For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తేజ్ యాప్ ద్వారా వాలెట్లో జ‌మ‌చేయ‌కుండా న‌గ‌దు బ‌దిలీ

డిజిట‌ల్ చెల్లింపులకు సంబంధించి ఒక యాప్‌తో గూగుల్ సైతం మ‌న దేశంలోకి ప్ర‌వేశిస్తోంది. అదేంటో ఇక్క‌డ తెలుసుకుందాం.

|

డిజిట‌ల్ వ్యాప్తిలో ఆసియాలో చైనా తర్వాత అంత ఎక్కువ‌గా వాడుక క‌లిగిన దేశం భార‌త‌దేశం. ఇక్క‌డ భ‌విష్య‌త్తులో డిజిట‌ల్ మీడియా, డిజిట‌ల్ చెల్లింపులు, డిజిట‌ల్ ప‌రిక‌రాల‌కు డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుందని ఆశిస్తున్నారు. దీంతో దేశంలో ప్ర‌ధాన బ్యాంకుల‌న్నీ త‌మ ఖాతాదారుల‌కు డిజిటల్ చెల్లింపుల కోసం అవ‌స‌ర‌మైన యాప్‌లు విడుద‌ల చేస్తున్నాయి. అదే కోవ‌లో డిజిట‌ల్ చెల్లింపులకు సంబంధించి ఒక యాప్‌తో గూగుల్ సైతం మ‌న దేశంలోకి ప్ర‌వేశిస్తోంది. అదేంటో ఇక్క‌డ తెలుసుకుందాం.

1. తేజ్ యాప్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు

1. తేజ్ యాప్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు

ప్ర‌పంచ సెర్చింజిన్ దిగ్గ‌జం గూగుల్ తేజ్ అనే ఆండ్రాయిడ్ యాప్‌ను ఈ రోజు ప్ర‌వేశ‌పెట్టింది. దీన్ని మొబైల్ యూజ‌ర్లు వారి బ్యాంకు ఖాతాల‌కు అనుసంధానించుకోవ‌చ్చు. త‌ద్వారా డ‌బ్బు చెల్లించే చోట న‌గ‌దు లేకుండా యాప్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు చేయ‌వ‌చ్చు. మీ కుటుంబ స‌భ్యుల‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఆన్‌లైన్‌లో డ‌బ్బు బ‌దిలీ చేయ‌వ‌చ్చు. ప‌క్క‌న కిరాణా కొట్టులో చిల్ల‌ర ఇబ్బంది లేకుండా తేజ్ యాప్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. రెస్టారెంట్ బిల్లు, పాల బిల్లు వంటివి ఈ యాప్ ద్వారా చెల్లించుకోవ‌చ్చు.

2. నేరుగా బ్యాంకు ఖాతా నుంచే

2. నేరుగా బ్యాంకు ఖాతా నుంచే

మిగ‌తా వాలెట్లలా మొద‌ట వాలెట్ రీచార్జీ చేసుకుని, త‌ర్వాత వాలెట్ నుంచి చెల్లింపులు చేయ‌న‌క్క‌ర్లేదు. నేరుగా బ్యాంకు ఖాతా నుంచే తేజ్ ద్వారా చెల్లింపులు చేయ‌వ‌చ్చు. మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డ‌బ్బు భ‌ద్రంగా ఉంటూ, దానిపై మీరు వ‌డ్డీ పొందుతూనే ఉంటారు. ప్ర‌స్తుతానికి తేఝ్ యూపీఐ చెల్లింపు విధానాన్ని ఉప‌యోగిస్తున్న‌ది. దీంతో యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ మొదలైన బ్యాంకులు భాగ‌స్వామ్యంతో ఉన్నాయి.

3. భ‌ద్ర‌త విష‌యంలో భ‌రోసా

3. భ‌ద్ర‌త విష‌యంలో భ‌రోసా

తేజ్ షీల్డ్ ఉండ‌టం వ‌ల్ల చెల్లింపులు సురక్షిత‌మ‌నే భ‌రోసా ఉంటుంది. మోసాలు అరిక‌డుతూ, హ్యాకింగ్ కాకుండా ఉండేందుకు తేజ్ షీల్డ్ 24/7 ప‌నిచేస్తూనే ఉంటుంది. ప్ర‌తి లావాదేవీ యాపిఐ పిన్ సాయంతో భ‌ద్రంగా చేసే వీలుంది. యాప్ సైతం ఫింగ‌ర్‌ప్రింట్ లాక్ లేదా గూగుల్ పిన్‌తో లాక్ చేయ‌వ‌చ్చు. ఏదైనా సాయం కావాలంటే హెల్ప్ సెంట‌ర్ ఏ స‌మ‌యంలోనైనా ప‌నిచేస్తుంటుంది.

4. చెల్లింపుల కోసం

4. చెల్లింపుల కోసం

ఎవ‌రికైనా డ‌బ్బు త‌క్ష‌ణ‌మే అవ‌స‌ర‌మైతే, వాళ్ల ద‌గ్గ‌ర తేజ్ యాప్ ఉంటే మరే వివ‌రాలు అక్క‌ర్లేకుండా డ‌బ్బు యాప్‌లోనే బ‌దిలీ చేయ‌వ‌చ్చు. బ్యాంకు ఖాతా లేదా ఫోన్ నంబ‌రు సైతం అవ‌స‌రం లేకుండ‌టం దీని ప్ర‌త్యేక‌త‌. న‌గదును సులువుగా వేరొకరికి బ‌దిలీ చేయ‌డంతో పాటు ఇక్క‌డ ముఖ్యంగా భ‌ద్ర‌త ఉంటుంది.

 5. భార‌తదేశం కోసం

5. భార‌తదేశం కోసం

ఎక్కువ శాతం స్మార్ట్‌ఫోన్ల‌లో దాదాపు దేశంలోని అన్ని బ్యాంకు ఖాతాల విష‌యంలోనూ ఈ తేజ్ యాప్ ప‌నిచేస్తుంది. కాబ‌ట్టి చెల్లింపులు చేయ‌వ‌చ్చు, అదే విధంగా మీ తేజ్ యాప్‌లోకి డ‌బ్బు ఎవ‌రితోనైనా పంపించుకోవ‌చ్చు. అంతే కాకుండా ఇది ఆంగ్ల‌, హింతీ, గుజ‌రాతీ, క‌న్న‌డ‌, మ‌రాఠి, త‌మిళం, తెలుగు భాష‌ల‌ను స‌పోర్ట్ చేస్తుంది. కాబ‌ట్టి సామాన్యులు అర్థం చేసుకోవ‌డానికి సులువైన‌ది.

Read more about: google tez
English summary

తేజ్ యాప్ ద్వారా వాలెట్లో జ‌మ‌చేయ‌కుండా న‌గ‌దు బ‌దిలీ | TEz from Google a mobile payments app for India

, today Google officially unveiled its first big foray into mobile payments in Asia. The Android and search giant has launched Tez, a new mobile wallet in India that will let users link up their phones to their bank accounts to pay for goods securely in physical stores and online, and for person-to-person money transfers.
Story first published: Monday, September 18, 2017, 10:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X