మహీంద్రాతో జట్టుకట్టిన ఫోర్డ్
ఉత్పత్తుల తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు, దేశవిదేశాల్లో వాహనాల,ఉత్పత్తుల పంపీణీ వంటి పలు అంశాలకు సంబంధించి ఇరు సంస్థలు వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఫోర్డ్ మోటార్, ఎం అండ్ ఎం కంపెనీలు త
ఆటోమొబైల్ విభాగంలో వేగంగా మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తుల తయారీ,ఇతర అంశాలకు సంబంధించి పరస్పరం సహకరించుకునేందుకు ఫోర్డ్ మోటార్, ఎం అండ్ ఎం జట్టకట్టాయి. ఉత్పత్తుల తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు, దేశవిదేశాల్లో వాహనాల,ఉత్పత్తుల పంపీణీ వంటి పలు అంశాలకు సంబంధించి ఇరు సంస్థలు వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఫోర్డ్ మోటార్, ఎం అండ్ ఎం కంపెనీలు తాజా ఎంవోయూలో భాగంగా మొబిలిటీ ప్రోగ్రామ్స్, కన్సెప్ట్ వెహికల్ ప్రాజెక్ట్స్, ఎలక్ట్రిఫికేషన్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో పరస్పర సహకారం అందించుకోనున్నాయి.

ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మూడేళ్లపాటు కొనసాగుతుందని ఇరు కంపెనీలు తెలిపాయి. 'ఇదివరకు ఫోర్డ్ మోటార్‌తో కుదర్చుకున్న భాగస్వామ్యం పునాదులపైనే తాజా ఒప్పందం కుదిరింది. దీని వల్ల ఇరు కంపెనీలకు ప్రయోజనం ఉంటుంది' అని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడం, స్థిరమైన పాలసీల రూపకల్పన వంటి పలు అంశాల వల్ల ఆటోమోటివ్ పరిశ్రమలో మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. మారుతున్న మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ భాగస్వామ్యం కుర్చుకున్నామని తెలిపారు. 'భారత్ తమకు ప్రధాన మార్కట్. వినియోగదారులకు ఉత్తమమైన వాహనాలను, సర్వీసులను అందించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది' అని ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ జిమ్ ఫార్లీ తెలిపారు. కాగా 1990 మధ్యకాలంలో ఇరు సంస్థలు సమాన వాటాలతో మహీంద్రా ఫోర్డ్ ఇండియా అనే జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. తర్వాత ఫోర్డ్ కంపెనీ ఈ వెంచర్‌లో తన వాటాను పెంచుకుంది. దీంతో మహీంద్రా దాని నుంచి బయటకు వచ్చేసింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications