందానం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ తదితర 10 నుంచి 32 వైఫై పరికరాలను జియో ఫైతో అనుసంధానించుకోవచ్చు. జియో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్సైట్ల ద్వారా తమ పరికరాలపై వివిధ ఆఫర్లను అందిస్తోంది. చాలా ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ఇటీవల స్మార్టఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆపర్లను ప్రకటించాయి. పండుగ ఆఫర్లలో భాగంగా జియో వైఫై హబ్‌ను తక్కువ ధరకే అందించడం ఆసక్తికరంగా ఉంది.


Click it and Unblock the Notifications