For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభం... న‌ష్టం,మ‌ళ్లీ లాభం... చివ‌రికి స్వ‌ల్ప న‌ష్టం

స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు లాభాలు గడించడంతో, నిఫ్టీ కొత్త గరిష్టాలను తాకి రికార్డులు నమోదు చేసింది.

|

స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు లాభాలు గడించడంతో, నిఫ్టీ కొత్త గరిష్టాలను తాకి రికార్డులు నమోదు చేసింది. ఆ స్థాయిని నిలబెట్టుకోవడంలో సూచీలు విఫలం అయ్యాయి. కాసేపటికే ఇండెక్స్‌లు నష్టాల్లోకి జారుకోగా.. ట్రేడింగ్ చివరి వరకూ గత ముగింపు వద్దే సూచీలు ఊగిసలాడాయి.

 స్వ‌ల్ప న‌ష్టం

మిడ్ సెషన్ వరకూ నష్టాల్లోనే ఉన్న సెన్సెక్స్, నిఫ్టీ.. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో స్వల్ప లాభాల్లోకి చేరుకున్నాయి. అయితే.. గరిష్ట స్థాయిల వద్ద అమ్మకాల కారణంగా క్లోజింగ్ సమయానికి మార్కెట్లు మరోసారి నష్టాల్లోకి జారుకున్నాయి.

ఇవాల్టి ట్రేడింగ్ ముగిసే సమయానికి 21.39 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 32,402.37 వద్ద నిలిచింది. 5.55 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 10,147.55 దగ్గర క్లోజయింది. 11.40 పాయింట్లు నష్టపోయిన బ్యాంక్ నిఫ్టీ 25,035.50 దగ్గర ముగిసింది.
సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో టాటా మోటార్స్‌(4.58%), కొట‌క్ బ్యాంక్‌(1.63%), సిప్లా(0.61%), ఐసీఐసీఐ బ్యాంక్(0.6%), ఎన్టీపీసీ(0.54%) ముందుండ‌గా, మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో కోల్ ఇండియా(2.49%), హెచ్‌డీఎఫ్‌సీ(1.02%), ఎల్ అండ్ టీ(0.92%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(0.87%), స‌న్ ఫార్మా(0.84%) ఉన్నాయి.

English summary

లాభం... న‌ష్టం,మ‌ళ్లీ లాభం... చివ‌రికి స్వ‌ల్ప న‌ష్టం | Sensex ends marginally down

The Sensex and Nifty ended lower on Tuesday as financial stocks such as Housing Development Finance Corp dragged both indexes amid investor caution ahead of the US Federal Reserve's policy statement this week.
Story first published: Tuesday, September 19, 2017, 16:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X