బీఎస్ఎన్ఎల్ సైతం సొంత ఫోన్ తీసుకురానుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రిలయన్స్ జియోకి పోటీగా టెలికాం సంస్థలు తమవైన ఫోన్లను ప్రత్యేకంగా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల ఎయిర్‌టెల్ తన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను గురించిన వివరాలను ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.2700 స్థాయిలో ఆ ఫోన్ ధర ఉంటుంది. తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది.
దానికి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

తక్కువ దరలో ఫీచర్ ఫోన్
తక్కువ ధరలో ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయంతో ఈ ఫీచర్ ఫోన్ రానుంది. బీఎస్‌ఎన్‌ఎల్ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఇందుకోసం బీఎస్‌ఎన్‌ఎల్.. లావా, మైక్రోమాక్స్ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయంతో రూ.2000కే బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఫీచర్ ఫోన్‌ను తీసుకురానుంది.

అక్టోబర్ నాటికి మార్కెట్లోకి
రెండు సంస్థల భాగస్వామ్యంతో అక్టోబర్ నాటికి ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శ్రీవాస్తవ తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు దాదాపు 10.5కోట్ల మంది చందాదారులు ఉన్నారు. అయితే రెండు సంస్థల సహకారంతో తీసుకొచ్చే ఈ ఫీచర్ ఫోన్ తయారీకి ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

సెమీ అర్బన్ మీదే దృష్టి
దీపావళి పండుగలోపు ఈ ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మరంగా కసరత్తులు జరుగుతున్నాయి. సైబర్ మీడియా రీసెర్చ్(సీఎంఆర్) నివేదిక ప్రకారం దాదాపు 15శాతం ఆదాయం ఫీచర్ ఫోన్ల ద్వారా వస్తుండగా.. మార్కెట్లో ఇవి 57శాతం ఉన్నాయి. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు ఎక్కువగా ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ బీఎస్ఎన్ఎల్ ఫోన్‌కు ఎక్కువగా సెబీ అర్బన్‌లోనే స్పందన ఉంటుందని భావిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్ల మీద అంత ఆసక్తి లేకే .. ఇలా..
మొబైల్ మార్కెటింగ్ అసోసియేషన్(ఎంఎంఏ), కంతర్ ఐఎంఆర్‌బీ సంయుక్తంగా ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం 85శాతం ఫీచర్ ఫోన్ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ అయినా సరే అనవసరంగా కొంత మంది కొనేందుకు మొగ్గుచూపడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉచిత కాల్స్ అందించే ప్లాన్లు ప్రవేశపెట్టి రెవెన్యూలను పెంచుకునే దిశగా టెలికాం కంపెనీలు యోచిస్తున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications