ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ సేల్‌లో భాగంగా ఆఫ‌ర్లు మీ కోసం

ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజ‌న్‌లో అంద‌రినీ సంతృప్తి ప‌రిచేందుకు వివిధ ర‌కాల చెల్లింపు ఆప్ష‌న్ల‌ను అందుబాటులో ఉంచింది. ఇక్క‌డ పేమెంట్ ఆప్ష‌న్ల గురించి తెలుసుకుందాం.

సెప్టెంబ‌రు 20 నుంచి 24 వ‌ర‌కూ బిగ్ బిలియ‌న్ డే సేల్ ఉంటుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ల‌పై గ‌రిష్టంగా 90% వ‌ర‌కూ ఆఫ‌ర్ ఇస్తున్నారు. ఇంకా టెలివిజ‌న్ సెట్లు, ఫ్రిజ్‌ల‌పై సైతం ఆకర్ష‌ణీయ ఆఫ‌ర్లున్నాయి. వివిధ బ్రాండ్ల ఫ్యాష‌న్‌, యాక్సెస‌రీస్‌, ఫ‌ర్నీచ‌ర్ సంబంధించి మంచి డీల్స్ ఉన్నాయి. అయితే ఈ పండుగ సీజ‌న్‌లో అంద‌రినీ సంతృప్తి ప‌రిచేందుకు వివిధ ర‌కాల చెల్లింపు ఆప్ష‌న్ల‌ను అందుబాటులో ఉంచింది. ఇక్క‌డ పేమెంట్ ఆప్ష‌న్ల గురించి తెలుసుకుందాం.

1. నో కాస్ట్ ఈఎమ్ఐ(అద‌న‌పు చెల్లింపుల్లేకుండా ఈఎంఐ)

1. నో కాస్ట్ ఈఎమ్ఐ(అద‌న‌పు చెల్లింపుల్లేకుండా ఈఎంఐ)

బజాజ్ ఫిన్‌స‌ర్వ్‌తో జ‌ట్టు క‌ట్టి ఫ్లిప్‌కార్ట్ ఈ ర‌క‌మైన ఆఫ‌ర్‌ను ఇచ్చింది. ఇందు కోసం ప్రీ అప్రూవ్డ్ లోన్ కార్డు తీసుకోవాలి. దీని ద్వారా మీకు నో కాస్ట్ ఈఎంఐ రూపంలో ఉత్ప‌త్తిని కొనుక్కోవ‌చ్చు. యాన్యువ‌ల్ రెన్యువ‌ల్ రుసుము రూ.99 తో రూ.349 ప్ర‌వేశ రుసుముతో ఈ కార్డు తీసుకోవ‌చ్చు. ఇంకా అవ‌స‌ర‌మైతే చిరునామా గుర్తింపు, ఫోటోల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఒక‌సారి కార్డు వ‌స్తే 12 నెల‌ల‌కు మించ‌కుండా ఈఎంఐ ఆప్ష‌న్ పెట్టుకునేందుకు వీలు క‌ల్పిస్తారు. కేవ‌లం ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ ద్వారా కొనుగోళ్లు జ‌రిపే వాళ్ల‌కు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంది.

2. ఎస్‌బీఐ కార్డుదారుల‌కు రాయితీలు

2. ఎస్‌బీఐ కార్డుదారుల‌కు రాయితీలు

ఎస్బీఐ డెబిట్‌,క్రెడిట్‌కార్డు క‌లిగిన వారికి పండుగ సీజ‌న్‌లో అద‌న‌పు రాయితీలు క‌ల్పిస్తున్నారు. కొనుగోలు విలువ రూ.5999 క‌నీసం ఉండేలా, రాయితీని గ‌రిష్టంగా రూ. 1500 వ‌ర‌కూ ప‌రిమితం చేశారు. ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ వోచ‌ర్లు, జియోమి రెడ్‌మి 3ఎస్‌, రెడ్‌మి 3ఎస్ ప్రైమ్‌, లెనోవో కే6 ప‌వ‌ర్‌, శ్యామ్‌సంగ్ మొబైల్స్‌లో చాలా వాటికి ఆఫ‌ర్లు వ‌ర్తించ‌వు. శ్యామ్‌సంగ్ మొబైల్స్‌లో శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఏ3, శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ నెక్స్ట్‌, శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఆన్‌5, శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఆన్‌7, శ్యామ్‌సంగ్ గెలాక్సీ జే5-6(2016 ఎడిష‌న్‌),శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఆన్‌8 మొద‌లైన వాటిపై ఆఫ‌ర్లు వ‌ర్తిస్తాయి.

3. ఇప్పుడు కొనండి... త‌ర్వాత చెల్లించండి

3. ఇప్పుడు కొనండి... త‌ర్వాత చెల్లించండి

యాప్ ద్వారా ఫ్లిప్‌కార్ట్లో కొనుగోళ్లు జ‌రిపే వారికి ఈ స‌దుపాయం క‌ల్పిస్తున్నారు. యాప్‌లో 'మై అకౌంట్స్' సెక్ష‌న్లో ఈ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. ఈ విధంగా ఉత్ప‌త్తి కొంటే మొద‌ట అది మీ అడ్ర‌స్‌కు వ‌స్తుంది. త‌ర్వాత దానికి సంబంధించిన బిల్లును ప్ర‌తి నెలా ఒక‌టో తేదీ పంపుతారు. 10వ తేదీ డ్యూ డేట్‌గా ఉంటుంది. ఒక‌వేళ మీరు చెల్లించ‌డంలో విఫ‌ల‌మైతే పెనాల్టీ విధిస్తారు. మీరు చెల్లించాల్సిన సొమ్ము ఆధారంగా ఇది ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు రూ.2వేలు క‌ట్టాల్సి ఉంటే రూ.100, 2,001-4,001 మ‌ధ్య చెల్లించాల్సిన సొమ్ము ఉంటే రూ.200, రూ.4001 పైన అయితే రూ.4000 పెనాల్టీ ఉంటుంది.

4. బై బ్యాక్ గ్యారెంటీ

4. బై బ్యాక్ గ్యారెంటీ

ఈ బిగ్ బిలియ‌న్ డే సేల్‌లో భాగంగా చాలా ఫోన్ల‌పై బై బ్యాక్ గ్యారెంటీ స‌దుపాయం ఉంది. ఈ ఆఫ‌ర్ ద్వారా ఒక నిర్ణీత ధ‌ర‌కు మీ ఫోన్‌ను రిటైల‌ర్ మ‌ళ్లీ తిరిగి కొంటారు. మీ కొత్త ఫోన్ ధ‌ర‌లోంచి దీన్ని మిన‌హాయిస్తారు. అయితే గ్యారెంటీ 6-8 నెల‌ల పాటు ఉంటుంది. ధ‌ర‌ను బ‌ట్టి కొన్నింటిపై 9-12 నెల‌లు కూడా ఉండొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మోటో Z2 ప్లే(ఫైన్ గోల్డ్,64జీబీ) ఫోన్ తీసుకుందాం. ఇది ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో రూ.27 వేలకు అందుబాటులో ఉంది. దీన్ని బై బ్యాక్ గ్యారెంటీ ఆప్ష‌న్ కింద కొనుక్కుంటే, రూ.12,400 మేర బై బ్యాక్ ధ‌ర‌తో 6-8 నెల‌ల పాటు గ్యారెంటీ వ‌ర్తిస్తుంది. 9-12నెల‌ల మ‌ధ్య అయితే రూ.10 వేలు వెన‌క్కు వ‌స్తుంది. ఇంకా ఈ సేవ‌ను పొందినందుకు గాను అద‌నంగా రూ.249 వ‌సూలు చేస్తారు.

కొత్త యూజ‌ర్ల‌పై గురి

కొత్త యూజ‌ర్ల‌పై గురి

ఇప్పుడున్న ఈ-కామ‌ర్స్ నివేదిక‌ల ప్ర‌కారం ఈసారి బిగ్ బిలియ‌న్ డేస్‌లో ఎక్కువ‌గా కొత్త వినియోగ‌దారుల‌పై ఫ్లిప్‌కార్ట్ గురిపెట్ట‌నుంది. ఇదివ‌ర‌కూ జ‌రిపిన ప్ర‌త్యేక షాపింగ్ ఫెస్ట్ రోజుల్లో ఫ్లిప్‌కార్ట్ ఎక్కువ‌గా సేల్ ప‌రిమాణంపై దృష్టిపెట్టింది.ఇదివ‌ర‌కటిలా కాకుండా ఈసారి యూజ‌ర్ బేస్‌ను పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఫ్లిప్‌కార్ట్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ స్మృతి ర‌విచంద్ర‌ణ్ చెప్పారు. టైర్‌-2, టైర్‌-3 పట్ట‌ణాల్లో ఇంట‌ర్నెట్ విస్తృతి శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న‌ది. ప్ర‌స్తుతం జియో,ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ ప్ర‌వేశ‌పెట్టిన డేటా ప్యాక్ ఆఫ‌ర్ల‌ మూలంగా తాము లాభ‌ప‌డాల‌ని ఫ్లిప్‌కార్ట్ యోచ‌న‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆల‌స్యం మీ మొబైల్ తీసుకుని యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఫ్లిప్‌కార్ట్ నుంచి మంచి ఆఫ‌ర్ పొందండి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+